#కోస్తా_ప్రభ ఈ పత్రిక గురించి ఎపుడైనా విన్నారా? ఈరోజు పరిచయం చేస్తా చదవండి. ఈ పిల్లిబిత్తిరి పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు @ కోస్తా ప్రసాద్ గారు ఈయన నడిపే Whatsaapp పత్రిక (ప్రింట్ కాదు కాబట్టి) సాధారణ ప్రజలకన్నా భాగా ఇయన దాన్ని అడ్డు పెట్టుకుని చేసే దందా బాదితులకే ఎక్కువ తెలుసు. జర్నలిజాన్ని అపహాస్యం చేస్తూ, జర్నలిజం విలువలకు తూట్లు పొడిచి ఇంతకాలం చేసిన అనైతిక జర్నలిజం నిజస్వరూపం బయటపడి కోస్తా ప్రసాద్ గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు (ఆయన బాదితులు ఒక్కోకరే బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు).
జర్నలిజంలో తలపండిపోయింది 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుకు తిరిగే కూర్మ ప్రసాద్ బాబు @ కోస్తా ప్రసాద్ గారు తన కోస్తా ప్రభ పత్రికను అడ్డ్డు పెట్టుకుని చేసే దోపిడీ – extortion ఎలా వుంటుందో ఈ చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం.
// టైమ్స్ అఫ్ ఇండియా వెబ్ సైట్ నందు వచ్చిన అసలు వార్త సారంశం //
2015 నుంచి పరారిలో వున్న #జై_అంబే_గౌరీ_పెట్రో_కెమికల్స్ డైరెక్టర్ #నరేంద్ర_కుమార్_పటేల్ అనే వారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నందు అరెస్ట్ చేశారు. ఇది ఈ వార్త లింక్
// కోస్తా ప్రభ ఎడిటర్ ప్రసాద్ గారు తన దోపిడీ మానస పత్రిక అయిన కోస్తా ప్రభలో ఇదే వార్తను ఎలా రాశారో చూద్దాం //
#శ్రీ_అంబే_ఇన్ఫ్రా_లిమిటెడ్ డైరెక్టర్ #కాంతిలాల్_నరేంద్ర_పటేల్ గారు #జై_అంబే_గౌరీ_పెట్రో_కెమికల్స్ డైరెక్టర్ #నరేంద్ర_కుమార్_పటేల్ గారు ఒక్కరే అని తన Whatsapp పత్రికలో తుఫాను, భీబత్సం, ప్రకంపనలు అని నాలుగైదు పడికట్టు పదాలతో పెద్ద పెద్ద పేజిలు రాసేసి కైకలూరుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల్లో దోపిడీ – extortion మొదలు పెట్టాడు. దీనికి మూల కారణం కైకలూరు కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మేనేజింగ్ పార్టనర్ పేరు కాంతిలాల్ నరేంద్ర పటేల్ అవ్వడం ఈ పేరు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయిన జై అంబే గౌరీ పెట్రో కెమికల్స్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ పటేల్ గారి పేరుకి దగ్గరగా వుండటం.
???????? పెట్రో కెమికల్స్ వ్యాపారం చేసే *జై అంబే గౌరీ పెట్రో కెమికల్స్* వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే *శ్రీ అంబే ఇన్ఫ్రా లిమిటెడ్* కి అసలు సంబంధం ఏమిటి? రెండు వేరు వేరు కంపెనీలు కదా? ఈ మాత్రం కామన్ సెన్స్ స్కూల్ పిల్లోడికి కుడా వుంటుంది కానీ ఈ whatsapp పత్రిక ఎడిటర్ ప్రసాద్ గారికి లేదా?
???????? నరేంద్ర కుమార్ పటేల్ అనే పేరుకి కాంతిలాల్ నరేంద్ర పటేల్ అనే పేరుకి తేడా ఏమిటో కుడా తెలియకుండా ఎర్నలిజంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే కోస్తా ప్రభ Whatsapp పత్రిక నడిపేస్తున్నాడా?
???????? మన రాష్ట్రంలో పేర్ల చివర రెడ్డి, రాజు, చౌదరి వున్నట్లు గానే గుజరాత్ రాష్ట్రంలో పేరు చివర పటేల్ అనే పదం చాలా సహజం అలా పటేల్ అని వున్న అందరినీ ఇందులో దోషులను చేసేస్తాడా ఈ ఎర్నలిస్టు ప్రసాద్?
???????? మన రాష్ట్రంలో దుర్గా మాత గుజరాత్ రాష్ట్రంలో అంబే మా, అంబే మాతా అంటారు. గుజరాత్ వారికి ఇష్ట దేవత అయిన అంబే వ్యాపారానికి సంబందించిన పేర్లలో భాగం కావడం అనేదాన్ని వారు సుభ సూచకంగా భావించడం వలన గుజరాత్ రాష్ట్రంలో సగానికి పైగా వ్యాపారాల్లో అంబే అనే పదం వినిపిస్తుంది. ఈ మాత్రం ప్రభ లేకుండా కోస్తా ప్రభ అనే పత్రికను నడిపేస్తున్నాడా ఈ ప్రసాద్ బాబు గారు?
???????? అసలు 5 సంవత్సరాలుగా పరారీలో వున్న పెట్రో కెమికల్ వ్యాపారి నరేంద్ర కుమార్ పటేల్ గారికీ దేశంలోనే వుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కాంతిలాల్ నరేంద్ర పటేల్ గారికి లింకు ఎక్కడ వుందని? ఆయన ఇయనా ఒక్కరే అయితే ప్రసాద్ బాబు గారు రాసిన CBI వారికి గానీ ED వారికి గానీ ఎంతో కాలం క్రితం కైకలురులో వేసిన రియల్ వెంచర్ గురించి తెలియకుండా పోతుందా? లేకపోతే ఈ రూపాయి పావలా పేపర్ రాస్తే తప్ప తెలుసుకోలేని స్తితిలో CBI ఉందనుకుంటున్నాడా?
బెదిరింపులకు లొంగం, వంగం అని డబ్బాలు కొట్టే కోస్తా ప్రసాద్ బాబు గారిని, ఆయనకు సహకరించే #గరికలను ప్రసాద్ బాబు చేసే అనైతిక పనులను, దోపిడీ దందాలను కొన్ని రోజుల క్రితం కైకలూరుకి చెందిన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గ్రూపుల నుంచి పారిపోయి ఈ రోజు ఇలా కొత్త దందా చేస్తూ దొరికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు త్వరలో ఆయనకు సహకరించే గరికలు కూడా..
ఈ సినిమా ఇక్కడితో అవలేదు కోస్తా ప్రసాద్ బాదితులు ఒక్కొక్కరుగా ముందుకి వచ్చి ప్రసాద్ గారి దోపిడీల గురించి పోలీస్ వారికి కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేము కుడా ఒక్కటిగా ఆయనా దోపిడీ పర్వాలను ప్రజలకు పరిచయం చేస్తాం, అసలు సినిమా ముందుంది…
రాబోయే కొద్ది రోజుల్లో అసలు ప్రింట్ కుడా కాకుండా కేవలం Whatsapp గ్రూపులలో షేర్ చేసే PDF క్లిప్పింగ్స్ వలన వీళ్ళు ఎంత దోచుకుంటున్నారో, వీరి బాదితులను ఒక్కొక్కరిగా https://navasakam.in/ వెబ్సైటు మరియు https://www.facebook.com/navasakam ఫేస్బుక్ పేజి ద్వారా వివరంగా చర్చిద్దాం.