ఈమె వలస కూలీ కాదు. పేరు సీతక్క. తెలంగాణలోని ములుగు నియోకజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అడవి బిడ్డల ఆకలి తీరుస్తున్న మంచి మనిషి. ఆదివాసి బిడ్డ అయిన ఆమె బండ్లు, రోడ్లు లేని చోట ఎండనకా, వాననకా కాలినడకన ఆదివాసీ గూడేలు తిరుగుతూ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇది ఏ మీడియా చూపించదు. ఎందుకంటే ఆమె దోపిడీ కులాల మహిళ కాదు కదా!
సీతక్కకు తోడుగా ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా కూడా ఆదివాసీలకు సేవలు అందిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు. సీతక్క ఆదివాసి బిడ్డ కాబట్టి వారి బాగోగులు చూస్తున్నారనుకుందాం కానీ పెద్ద ఆఫీసర్ అయి వుండి బరువులు మోస్తూ తస్లీమా కూడా ఆదివాసీల కోసం కష్టపడుతుండటం ఆమె సేవాతర్పతకు అద్దం పడుతోంది. ఈ సామాజిక వర్గాలలోంచి వచ్చిన వాళ్లే ఇలాంటివి చేయగలరు. వీరి స్ఫూర్తి జేజేలు చెబుదాం.