సామాజిక న్యాయం చేకూర్చడం లోనూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను సమతౌల్యంగా అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాధినేత జగనన్న కు సాటి మరొకరు లేరని వైఎస్సార్ కుటుంబసభ్యుడినని చెప్పుకోవడానికి తనకెంతో గర్వంగా ఉందని కైకలూరు శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు అన్నారు. ఈ ఉదయం కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే DNR ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడం లోనూ..తనను ఎన్నుకున్న ప్రజలకోసం కష్టపడి పనిచేయడంలోనూ గౌరవ శాసనసభ్యులు DNR ముందువరుసలో ఉన్నారని..అటువంటి వారి నాయకత్వంలో మేము నడవటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.నూతనంగా AMC చైర్మన్ గా నియమించబడ్డ దండే పుష్పలతకి,వైస్ చైర్మన్ జంపన కొండరాజు కి ఇతర డైరెక్టర్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలువుతున్నానని అన్నారు.ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ జగనన్న ఆదేశం వారి మాట బాట తనకు శిరోధార్యం అన్నారు. జగనన్న ఆలోచనావిధానంలో భాగంగానే అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చెయ్యగలుగుతున్నామని అన్నారు.రాష్ట్రంలో ఒక ప్రక్క సంక్షేమాన్ని విస్తృత స్థాయిలో కొనసాగిస్తూ మరోప్రక్క అభివృద్ధి చేసి చూపుతున్నారన్నారు. పని పాటా లేని ప్రతిపక్షాలు కుళ్ళుకుని బురదచల్లే ప్రయత్నాలు చెయ్యడం సిగ్గుచేటని అన్నారు.
కుటిలయత్నాలు,విషప్రచారాలు చేసే స్థానిక ప్రతిపక్ష నేతలకు మరోసారి భంగపాటు తప్పదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 50 కోట్ల నిధులతో రోడ్లు నిర్మించడమే కాకుండా మరో 50 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.నూతన పాలకవర్గం తమకు వచ్చిన..జగనన్న ఇచ్చిన పదవులకు న్యాయం చేయాలని అన్నారు. ఎంపిపి అడవి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో తొలుత ఎమ్మెల్యే DNR చేత AMC గౌరవాధ్యక్షునిగా, ఛైర్మన్ గా దండే పుష్పలత చేత ఉపాధ్యక్షునిగా జంపన వెంకట నరసింహరాజు చేత పాలకమండలి సభ్యులుగా నియమితులైన కొనాల అనితరాణి, విభూది జ్యోతిబాబు, ఉండ్రమట్ల ఏసుకుమార్, జామి రాంబాబు, తుపాకుల పద్మ, నిడుమోలు కుమారి, బావిశెట్టి స్వామి, షేక్ ముషా, గోంట్ల మురళీకృష్ణ, యలవర్తి వెంకటపద్మావతి, కన్నా కుమారి, ముంగర అచ్చమ్మ,గరిటిపల్లి పార్వతి, చేత AMC కార్య దర్శి సౌజన్య ప్రమాణం చేయించారు. తొలుత స్థానిక మాగంటి ధియేటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు, చైర్మన్, వైస్ చైర్మన్, డైరక్టర్ లతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర డైరక్టర్స్ గంటా సంధ్య, నంబూరి శ్రీదేవి, ఎంపీపీలు, అడవి కృష్ణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి రాము రామిశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ కురెళ్ల బేబీ, బొర్రా సత్యవతి, ముంగర విజయనిర్మల, ఈడే వెంకటేశ్వరమ్మ, సీనియర్ నాయకులు, చేబోయిన వీర్రాజు, గుడివాడ వీరరాఘవయ్య, బలే నాగరాజు, పామర్తి సత్యనారాయణ, ఘంటసాల శేషరావు, వైస్ ఎంపిపి లు కూసంపూడి
కనకదుర్గా రాణి, మహ్మద్ జహీర్, ఆగస్తీ అదివిష్ణు, సర్పంచ్ D. M. నవరత్నకుమారి, ఎంపిటిసిలు మంగినేని రామకృష్ణ, బోడిచర్ల స్వాతి, పిఏసీఎస్ చైర్మన్ పంజా రామారావు, మండల పార్టీల అధ్యక్షులు, భట్రాజు శివాజీ, గుమ్మడి వెంకటేశ్వర రావు, తిరుమాని రమేష్, మోట్రు ఏసుబాబు,ఆలయాల చైర్మన్లు బొప్పన శివకుమార్, గుర్రం రాంబాబు, బూరుబోయిన మోహనరావు, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, బేతపూడి ఏసోబు రాజు, నాయకులు అబ్దుల్ హమీద్, గోట్రు పాట్రిక్ పాల్, దుట్టా మణి,ఉప్పలపాటి నాగమణి, ఉలిసి వసంతకుమారి, బావిశెట్టి నాగేశ్వరరావు, నిమ్మల సాయిబాబు, కూనవరపు సతీష్, తలారి హన్నిబాబు, కరేటి శివకృష్ణ, బందా నారాయణ, తోట మాధవ, కటికన రఘు, బుర్ల సత్యనారాయణ, కన్నా రమేష్, గండికోట ఏసుబాబు, జయమంగళ కాసులు, సోమల శ్యామ్ సుందర్ ఇంకా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, బ్యాంక్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
















