
👉 కైకలూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా పైన 3 రోజుల క్రితం కైకలూరు గ్రామానికి చెందిన ఒక యువతిపై లైంగిక దాడి కేసులో FIR నమోదు అయిన సంగతి విదితమే, నవశకం ఆ యువతికి న్యాయం జరగాలని చేస్తున్న పోరాట ఫలితం వలన ఈరోజు రౌడీషీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా మరియు అతని తండ్రి BJP పార్టీ ఇంచార్జి అయిన గరికిపాటి రాంబాబు గారిని కైకలూరు సబ్ జైలునకు 14 రోజుల పాటు రిమాండ్ విదించారు.
👉 జరిగిన విషయం: కైకలూరు గ్రామానికి చెందిన BJP పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరియు మండవల్లి BJP పార్టీ ఇంచార్జి అయిన శ్రీ గరికపాటి రాంబాబు గారి కుమారుడు గరికపాటి సత్యనారాయణ @రాజా అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటాను అని శారీరకంగా వాడుకుని, అనేక మార్లు అబార్షన్ వరకు తీసుకువెళ్లి ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని కోరితే నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తాను అని బెదిరిస్తున్న గరికపాటి రాజా అనే వ్యక్తి నుంచి నాకు ప్రాణ భయం వుందని, నాకు తనతో పెళ్లి చేసి న్యాయం చేయాలని ఆ బాదితురాలు కృష్ణా జిల్లా SP గారి వద్దకు వెళ్లి న్యాయం కోసం వేడుకోగా గారికపాటి రాజా మరియు అతని తల్లి తండ్రుల పైన వివిధ సెక్షన్ల క్రింద FIR నమోదు చేయడం జరిగింది.
👉 గారికపాటి రాజా మరియు అతని తల్లి తండ్రుల పైన నమోదైన సెక్షన్స్ ఏంటంటే.
1. Section 376: లైంగిక వేధింపులు, అత్యాచారం లేదా మానభంగం (రేప్) తో సహా) సంబంధించిన నేరాలకు వర్తించే సెక్షన్స్.
2. Section 313: మహిళ యొక్క అనుమతి లేకుండా గర్భస్రావం చేయించుట.
3. Section 354(c): మహిళలు ఏకాంతంగా దుస్తులు మార్చుకుంటుండగా లేదా స్నానం చేస్తుండగా చాటు నుంచి వారిని గమనించడం, రహస్యంగా లేదా అనుమతి లేకుండా, వారి ఏకాంతంలోకి జొరబడి వారి ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం వంటి చర్యలు చేయడం.
4. Section 420: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా మోసం చెయ్యడం.
5. Section 506: నేరపూరిత మనస్తత్వంతో చంపుతానని బెదిరించడం
6. Section 109: పైన ఉదహరించిన అన్ని నేరములను చేయుటకు ప్రోత్సహించడం, గరికపాటి రాజా విషయం అతని తల్లి తండ్రులు ఆ అమ్మాయిని మోసం చేయడానికి, లైంగిక వేదింపులకు సహకరించడం, ప్రోత్సహించడం మొదలైనవి.
👉ఈ సెక్షన్ల క్రింద గారిక పాటి రాజ మరియు అతని తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు, గరికపాటి రాజా గారి అమ్మ గారు ప్రస్తుతం అరెస్ట్ కి బయపడి పరారీలో వున్నారు.
👉ఈ నిందితులకు సపోర్ట్ చేస్తున్న లాయర్లకు ఎథిక్స్ ఉండాల్సిన అవసరం లేదా?
👉ఈ ఎపిసోడ్ మొత్తంలో ప్రజలు చర్చించాల్సింది పైన ఉదహరించిన తీవ్రమైన నేరం చేసిన వ్యక్తిని, ప్రోత్సహించిన వారికి సపోర్ట్ చేసి అమాయక, నిస్సహాయ బాదితురాలికి అన్యాయం చేయడానికి సహాయం చేసిన లాయర్ల పాత్ర కుడా చర్చనీయాంశం. కైకలూరు గ్రామానికి చెందిన ఇద్దరు ప్రముఖ లాయర్లు చివరి వరకు నిందితులకు అండగా వున్నారు. ఈ లాయర్లు వారి అనుభవాన్ని, వృత్తి ధర్మాన్ని ఉపయోగించి బాదితులకు అండగా నిలవాల్సింది పోయి బాదితులకు అన్యాయం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వారే గనుక న్యాయం వైపు నిలబడితే వీళ్ళని రిమాండుకి పంపే బదులు ఆ అమ్మాయితో పెళ్లి చేసి న్యాయం చేయడానికి మొగ్గు చూపేవారు. లాయర్స్ కేవలం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వకుండా బాదితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా?
👉వీరు నమ్మే సిద్దంతాలు నేర్పే న్యాయం ఇదేనా?
👉రిమాండ్ కి పంపగానే బాదితురాలికి న్యాయం జరిగినట్లు కాదు చేయాల్సిన పోరాటం చాలానే వుంది, నవశకం చివరి వరకు బాదితురాలికి అండగా వుంటుంది.
👉ఈ కేసు గురించి మరింత సమాచారం కోసం నవశకం Whatsapp గ్రూప్ నందు జాయిన్ అవండి
https://chat.whatsapp.com/L2BJHigiY5rLGz3qZW70hO
👉 నవశకం సోషల్ మీడియా ని ఫాలోకండి
👉Facebook: fb.com/Navasakam
👉Website: https://navasakam.in/
👉Twitter: Twitter.com/Navasakam_Media
👉Instagram: instagram.com/NavasakamMedia
👉YouTube: youtube.com/c/NavasakamMedia
👉YouTube Subscribe: https://bit.ly/Navasakam
👉 రౌడీ షీటర్ గరికపాటి రాజా బాదితులు ఎవరైనా వుంటే పర్సనల్ గా Whatsapp మెసేజ్ చేయండి.
Whatsapp: https://wa.me/919492739099