సమాజంలో కొందరు వ్యక్తుల నుంచి తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటి తాప్పీ చెప్పారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని తమ కుటుంబం గురుద్వార్‌కి వెళ్లినప్పుడు ఓ సారి ఓ వ్యక్తి కావాలనే తన నడుం పట్టుకున్నాడని తెలిపారు. ‘‘ఆ సమయంలో ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. భక్తుల కోసం కొన్ని స్టాళ్లు ఏర్పాటు చేసి అల్పాహారం, భోజనం అందిస్తుంటారు. ఓసారి నేనూ ఆ క్యూ లైన్లోకి వెళ్లా. నా వెనక చాలా ఖాళీ ఉన్నప్పటికీ ఒకతను నాకు టచ్ అవుతూ.. నా నడుం పట్టుకున్నాడు. కోపంతో రగిలిపోయా. వెనక్కి తిరిగి ఆ వ్యక్తి చేయి పట్టుకుని వేలు విరిచేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు గానీ నా కోపం చల్లారలేదు’’ అని తాప్సీ తెలిపారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘తాప్పడ్’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం తాప్సీ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Courtesy Andhrajyothi