తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, అశ్లీల వీడియోలు పంపుతూ వేధిస్తున్నారంటూ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ‘‘ఉదయం లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తోంది. కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. కొత్త నంబర్ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారు’’ అని కల్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు.
Courtesy Andhrajyothi