అసలేం జరిగింది?
కైకలూరు లో ఎం జరిగినా మేమున్నాం అనే పెద్దన్నలు వారి బలగం:
1. కైకలూరు: సంత మార్కెట్ భూమి వివాదం సంఘటన నిజా నిజాలు తెలుసుకునే ముందు దీని వెనకుండి నడిపిస్తున్న మేడిశెట్టి పాము మరియు పిచ్చుకుల పవన్ గురించి వారితో జత కలిసి దందాలు చేసే కొందరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
2. కైకలూరు: కోర్ట్ AGP (Assistant Government Pleader) మేడిశెట్టి పాము మరియు పిచ్చుకుల పవన్, వీరిద్దరికీ న్యాయవాద వ్రుత్తి ద్వారా చట్టంలోని లొసుగులు బాగా తెలుసు, దీనిని ఆసరాగా తీసుకుని న్యాయవాద వృత్తికి చెదలు పట్టించడం మొదలు పెట్టారు, వీరికి వారి సామాజిక వర్గంలోని కొందరి ద్వారా ధన బలం చేకూరింది, అదే సామాజిక వర్గంలోని ఇంకొందరు మజిల్ పవర్ తో అక్రమ వడ్డీ వ్యాపారం, రౌడీయిజం చేస్తూ జతకలిసారు వీరికి తోడు కోస్తా ప్రభ అనే ఒక తోక పత్రిక. అంతా కలిసి వీరి భాదితులకు వ్రుత్తి ధర్మం వీడి అన్యాయాలు, అక్రమాలు చేస్తూ అనైతిక మార్గాల ద్వారా కైకలూరుని ఎలా దోపిడీ చేస్తున్నారో చదవండి.
3. న్యాయ వ్యవస్థ, సామజిక వర్గం, రౌడీయిజం, డబ్బు, అనైతిక మీడియా జత కలవడం ద్వారా కైకలూరు గ్రామంలో ఈ దోపిడీ ముఠా దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత దశాబ్ద కాలంగా కైకలూరు నియోజకవర్గం నుంచి సామాజికంగా బలహీన వర్గాల్ల్లోని కొందరు వ్యాపారస్తులు, చిరుద్యోగులు, పెన్షనర్లు, మహిళలను టార్గెట్ చేసుకుని వీరి దందాలు నిరాటంకంగా సాగాయి, సాగుతూనే వున్నాయి బయటకు వచ్చిన భాదితులు కొందరే రాని వారు ఎందరు?
4. వీరి బాదితుల ఆర్దిక అవసరాలను అలుసుగా తీసుకుని అప్పు ఇచ్చేది ఒకరు, ఆ అప్పులకు వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీలు వేసి ఆస్తులు లాక్కునే రౌడీ బ్యాచ్చు ఇంకొకరు, వీరికి న్యాయ సలహాలు ఇచ్చి బాదితుల పైన అక్రమ చెక్కు కేసులు వేసి ఆస్తులు లాక్కోవడానికి సహకరించేది లాయర్లు మేడిశెట్టి పాము మరియు పిచ్చుకుల పవన్. డిపార్టుమెంటు పరంగా కూడా కొందరు అధికారులు వీరికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి, వీళ్ళందరిని కవర్ చేస్తూ మీడియా పరంగా సోది ప్రభ పత్రిక ఎడిటర్ ఒకరు.
5. ఇలా బాదితుల పక్షాన నిలవాల్సిన లా & అడ్మినిస్ట్రేషన్ మరియు మీడియా ఈ అక్రమ దందాలలో దశమ భాగాలకు కక్కుర్తి పడి వారి వ్రుత్తిలోని లొసుగులను సొమ్ము చేసుకోవడానికి కొందరి అక్రమ వడ్డీ వ్యాపారాలకు, భూ బకాసురులకు, కాల్ మనీ దందాలకు సపోర్ట్ చేస్తు వచ్చారు.
*పెద్దన్నల బలగానికి నవశకం చెక్:*
6. మాకు ఇవ్వాల్సింది మాకు ఇస్తే మీరు ఏమి చేసినా చెల్లుతుంది న్యాయ వ్యవస్థను, అధికారులను, మీడియా వారిని మేము మేనేజ్ చేస్తాం అని మేడిశెట్టి పాము మరియు పిచ్చుకుల పవన్, ఇచ్చిన భారోసా కారణంగానే మోసం, దగ, కుట్ర, దోపిడీ, రౌడీయిజంతో కైకలూరు నియోజకవర్గ ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు మైగాపుల రామాంజనేయులు ( ఇతని దగ్గర అప్పు తీసుకుని ఇరుక్కుంటే పక్క రాష్ట్రాల్లో చెక్కు బౌన్సు కేసులు వేయడం బాధితుల ఇళ్ళల్లో టీవీలు, ఫ్రిజ్జులు, కుర్చీలు, బల్లలు ఇల్లు గుల్ల చేసేవరకు ఊరుకోడు అని బాదితులు నవశకం మీడియా దృష్టికి తీసుకు వచ్చారు ) అల్లుడు అయిన రాజా అనేక మంది యువతులపైన లైంగిక దాడులు చేయగా ఒక యువతి ముందుకు వచ్చి లైంగిక దాడి చేసి మోసం చేసిన సంఘటన నవశకం మీడియా దృష్టికి రాగా నవశకం చేసిన పోరాట ఫలితం వలన మైగాపుల రామాంజనేయులు అల్లుడు అయిన రౌడీ షీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా అతని తండ్రి BJP పార్టీ ఇంచార్జి అయిన గరికిపాటి రాంబాబు అను వారికి రిమాండ్ విదించిన విషయం తెలిసిందే. (లింక్స్ క్రింద ఇస్తున్నాము)
8. AGP మేడిశెట్టి పాము మరియు పిచ్చుకుల పవన్ గార్ల అక్రమాల్లో మీడియా భాగస్వామ్యుడు అయిన కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలు, అక్రమ సంపాదనలను నవశకం – మీడియా హౌస్ ద్వారా వెలుగులోకి తేవడం వలన, కూర్మ ప్రసాద్ బాబు భార్య మాకు తినడానికి తిండి కూడా లేకుండా చేసి మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా రెండో పెళ్లి చేసుకుని మాకు అన్యాయం చేశాడు అని నవశకం అండతో కంప్లైంట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరింది ఈ అక్రమ వసూళ్ళు కేసులో, భార్య ను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న కేసులో జైలుకి వెళ్ళడమే కాక కైకలూరు పోలీసు ద్వారా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. (లింక్స్ క్రింద ఇస్తున్నాము)
ఈ అక్రమార్కుల దందాలలో భాగస్వామ్యులు అయిన ఒక్కొక్కరి భాగోతం నవశకం మీడియా ద్వారా వెలుగులోకి రావడం వారు అరెస్టు కావడం జైలు పాలు కావడం అనే విషయాన్ని జీర్ణించుకోలేక పెద్దన్నలు వారి లాయర్ బుర్రలకు పదును పెట్టి చేసిన ఇంకొక ఘనకార్యం చదవండి
9. AGP పిచ్చుకుల పాము మరియు మేడిశెట్టి పవన్ కైకలూరు మార్కెట్ యార్డ్ స్థలంలో సంఖ్యాపరంగా తక్కువగా వున్న ఒక సామజిక వర్గపు భూమిని దోచుకోవడానికి సహకరించి లబ్ది పొందటానికి చేసిన కుట్ర ఏమిటి?
*40 సంవత్సరాల చరిత్ర*
👉1981 వ సంవత్సరం అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం మండల సుబ్బారావు గారు అతని బందువు అయిన మండల శ్యామల రావు గారి దగ్గర సంత మార్కెట్ నందు వున్న 884 స్క్వేర్ యార్డ్స్ కొని రిజిస్టర్ చేసుకున్నారు,
అప్పటికే మండల శ్యామల రావు గారు ఆ స్థలంలో చిన్న జమ్ము ఇళ్ళు వేసి అద్దెకు ఇవ్వగా అప్పటికే అందులో ఒక భాగంలో బొబ్బిలి పెద్ది రాజు (లేట్) అనే వ్యక్తి అద్దెకు వుంటున్నారు. ఈ లావాదేవీలు జరగడం స్థలం కొత్త ఓనర్ కి రిజిస్టర్ అవడం వలన అందులో నుంచి లాభం పొందాలి అనే దుర్బుద్ధితో బొబ్బిలి పెద్ది రాజు (లేట్) ఫేక్ డాకుమెంట్స్ సృష్టించి స్థలం మొత్తం కాజేయాలనే పధకం రచించి మచిలీపట్టణం కోర్ట్ నందు కేసు వేశారు.
👉1987 వ సంవత్సరంలో మచిలీపట్నం కోర్ట్ ఆ డాకుమెంట్స్ ని పరిశీలించి బొబ్బిలి పెద్ది రాజు గారు కోర్టుకి సమర్పించినవి నకిలీ డాకుమెంట్స్ అని నిర్దారించి 1987 వ సంవత్సరంలో మండల సుబ్బారావు గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
👉1987 సంవత్సరంలో బొబ్బిలి పెద్ది రాజు గారు మచిలీపట్నం కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ హై కోర్టునకు అప్పీలుకి వెళ్లారు.
👉 2006 వ సంవత్సరంలో బొబ్బిలి పెద్ది రాజు గారి అప్పీలుని హై కోర్ట్ కొట్టేసి తిరిగి మండల సుబ్బారావు గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
👉 2012 వ సంవత్సరంలో హై కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత కుడా బొబ్బిలి పెద్ది రాజు గారు స్థలాన్ని ఖాళీ చేయకుండా సామాజిక వర్గ బలంతో అతని ఆక్రమణ లోనే పెట్టుకున్నారు. ఇందు కొరకు తిరిగి మచిలీపట్టణం కోర్ట్ నందు మండల సుబ్బారావు గారు సదరు వివాదంలో వున్న సదరు స్థలాన్ని డెలివరీ ఇప్పించవలసిందిగా పిటీషన్ దాకలు చేయగా
👉 2019 వ సంవత్సరంలో కైకలూరు కోర్ట్ మచిలీపట్నం కోర్ట్ ఆదేశాలను అమలు చేసి సదరు స్థలాన్ని కాళీ చేయించి మండల సుబ్బారావు గారికి స్థలాన్ని కాళీ చేయించి డెలివరీ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చింది.
👉 2019 వ సంవత్సరంలో కోర్ట్ అమీనా కోర్ట్ డిక్రీ అమలు చేయడానికి సదరు స్థలం వద్దకు రాగా అప్పటికే ఆ స్తలంలో అక్రమంగా ఉంటున్న బొబ్బిలి పెద్ది రాజు కూతురు అయిన సుంకర మాధవి కోర్ట్ అమీనా కాళ్ళ మీద పడి ఒక్క నెల రోజులు సమయం ఇవ్వండి ఖాళీ చేస్తాను అని ప్రాదేయపడగా మానవత్వ దృక్పదంతో ఆలోచించి కొంత సమయం ఇవ్వడం జరిగింది.
👉 2020 వ సంవత్సరంలో ఈ నెల రోజుల సమయాన్ని సుంకర మాధవి గారు లాయర్ పాము, పవన్ క్రిమినల్ సలహాతో అదే స్థలంలో అద్దెకు ఉంటున్న చికెన్ షాప్ యజమానితో ఇంకొక కేసు వేయించింది ఈ ఇష్యూని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించడానికి పధకం వేసింది.
👉 2022 వ సంవత్సరం మర్చి నెలలో ఆ చికెన్ షాప్ యజమాని ఆ కేసుని వెనక్కి తీసుకుని ఆ స్థలం నుంచి కాళీ చేయడం జరిగింది. అదే సమయంలో కోర్ట్ ఉత్తర్వుల కాపీలను బొబ్బిలి పెద్ది రాజు (లేట్) కూతురు అయిన సుంకర మాధవి గారికి అందచేసి నెల రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని అభ్యర్దించడం జరిగింది.
👉 బొబ్బిలి పెద్ది రాజు (లేట్) వారసులు అయిన బొబ్బిలి రాము మరియు కూతురు అయిన మాధవి గార్లు సంవత్సరాల తరబడి కోర్ట్ కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారు దీనికి సహేతుక పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో కైకలూరు వైస్ సర్పంచ్ శ్రీ పోతు రాజు గారి సమక్షంలో సెటిల్మెంట్ పెట్టి వారి 5 సెంట్ల స్థలంతో పాటు అదనంగా ఒకటిన్నర సెంట్ల భూమిని బొబ్బిలి పెద్ది రాజు గారి వారసులకు ఇచ్చే లాగున మిగిలిన 16 సెంట్ల స్థలంలో ఫెన్సింగ్ వేసుకుని మండల సుబ్బారావు గారు డెవలప్ చేసుకునే లాగున పెద్దమనుషుల మధ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది.
👉 ఈ ఒప్పందం తర్వాత మండల సుబ్బారావు గారు జాన్ పేట గ్రామస్తులను కూలికి పిలిచి తన పరిధిలో ఫెన్సింగ్ వేసుకుని తన స్థలాన్ని బాగు చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ పెద్దమనుషుల ఒప్పందం జరిగిన తర్వాత బొబ్బిలి పెద్ది రాజు కొడుకు అయిన బొబ్బిలి రాము గారికి కూతురు మాధవి గారికి మధ్య ఈ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన భూమి పంపకాల్లో వచ్చిన తేడా వలన లాయర్ పాము మరియు పవన్ సలహాతో మాధవి గారు నాకు ఈ స్థలం మొత్తం కావాల్సిందే నా జోలికి వస్తే మీ మీద రేప్ కేసు పెడతాను అని బెదిరించడం ఆ స్థలంలో పని చేస్తున్న జాన్ పేట గ్రామస్తులను కులం పేరుతో దుర్భాషలు ఆడి బెదిరించడం మండల సుబ్బారావు గారి దగ్గర డబ్బు గుంజాలని ప్రయత్నం చేయడం జరిగింది.
👉 23-4-2022: ఇదిలా వుండగా మండల సుబ్బారావు గారు కోర్ట్ తీర్పు ద్వారా అతనికి చెందిన స్తలంలో జాన్ పేట గ్రామానికి చెందిన కొంతమంది మహిళలతో మట్టి పని చేయించుకుంటుండగా కోట్ల విలువ చేసే 16 సెంట్ల స్థలం వదులుకోవడానికి ఇష్టం లేక బొబ్బిలి పెద్ది (లేట్) రాజు కూతురు అయిన సుంకర మాధవి లాయర్ పాము మరియు పవన్ గార్ల క్రిమినల్ సలహాతో ది 23-4-2022 తేదిన అదే 16 సెంట్ల స్థలంలో ఒక మూలగా వున్న పాడుబడిన పెంకుటిల్లుని తానే స్వయంగా ఇంటిని కూల్చి తనని రేప్ చేయడానికి ప్రయత్నం చేశారు, తని ఇంటిని కుల్చారు అని పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది.
👉 తానే అక్కడ వున్నా పాడుబడిన ఇంటిని కూల్చి అక్కడ పనిచేస్తున్న జాన్ పేట గ్రామానికి చెందినా మహిళల్ని కులం పేరుతో దూషించారు, దౌర్జన్యం చేస్తున్నారు అనే సమాచారంతో మీడియా వారితో పాటు సంఘటనా స్థలానికి వెళ్ళిన నవశకం మీడియా ఎడిటర్ పైన దొరికిందే అవకాశం అని పాము, పవన్ సలహాతో బొబ్బిలి పెద్ది రాజు కూతురు అయిన మాధవి కూలి పనికి వెళ్ళిన దళితుల మీద జరిగిన దాడి అన్యాయన్ని కవర్ చేయడానికి న్యాయం కోసం వెళ్ళిన నవశకం మీడియా ఎడిటర్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది.
👉 సంఘటనా స్థలానికి వెళ్ళిన నవశకం మీడియా వారికి అక్కడ సివిల్ పోలీసులం అంటూ ఖాకీ యూనిఫాంలో వున్న కైకలూరు ఫైర్ డిపార్టుమెంటు వారు జాన్ పేట గ్రామం నుంచి కూలిపనికి వెళ్ళిన దళిత మహిళలపైన మేము సివిల్ పోలీసులం అంటూ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటన కంటపడింది, మీ పరిధి ఫైర్ డిపార్టుమెంటు వరకే కానీ దానిని మీరి సివిల్ పోలీసులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తున్నారు అని నిలదీయగా వారు అక్కడి నుంచి పరారి అయ్యారు.
👉 ఈ సంఘటనను దారి మరల్చి లబ్దిపొందడానికి AGP (Assistant Government Pleader) అనే గౌరవ ప్రధమైన వృత్తిలో వున్న పిచ్చుకుల పాము Whatsaap గ్రూప్ లలో కుల సమీకరనలు చేస్తూ, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. (ఇందుకు ఆధారాలు నవశకం వద్ద వున్నాయి).
👉 నిష్పక్ష పాతంగా నిస్సహాయ బాదితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతూ అక్రమార్కులను, దోపిడీదారులను చట్ట పరిదిలోనికి తీసుకు రావడమే నవశకం చేస్తున్న తప్పా?
👉 సామాజికంగా బలహీనమైన వారి భూములను పైవారు లాక్కోవడాన్ని ఖండించి బాదితులకు న్యాయం కోసం పోరాడటమే నవశకం చేస్తున్న తప్పా?
*ఎవరు దేనికోసం నిలబడి పోరాటం చేస్తున్నారో ప్రజలే నిర్ణయించండి.*

——————————————
రౌడీ షీటర్ గరికపాటి రాజా మరియు అతని తండ్రి గరికపాటి రాంబాబుకి రిమాండ్
https://navasakam.in/rowdysheeter-garikipati-raja-remanded-for-14days/
రౌడీ షీటర్ గరికపాటి రాజా అరెస్ట్ కి జాప్యం ఏమిటి?
https://navasakam.in/why-are-police-not-arresting-rowdsheeter-garikipati-raja/
కైకలూరు పోలీస్ స్టేషన్లో రౌడి షీటర్ల డిస్ప్లే బోర్డు మాయం?
https://navasakam.in/rowdysheeters-display-board-missing-from-kaikaluru-police-station/
కైకలూరు: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ రౌడీషీటర్ లైంగిక దాడి…
https://navasakam.in/rowdysheeter-garikipati-raja-from-kaikaluru-booked-for-sexual-assault/
కైకలూరు: రౌడి షీటర్ కి కాపు కాస్తున్న కుల పెద్దలు?
https://navasakam.in/who-is-protecting-rowdysheeter-garikipati-raja/
——————————————
కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారు చేస్తున్న అక్రమాల పైన, దోపిడీ బెదిరింపుల పైన ప్రెస్ మీట్ – కైకలూరు.
https://navasakam.in/pressmeet-on-kostha-prabha-papaer-editor-kurma-prasad-atrocities/
కోస్తా ప్రభ అనే కైకలూరు గ్రామానికి చెందిన స్థానిక పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్బా బు గారి దోపిడీ/ అక్రమాల నిజ స్వరూపం.
https://navasakam.in/extortions-of-kaikaluru-local-news-paper-kosta-prabha-editor-kurma-prasad-babu/
కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారి భార్య శ్రీమతి విజయ గారు ప్రసాద్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ – కైకలూరు.
https://navasakam.in/kosta-prabha-newspaper-editor-prasads-wife-press-meet-on-his-atrocities/
కోస్తా ప్రభ అనే పత్రికను అడ్డు పెట్టుకుని అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడిన కోస్తా ప్రభ ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబుని అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ విధించిన కైకలూరు న్యాయమూర్తి.
https://navasakam.in/kosta-prabha-editor-kurma-prasad-babu-arrested-by-kaikaluru-police-on-extortion-charges/
ఈ సంఘటన గురించి చర్చ చేయడానికి నవశకం మీడియా డిస్కషన్ గ్రూప్ నందు జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. చర్చకు ఆహ్వానం.
✍️ *విజయ్ కుమార్ వంగలపూడి*
Editor – Navasakam – Media House
Web & Graphic Designer
Human Rights Activist
For more Information Join our WhatsApp group
https://chat.whatsapp.com/L2BJHigiY5rLGz3qZW70hO
👉 నవశకం సోషల్ మీడియా ని ఫాలోకండి
👉Facebook: fb.com/Navasakam
👉Website: https://navasakam.in/
👉Twitter: Twitter.com/Navasakam_Media
👉Instagram: instagram.com/NavasakamMedia
👉YouTube: youtube.com/c/NavasakamMedia
👉YouTube Subscribe: https://bit.ly/NavasakamMediaHouse
—————————