• వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా
Wednesday, May 24, 2023
  • Login
Navasakam News Network
  • వార్తలు
  • ఆంధ్రా
    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

  • తెలంగాణ

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • ఆరోగ్యం
  • క్రీడలు

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    అమెరికా ఆర్థిక సారథులు

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • సామాజిక సమస్యలు

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • కరోనా
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result

13/08/2020
in Childrens, Social
Reading Time: 1 min read
0

ఆనంద్‌ పన్నెండేళ్ళ పిల్లవాడు. ఎపుడూ అల్లరి చేస్తూ హుషారుగా ఉండేవాడు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం మొదలెట్టాడు. వాడికి లోపల ఏదో తెలియని బాధ. స్కూలు లేదు. ఆడుకోవడానికి ఫ్రెండ్స్‌ లేరు. టీవీల్లో కరోనా వార్తలు తప్ప మరో అంశమూ లేదు. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసుకునే అతడి తండ్రి ఇరవై నాలుగ్గంటలూ వార్తలు వింటూనే ఉంటాడు. టీవీల్లో ”మృత్యు ఘంటికలు”, ”మరణ మృదంగం” వంటి పదాలకు అర్థాలు చాలా భయంకరమైనవని వాడికి ఇపుడిపుడే తెలుస్తోంది. కొందరు తెల్లటి ముసుగుల్లాంటి దుస్తులలో తిరుగుతూ కనిపించే దృశ్యాలూ, బ్లర్‌ చేయబడిన శరీరాల్ని స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తున్న దృశ్యాలూ, వారి చుట్టూ బోరున విలపిస్తున్న మరికొందరూ… వాటినన్నింటినీ చూస్తూ ”జీవితం భయంకరంగా తయారైంద”ని అమ్మతో అంటున్న నాన్న. భయమేస్తుందంటూ అందరికీ ఫోన్లు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆందోళనలో అమ్మ.

ఇంతలో బంధువులలో ఎవరో కరోనా బారిన పడి మరణించారనే వార్త తెలియగానే బోరున విలపిస్తున్న వాడి తల్లిదండ్రులు. తలుపులూ కిటికీలూ వేసుకుని భయం భయంగా బతికేస్తున్న తమ కుటుంబం. వాడికి ఇవేవీ అర్థం కావడం లేదు గానీ జీవితం మాత్రం ఏదో భయంకరమైన స్థితిలో ఉందని అర్థమౌతుంది. వాడికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. భయంకరమైన కలలు వస్తున్నాయి. రోజురోజుకీ వాడిలో భయం మరింత పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. స్కూలూ ఆటలూ పాటలూ స్నేహితులూ ముచ్చట్లూ చాక్లెట్లూ అన్నీ దూరమైనాయి. వాడు అసలు ఇంట్లో ఉన్నాడనే స్పృహ లేదు ఎవరికీ. వాడి చిన్న హృదయం మీద కరోనా పాండెమిక్‌ సృష్టించిన భయోత్పాతం ఎంత పెద్దదో ఎవరూ ఊహించలేరు. తెలియకుండానే వాడు మౌనంగా రోదిస్తున్నాడు. ప్రతిరోజూ… ప్రతీ క్షణం… ఇంటి ముందు స్నేహితులతో ఆడుకునే స్థలాల్లో ఖాళీలను కిటికీల్లోంచి చూస్తూ ఖాళీగా నిలబడి పోతున్నాడు. ఇది ఒక్క ఆనంద్‌ కథ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రతీ ఇంటిలో ఉన్న చిన్న పిల్లల కథ.

కరోనా పాండమిక్‌లో ఉన్న ఏకైక మంచి అంశం ఏంటంటే అది పిల్లలలో పెద్దగా ప్రభావం చూపకపోవడమని చాలా మంది సంబర పడిపోతుంటారు. కానీ కరోనా పాండమిక్‌ అందరికంటే ఎక్కువగా పిల్లల మీదే ప్రభావం చూపుతోందని దాదాపు ఎవరూ గుర్తించడమే లేదు. ఐతే పిల్లల శరీరం మీద కాదు, మనసు మీద. మరణాలనీ, ఏడుపులనీ,భయానక విశేషణాలతో ఎక్స్క్లూజివ్‌ విజువల్స్‌ తో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా మసాలా దట్టించి మరణ వార్తలను అమ్ముకుంటున్న వార్తా వ్యాపారాన్ని తెలిసో తెలీకుండో చూస్తూ మానసికంగా క్రుంగిపోతున్నారు పిల్లలు. ముఖ్యంగా లాక్డౌన్‌, ఆ తరువాత పరిణామాలు చాలా ఇళ్ళల్లో గృహహింస పెరగటానికి దోహదం చేస్తే ఆ తల్లిదండ్రుల గొడవల మధ్యన చిక్కుకుని నలిగి పోతున్నారు చిన్నారులు.

ప్రపంచమంటే జీవితమంటే పూర్తిగా అవగాహనకు రాకముందే సమీప భవిష్యత్తు పట్లే పూర్తి అపనమ్మకాన్నీ అనిశ్చితినీ మూటగట్టుకుని బిత్తర చూపులు చూస్తున్నారు పిల్లలు. నిజానికి ఈ పాండమిక్‌లో అసలైన విక్టిమ్స్‌ పిల్లలే. ఎందుకంటే ఈ భయానక వాతావరణం వాళ్ళలో కోలుకోలేని మానసిక ఒత్తిడిని కలిగించబోతోందేమోననే స్పృహ చైల్డ్‌ సైకాలజిస్ట్‌ లలో వ్యక్తమౌతోంది. ఇంట్లో తాతయ్య నానమ్మలు అనారోగ్యం పాలైతే, ఇంతకాలం వారితో కథలు చెప్పించుకుని ఆడుకునే పిల్లలు మరింత కృంగిపోతున్నారు. ఇక ఆ పెద్దవాళ్ళే కరోనాతో మరణిస్తే, కనీసం వాళ్ళ చివరి చూపుకూడా నోచుకోని పిల్లలు ఎంతటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకోవచ్చు. తల్లో లేక తండ్రో home quarentine లో రెండు మూడు నాలుగు వారాలు పిల్లలకు దూరంగా ఉండటం కూడా వారిని కృంగదీస్తుంది.

కరోనా కాలంలో లోకం గురించి కొంత ఆలోచించగలిగే వయసుగల ఆనంద్‌ లాంటి పిల్లలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటే, మూడు నుంచి ఆరేళ్ళలోపు పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలు తమ భావాలను చెప్పలేరు. కాబట్టి తమ ప్రవర్తనలో దాన్ని ఏదో రూపంలో చూపుతుంటారు. బాగా హఠం చేస్తుంటారు. ఇర్రిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపోరు. పిల్లల ఈ ప్రవర్తనకు కారణం అర్థం చేసుకోక వారిలో అల్లరి ఎక్కువైందని, మొండితనం ఎక్కువైందనీ వారిని మరింత హింసకు గురి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. బాలల మీద హింస అలా తెలియకుండానే పెరిగిపోతోంది. ”ఇంట్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, ఈ స్కూళ్ళు ఎపుడు తెరుస్తారో ఏమో” అంటూ వారిని మరింత బెదిరించే వాళ్ళే ఎక్కువ. నిజంగా స్కూళ్ళు తెరవనందుకు పేరెంట్స్‌కి కలిగే మానసిక ఒత్తిడికంటే కంటే పిల్లలలో కలిగే మానసిక ఒత్తిడే ఎక్కువ. చాలామంది పిల్లలకు గృహ హింసను తప్పించుకోవడానికి స్కూలు ఒక మంచి ప్రదేశం. కానీ ఈ రోజు తప్పనిసరై గృహహింసకు లోనౌతున్నారు.

కరోనా పాండెమిక్‌ సమయంలో టీవీల ముందు వార్తలతో గడపడం కంటే పిలల్లతో గడపడం చాలా అవసరం. వారి సైకలాజికల్‌ స్ట్రెస్‌ను మొదటి దశలోనే గుర్తించి తగ్గించగలగడం అవసరం. ఎవరైనా చిన్నపిల్లలు కరోనా గురించి ప్రశ్నలు వేయడం మొదలెట్టా రంటేనే వారిలో దానికి సంబంధించిన స్ట్రెస్‌ మొదలైందని అర్థం చేసుకోవాలి. వారిని ఇక ఆ వాతావరణం నుంచి దూరం చేయగలగాలి. నిద్రలేమినీ, ఆకలి తగ్గడాన్నీ, కోపమూ, మొండితనం పెరగడాన్నీ అంతటినీ ”అల్లరి” కింద జమకట్టకూడదు. ఆన్లైన్‌ క్లాసులు నిజంగా వారిని కరోనా సంబంధిత సమాచారం నుంచి దూరంగా ఉంచగలిగి వారిని వాళ్ళ రొటీన్‌ జీవన శైలిలోకి తీసుకుపోగలుగుతున్నాయా లేక అప్పటికే భయం గుప్పిట్లోకి పోయిన పిల్లవాణ్ణి మరింత భయపెడుతున్నాయా అన్నది తల్లిదండ్రులే గమనించుకోవాలి.

విపరీతమైన స్ట్రెస్‌లో ఉన్న పిల్లలు ఆన్లైన్‌ క్లాసులలో సరిగా శ్రద్ధ చూపలేరు. చదవలేరు. అందుకని వాళ్ళని మరింత నిందిస్తూ చదువులో వెనకబడిపోతారేమోననే ఆందోళనతో చదవాల్సిందేనని మరింత బలపెడుతూ ఉంటారు. ఇత్యాదివి ప్రమాదకరం. వాళ్ళ ఆకలి నిద్ర వంటి వాటిమీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఆటలు లేకపోతే పిల్లలకు శారీరక శ్రమ ఉండదు. మానసికోల్లాసమూ ఉండదు. పిల్లలకు ఆటల వాతావరణాన్ని తల్లిదండ్రులే ఇంట్లో కలిగించగలగాలి. టీవీ వార్తలూ, ఆన్లైన్‌ క్లాసులూ వారిని ఆనంద పరుస్తున్నాయా లేక బెంబేలెత్తిస్తున్నాయా? అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. తల్లి లేక తండ్రిలో ఏ ఒక్కరు home isolationలో ఉన్నా మరొకరు ఆ పిల్లలకు మరింత ధైర్యాన్ని ఇవ్వగలగాలి. సింగిల్‌ పేరెంట్‌ పిల్లలుంటే ఆ పేరెంట్‌ క్వారంటైన్‌లో ఉంటే ఆ సమయంలో ఆ పిల్లలకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత ఆ పేరెంట్‌ మీదే ఉంటుంది. అటువంటి పేరెంట్‌ ఉంటే ఆమె లేదా అతడి బంధువులు వారికి మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వగలగాలి.

కరోనా పాండెమిక్‌ ఈ రోజు కాకుంటే రేపు తగ్గిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రపంచం పట్ల పిల్లలలో అది కలిగించిన దృక్పథం మాత్రం వాళ్ళ జీవితాంతం వేటాడబోతోందనిపిస్తోంది. ముఖ్యంగా తమ పక్కన ఓ లోకం తెలియని పసి బాలుడూ, ఇపుడిపుడే లోకాన్ని ఆసక్తిగా తిలకించాలని ఉబలాటపడే పసిబాలుడూ ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఇళ్ళల్లో నిరంతరం కరోనా వార్తలతో చావు కబుర్లతో నింపేయడం నిజంగా వాళ్ళలో జీవనేచ్ఛను చంపేయడమే. మాస్కులు ఉపయోగించే విషయంలో ఫిజికల్‌ డిస్టాన్సింగ్‌ని పాటించే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండేవాళ్ళు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమౌతుంది.

భవిష్యత్తు పట్ల సుందరమైన కలలు కనడం, భవ్య జీవితాన్ని మహాద్భుతంగా ఊహించడం బాలల హక్కు. చోటా భీం, స్పైడర్‌ మ్యాన్‌, హారీపోటర్లతో కూడిన అద్భుత రసానుభూతి వారి ఆటల్లో మాటల్లో పొంగి పొరలాల్సిన వయసులో భీభత్స భయానక కరుణ రసాలు నిండిపోతున్నాయి. మన ముందు తరాల వారు కూడా మనకంటే పెద్ద విపత్తులనే తమ జీవితాల్లో ఎదుర్కొన్నారు. ఐనా గానీ మనకేనాడూ భయానక భవిష్యత్తును కలగనమని వాళ్ళు చెప్పి పోలేదు. వాళ్ళెంత క్షోభను అనుభవించినా మనకు మాత్రం ఓ సుందరమైన కలలు గనగల జీవితాన్నే ప్రసాదించారు. మనం మాత్రం బాధ్యతా రాహిత్యంతో పిల్లల కలల్ని చిదిమేస్తున్నాం. వారి బాల్యాన్ని వారికి కాకుండా చేస్తున్నాం. సమాచార విప్లవమంటూ వారి జీవితాలను నిరంతరం మృత్యు వార్తలతో, అది కూడా మరిన్ని భాషా విశేషణాలతో, భీతిగొలిపే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా నింపేస్తున్నాం.

పిల్లలు తడిచిన సిమెంట్‌ లాంటివారు. ఎవరు ఏ గుర్తు పొరపాటుగా వేసినా తరువాతి కాలంలో అది శాశ్వత ముద్రగా మిగిలిపోతుంది. మెదడులో ఎమోషనల్‌ సెంటర్‌ అమిగ్దలాకు రేషనల్‌ సెంటర్‌ ఫ్రాంటల్‌ కార్టెక్సుకూ మధ్య సంబంధం మన పెద్దలలో అభివృద్ధి చెందినంతగా పిల్లలలో అభివృద్ధి చెంది ఉండదు. వారి ఎమోషన్‌ కి అందుకే ఏ రేషనాలిటీ ఉండదు. వారి కంటే ముందు తరం వారిమిగా వారి ఎమోషనల్‌ సపోర్టర్లుగా రేషనల్‌ డవలపర్స్‌గా మనం మారలేకపోతే రాబోయే తరానికి కరోనాకంటే మన తరమే పెద్ద శాపంలా పరిణమిస్తుంది. కరోనాను దానిచుట్టూ అల్లుకున్న భయాన్నీ తొలగించి ముందు తరాలవారికి మంచి జీవితాన్ని అందించడం మన తరం బాధ్యత. ఇది గుర్తించక తప్పదు. “ఒక సమాజం పిల్లలను చూసుకునే విధానంలోనే దాని ఆత్మ బహిర్గతమౌతుందని” నెల్సన్‌ మండేలా అంటారు. మనం మన సమాజాత్మను కాపాడుకోక తప్పదు.

చాలామంది కరోనా పాండమిక్‌ వంటివి చూసి ప్రపంచం అంతమైపోతోందని మాట్లాడు తుండటం చూస్తుంటాం. కానీ కరోనా వైరస్‌ పిల్లల జోలికి పోకపోవడంతో ఈ ప్రకృతి మానవాళి మీద ఇంకా ప్రేమను కోల్పోలేదని అర్థమౌతుంది.

డాక్టర్‌ విరించి విరివింటి
ఎంబిబిఎస్‌, క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్

Courtesy: NT

Tags: Corona pandemicCOVID-19India

Related Posts

కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారి భార్య శ్రీమతి విజయ గారు ప్రసాద్ గారికి వ్యతిరేకంగా  ప్రెస్ మీట్ –  కైకలూరు.
Andhrapradesh

కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ గారి భార్య శ్రీమతి విజయ గారు ప్రసాద్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ – కైకలూరు.

23/01/2021
Childrens

India May Be Reversing Decades Of Progress On Child Nutrition, New Govt Data Show

16/12/2020
Childrens

Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

15/12/2020
Bahujan

The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

15/12/2020
Childrens

చిక్కిపోతున్న బాల్యం..

14/12/2020
India

Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

07/12/2020
Andhrapradesh

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం

26/11/2020
Childrens

బలహీన భారతం

26/11/2020
Childrens

తొమ్మిది మంది చిన్నారుల్లో ఒకరికి కరోనా

21/11/2020

Follow Facebook Page

Subscribe YouTube

Follow Twitter

Follow @Navasakam_Media
1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.
DNR MLA

1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.

22/05/2023
0

తమ కలల సాకారం కోసం  25 సంవత్సరాల సుదీర్గ కాలం ఓపికగా ఎదురుచూసిన వ్యక్తుల కథలతో నిండిన విశేషమైన అధ్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కలిగి ఉంది....

Read more

అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు బుద్ధవిహార్ శంకుస్థాపన కార్యక్రమం

25/04/2023
Adani Scam Exposed | MVS Sharma Slams Gautam Adani and PM Modi

అదానీ స్కామ్ బట్టబయలు | PM MODI మరియు అదాని రహస్య సంబంధాన్నిబయటపెట్టిన MVS శర్మ | Navasakam

26/02/2023
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

29/10/2022

కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

22/10/2022
  • DNR
  • Navasakam News Network
Navasakam News Network

Powered by.  Navasakam Media House

No Result
View All Result
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా

Powered by.  Navasakam Media House

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In