
మతం నుంచి పుట్టే మూఢనమ్మకాలు సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో గత సంవత్సరం ఇదేరోజు మదనపల్లెలో జరిగిన జంట హత్యల హృదయ విధారకమైన సంఘటన మళ్ళా ఒక్కసారి గుర్తుచేసుకోండి.
Msc, MPhil, PhD చదివిన పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్, కెమిస్ట్రీ ప్రొఫెసర్.
Msc లో గోల్డ్ మెడల్ సాధించిన పద్మజ మాస్టర్‌మైండ్స్ IIT విద్యా సంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
పెద్ద కుమార్తె అలేఖ్య BBA చదివి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే రాజీనామా చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్స్‌కు సిద్ధమవుతోంది.
ఇంకో కుమార్తె దివ్య MBA పూర్తి చేసి చెన్నైలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తోంది.
ఇంత గొప్ప చదువులు చదివి ఉన్నత స్థానాల్లో వున్న వీరిని మానసిక రోగులను చేసింది మాత్రం మతం చుట్టూ అల్లుకున్న మూఢ నమ్మకాలే.
షిర్డీ సాయిబాబా, మెహర్ బాబా, జగ్గీ వాసుదేవ్, ఓషో లాంటి కల్ట్ లీడర్స్ ని బాగా ఫాలో అయ్యే వీళ్ళు వాళ్ల కుమార్తెలను కూడా ఆ మూఢత్వంలోకి లాగి మానసిక వికలాంగులను చేశారు.
తమ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని, తమ పిల్లలు మళ్లీ బతికి వస్తారంటూ మూఢత్వంలో మునిగిన తల్లిదండ్రులు క్షుద్ర పూజలతో తమ కుతుళ్ళను చంపి మళ్ళీ బ్రతికించవచ్చని నమ్మిన ఆ మానసిక రోగులు ఇద్దరు కుతుళ్ళను శులంతో పొడిచి, నోట్లో రాగి చెంబు కుక్కి, తలపై డంబెల్ తో కొట్టి పాశవికంగా హత్య చేశారు హత్యకు ముందు వీరంతా నగ్నంగా క్షుద్ర పూజలు కూడా చేశారు.
ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది, మూఢత్వానికి చదువుతో సంబంధం లేదనే వాస్తవాన్ని మరొక్కసారి గుర్తు చేసింది. మతం చుట్టూ అల్లుకున్న మూడనమ్మకాలు సమాజాన్ని ఎంతటి హీనస్తితికి దిగాజరుస్తాయో మరొక్క సారి గుర్తు చేసాయి.
జాగ్రత్త పడండి: వాస్తు, జ్యోతిష్యం, బాణామతి, చిల్లంగి, చేతికి కట్టే రంగు రాళ్లు, తాయత్తులు కుడా పైన చదివిన క్షుద్ర పూజకు చిన్న వెర్షన్ మాత్రమే ఇవి మూడనమ్మకాలకు మొదటి అడుగు. వేదాలు, పురాణాలలో నరబలి, జంతుబలి అనే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఇచ్చి దాన్ని ఆలా కొనసాగిస్తూ రావటం మూలాన మన సమాజంలో బలి అనేది సర్వసాధారణమే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది ఇప్పటి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, గుళ్ళలో మేకలు, కోళ్ళ బలి అనేవి నరబలికి కొనసాగింపు. ఇవన్ని రాతి యుగపు అనాగరిక ఆచారాలకు అవశేషాలు.
మీ చుట్టు పక్కల ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యలతో బాధ పడుతుంటే వెంటనే పోలీస్ వారికి కానీ వీటిని హ్యాండిల్ చేయగలిగే పెద్దవారికి కానీ సమాచారం ఇవ్వండి. మీ ఇంట్లో ఇలా ఎవరైనా మానసిక సమస్యలతో విపరీతంగా ప్రవర్తిస్తుంటే అర్హులైన సైకాలాజిస్టుకి చూపించి మానసిక వైకల్యం నుంచి బయటపడటానికి సహకరించండి.
ఒక్క హిందూ మతంలోనే కాదు ప్రతి మతంలో ఇలాంటి అనాగరిక, ఆటవిక అలవాట్లను పెంచి పోషించే పద్ధతులు వున్నాయి.
అలాంటివే: దర్గాల్లో క్షుద్ర పూజలు, యేసు ప్రభు పిలుస్తున్నాడు అని ఆత్మహత్యలు చేసుకునేవారు, కొబ్బరి నూనెతో సర్వరోగాలు నయం అవుతాయి అని నమ్మించి గొబ్బరి నూనె వ్యాపారం చేసేవాళ్ళు, మహిమ ప్రార్ధనల పేరుతో హాస్పిటల్ కి వెళ్ళకుండా చేసి రోగాన్ని ముదరబెట్టి చంపే దైవజనులు ఇలా ఎందరో అన్ని మతాలలో వున్నారు
~ విజయ్ కుమార్ వి
fb.com/zoominvj
#madanapalle #madanapallemurders