
👉 కైకలూరు (Kaikaluru) మండలం, ఆటపాక (Atapaka) పంచాయతీ, జాన్ పేట (John Peta) గ్రామంలో నవయాన్ బుద్ధిష్ట్ సొసైటీ ద్వారా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (Ambedkar Knowledge Center) మరియు బుద్ధవిహార్ (Buddha Vihar) నకు కైకలూరు శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు (Dulam Nageswara Rao) గారి చేతుల మీదుగా, MLC జయమంగళ వెంకటరమణ (Jayamanagala Venkataramana) ముఖ్య అతిధిగా బుద్ధిష్ట్ సొసైటీ అఫ్ ఇండియా (Buddhist Society of India) తరపున ఏలూరు జిల్లా కన్వీనర్ శ్రీ రవీంద్రనాద్ పాము గారు బౌద్ద సాంప్రదాయం ప్రకారం పంచశీల చదవగా జాగృతి విద్యాసంస్థ అధినేత శ్రీ కిషోర్ పాణెం సభ నిర్వహణలో ఈ శంకుస్తాపన కార్యక్రమం చేయడం జరిగింది.
👉 “భోదించు పోరాడు సమీకరించు” అనే ఘనమైన అంబేద్కర్ వారసత్వాన్ని నిలబెట్టడానికి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు బుద్ధవిహార్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నందు దళిత బహుజనులకు నాణ్యమైన “విద్య” మరియు వ్రుత్తి నైపుణ్యాలు వృద్దిచేసుకోవడం, మానవహక్కుల పోరాట కేంద్రంగా, సంఘ అభివృద్ధి, సంఘాల మధ్య సామరస్యం ముఖ్య అంశంగా వుంటుంది బుద్ధ విహార్ ద్వారా కుల రహిత సమాజ స్తాపన కొరకు ఉచిత ఇంటర్ క్యాస్ట్ మరియు ఇంటర్ ఫెయిత్ పెళ్ళిళ్ళు ముఖ్య లక్ష్యంగా నడుస్తుంది.
👉 కైకలూరు నియోజకవర్గ దళిత బహుజనుల విద్యాభివృద్ది కొరకు, ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ MLA శ్రీ DNR గారి ద్వారా కేటాయించబడిన 10 సెంట్ల స్థలం నందు ప్రపంచ స్తాయి కంప్యూటర్ ల్యాబ్, కాన్ఫరెన్స్ రూమ్, ఆధునిక లైబ్రరీ నిర్మాణం జరుగుతుంది. ఈ మహత్తర నిర్మాణానికి స్థలం కేటాయించిన కైకలూరు MLA శ్రీ DNR గారికి, DNR గారి ఆదేశాలతో ఆటపాక గ్రామ పంచాయతీ తరపున స్థల కేటాయింపు ఉత్తర్వులు జారీచేసిన ఆటపాక సర్పంచ్ తలారి జాన్ మణి గారికి నవయాన్ టీం తరపున ధన్యవాదాలు.
👉 ఈ కార్యక్రమానికి ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్సు మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ Dr గోవాడ వీర్రాజు గారు ముఖ్య వక్తగా తమ అద్బుతమైన సందేశం అందించారు.
👉 ఈ శంకుస్తాపన కార్యక్రమానికి ఆటపాక సర్పంచ్ శ్రీమతి తలారి మణి జాన్ గారి అధ్యక్షత వహించగా కైకలూరు MPP శ్రీ అడివి కృష్ణ, ముదినేపల్లి MPP శ్రీ రామిశెట్టి సత్యనారాయణ, కైకలూరు సర్పంచ్ శ్రీమతి దానం నవరత్న కుమారి, వరహాపట్నం సర్పంచ్ శ్రీమతి నాగమణి , ఆటపాక MPTC లు శ్రీ బాలమ్మ మరియు శ్రీమతి తమ్మిశెట్టి లక్షి, తాడినాడ ప్రెసిడెంట్ యేసు బాబు, కైకలూరు మండలం సర్పంచుల ఫోరం అద్యక్షులు బలరాం రాజు, మండవల్లి సర్పంచుల ఫోరం అద్యక్షులు బేతపూడి రాజు ముఖ్య అతిధులుగా, ఆటపాక ఉప సర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, ex సర్పంచ్ కొదమల సురేష్, YSRCP నాయకులు తులసి పూర్ణ ముఖ్య అతిదులుగా,
👉 సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ కురెళ్ల ప్రసాద్ బాబు, దళిత ఉద్యమకారులు శ్రీ రమేష్ పలిమిల, Dr గుర్రం సీతారాములు, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ సృజన్, ప్రభుత్వ ఉపాద్యాయులు దానం ప్రసాద్ బాబు, సుమ మాల సేవా సంస్థ అద్యక్షులు షాలెం రాజు, హై కోర్ట్ అడ్వకేట్ రుద్రపాక రత్నరాజు విశిష్ట అతిదులుగా,
👉 YSRCP నాయకులు తేరా ఎడ్విన్, ముదినేపల్లి YSRCP మండల పార్టీ ప్రెసిడెంట్ మొట్రు ఏసుబాబు, ఆటపాక YSRCP నాయకులు కన్నా రమేష్, కన్నా ముసలయ్య, అంబేద్కర్ యూత్ భుజబలపట్నం టీం, దానిగుడెం అంబేద్కర్ యూత్ టీం, ప్రవీణ్ భూపతి, చిన్ను శ్యాం, రాజేష్ మనిమేల, సిద్దాబత్తుల శ్రీరామ మూర్తి, గుమ్మా వెంకన్న, పెద్ది రాజు, జాన్ పేట గ్రామ పెద్దలు రాఫాయేలు, సద్గుణరావు పాలపర్తి, గొనా శరత్, చంటి గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున ఈ శంకుస్తాపన కార్యక్రమాన్ని హాజరయ్యారు.
👉 నవయాన్ బుద్ధిష్ట్ సొసైటీ (Navayan Buddhist Society) ఫౌండర్ డైరెక్టర్ విజయ్ కుమార్ వంగలపూడి (Vijay Kumar Vangalapudi), ప్రెసిడెంట్ శ్రీ జాన్ తలారి, సెక్రటరీ మదన్ కుమ్మరికుంట, ట్రెజరర్ కిరణ్ పాణెం, డైరెక్టర్ సతీష్ కునవరపు, కమిటీ మెంబర్లు విల్సన్ రుంజల, రవి వంగేవరపు, విజయ్ రాయినూతల, శేషు మాసిపోగు, రాజా మాసిపోగు, సురేష్ పాలపర్తి, శంఖుస్తాపన కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియచేశారు.

























