సబర్మతీ ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసిన సందేశంలో గాంధీజీ గురించి ప్రస్తావన లేదని చాలా మంది విమర్శించారు. అయితే.. మార్టిన్ జోసెఫ్ అనే నెటిజన్ ట్రంప్ రాతలో దోషాలను ట్విటర్లో ఉతికి ఆరేశారు. ట్రంప్ రాసిన సందేశంలో కొన్ని అక్షరాలు ఆంగ్లంలోని కేపిటల్ లెటర్స్లో (పెద్ద అక్షరాలు), కొన్ని స్మాల్ లెటర్స్లో (చిన్న అక్షరాల్లో) ఉన్నాయని.. ఇలా రాయడాన్ని ‘స్టడ్లీక్యాప్స్’ అంటారని, ట్రంప్ మళ్లీ హైస్కూల్ గ్రామర్ క్లాసులకు వెళ్లాలని ఎద్దేవా చేశారు.
ట్రంప్ సంతకంపై జోకులే జోకులు
సబర్మతీ ఆశ్రమంలో సందర్శకులు పుస్తకంలో సందేశం రాసి ట్రంప్ చేసిన సంతకంపై నెటిజన్లు బోలెడన్ని జోకులు పేల్చారు. అందులో మచ్చుకు కొన్ని..
- ఈ సంతకాన్ని మా మెడికల్ షాపులో చూపిస్తే.. మూడురోజులకు సరిపడ మందులు ఇచ్చాడు
- అది సంతకమా? లేక హృదయ స్పందనలు చూపే ఈసీజీ రిపోర్టా?
- అది సంతకమా? లేక శబ్దతరంగాలను చూపే గ్రాఫా?
- ఆ సంతకంలో ఉన్న అక్షరాలను గుర్తించడం కేవలం మందుల షాపులో ఉండే కెమి్స్టలకు మాత్రమే సాధ్యం
- ట్రంప్ తన సంతకానికి బదులు బాంద్రా-వొర్లి సీలింక్ బొమ్మ గీసినందుకు కృతజ్ఞతలు
- గేట్ 2021: ట్రంప్ సంతకం తాలూకూ ఆర్ఎంఎస్ విలువను కనుగొనండి (2 మార్కులు)
- మోదీ తనను కౌగిలించుకున్నప్పుడల్లా ట్రంప్ హృదయ స్పందన ఎలా ఉంటుందో ఆయన సంతకం కూడా అలాగే ఉంది.
- ట్రంప్ సంతకం దుర్గం చెరువుపై వేలాడే వంతెనలా ఉందేమిటి?
Courtesy Nava telangana