Navasakam News Network Telugu News Updates – Andhra Pradesh & Telangana

25/02/2022

Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

John Peta Fishermen Society Representation to Kaikaluru to Krishna District Collector Sri J Nivas

2006 లో జరిగిన ఈ ఆపరేషన్ కొల్లేరుకి ఎగువ కాంటూర్ దిగువ కాంటూర్ అని హద్దులు నిర్ణయించి +5 కాంటూర్ లోపల వున్న చేపల చెరువులను ద్వంసం చేయడం మొదలు పెట్టి +5 కాంటూర్ బయట వున్న చేపల చెరువులు కొల్లేరు ఆక్రమణ పరిధిలోకి రావు అని వదిలేసారు.

ఈ ఆపరేషన్ కొల్లేరు సమయం లోనే ఆక్రమిత చెరువులను ద్వంసం చేసిన తరువాత +5 కాంటూర్ పరిధిని తెలుపుతూ వేయాల్సిన మార్కింగ్ పిల్లర్స్ లో జరిగిన నిర్లక్ష్యం వలన జాన్ పేట ఫిషర్మెన్ సొసైటీ తన 60 ఎకరాల్లో +5 కాంటూర్ లైన్ లోపల వున్న ౩౦ ఎకరాలతో పాటు, +5 కాంటూర్ లైన్ బయట వున్నా తన ౩౦ ఎకరాల భూమిని కుడా కోల్పోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కాంటూర్ లైన్ జాన్ పేట సొసైటీ చెరువు మధ్య నుంచి వెళ్ళడమే.

అప్పటి ఆపరేషన్ కొల్లేరుని పర్యవేక్షిస్తున్న అధికారులు +5 కాంటూర్ బోర్డర్ లో మాత్రమే మార్కింగ్ పిల్లర్స్ వేసినట్లయితే గనుక మా గ్రామానికి చెందిన భూమి మాక్కు దక్కేది. మార్కింగ్ పిల్లర్స్ వేస్తున్న సిబ్బంది, అధికారులు గ్రామస్తులను బెదిరించి వారు అటువైపు రాకుండా చేసి వారికి అనుకూలంగా వున్న స్థలం లో మార్కింగ్ పిల్లర్ వేయడం వలన గ్రామస్తుల ఏకైక ఆధారం అయిన ౩౦ ఎకరాల సొసైటీ భూమిని కోల్పోవడం జరిగింది.

మా గ్రామా సొసైటీ చెరువుకి ఆనుకుని అదే సరిహద్దులు వుండి రాజకీయ పలుకుబడి వున్నా వారి చెరువులు మాత్రం చెక్కు చెదరకుండా అలానే వుండటం అనేది అప్పటి అధికారుల అలసత్వం, మా దళిత గ్రామానికి చెందిన భూమి మాకు దక్క కుండా చేయడం అనే కుట్ర స్పష్టంగా తెలుస్తుంది.

ఆపరేషన్ కొల్లేరు జరిగిన తర్వాత 2011 సంవత్సరంలో కైకలూరు MRO గారికి, RDO గారికి ప్రజావాణి కార్యక్రమం ద్వారా పెట్టుకున్న ఆర్జీలకు స్పందించి అప్పటి MRO గారు, జిల్లా సర్వేయర్, ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో చేసిన సర్వేనందు జాన్ పేట గ్రామానికి +5 కాంటూర్ బయట 30 ఎకరాల 21 సెంట్ల భూమి వున్నదని సర్వే చేసి అధికారిక రిపోర్ట్ ఇచ్చారు. తిరిగి 2020 సంవత్సరం స్పందన కార్యక్రమంలో పెట్టిన అర్జీకి రిప్లై ఇస్తూ రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులు మా 30 ఎకరాల భూమిని దృవీకరించారు.

ఈ సర్వే రిపోర్ట్ ల ఆధారంగా +5 కాంటూర్ బయట మిగిలిన జాన్ పేట ఫిషర్మెన్ సొసైటీ కి చెందిన 30 ఎకరాల 21 సెంట్ల భూమిని తిరిగి పొంది సాగు చేసుకోవడానికి అవసరం అయిన ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ J నివాస్ గారికి గత సర్వే రిపోర్ట్స్, మాప్స్, సర్వే నంబర్స్ అందింఛి దళితుల భూమిని తిరిగి పొందేలా న్యాయం చేయమని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్, సెక్రటరీ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ జాన్ పేట గ్రామ పెద్ద రవి మరియు పానెం కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress