పోలీస్ అమర వీరులకు ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందని పోలీస్ అమర వీరుల సంస్కరణ వారోత్సవ వేడుకలలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన కైకలూరు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ YVVL నాయుడు మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. ఈ ఉదయం కైకలూరు పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారి ఆలయ మండపం వద్ద, ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాలు మేరకు కైకలూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ YVVL. నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన పోలీస్ బ్యాండ్ మాస్టర్ ఎం కుమార్ బాబు అద్యరంలో లాస్ట్ పోస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో వుంటున్నారు అంటే ఆది పోలీస్ వ్యవస్థ వల్లనే అని, దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవానులు, నావిక, వైమానిక దళాలు, దేశంలో అంతర్గతంగా రాష్ట్రాలలో పోలీస్ వ్యవస్థ ఉండబట్టే మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం అని అన్నారు కరోనా కాలంలో అతిక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణ చేసిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అని గౌరవ ముఖ్యమంత్రి వై.స్. జగనన్న సచివాలయం వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఇబ్బందులు లేకుండా మహిళా పోలీస్ లను ఏర్పాటు చేశారు అని, అదేవిధంగా పోలీస్ లకు వారంతపు సెలవు కూడా ప్రకటించడం జరిగింది అని అన్నారు, ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలో వున్న పోలీస్ సిబ్బంది ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నారు అని అన్నారు. అనంతరం పోలీస్ శాంతియూత ర్యాలీలో ఎమ్మెల్యే DNR పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాలుగు స్టేషన్ ల, S. I. లు, గాయత్రి, చల్లా కృష్ణ, తోట రామకృష్ణ, షణ్ముఖసాయి, ఎంపీపీ అడవి కృష్ణ, జడ్పీటీసీ కురెళ్ల బేబీ, సర్పంచ్ D. M. నవరత్నకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దండే పుష్పలత, వైస్ ఎంపీపీ మహమ్మద్ జహీర్, షేక్ రఫీ, పంజా నాగు, గండికోట ఏసుబాబు, పిచ్చికల రాము, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్లు, విద్యార్థులు, , తదితరులు పాల్గొన్నారు.














