
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిసి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ పనులు మంజూరు కోసం విజ్ఞాపనలు సమర్పించి అభ్యర్ధించి యున్నారు.
సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సదరు పనుల మంజూరుకు సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలిచినట్టు ఎమ్మెల్యే DNR తెలిపారు. సీఎం ని కలిసినవారిలో DNR సతీమణి వీరకుమారి, తనయులు ఆది వినయ్ కుమార్, వీర శ్యామ్ ఫణికుమార్ ఉన్నారు.