
PRESS NOTE BY KAIKALURU CI
ది.29.09.2021 తేదీన కలిదిండి తహశీల్దార్ గారు కలిదిండి మండలంలోని కొంతమంది వ్యక్తులు అనగా కొక్కిరిగడ్డ లక్ష్మి, గుత్తుల రాము, మామిడి పెట్టి వేంకటేశ్వర రావు, సారిక వేంకటేశ్వర రావు, జక్కంశెట్టి శ్రీను, గెడ్డం కృష్ణ, మామిడిశెట్టి వెంకి, కడలి శ్రీను, లక్కింశెట్టి సతీష్, అందె నెహ్రూ, కొచ్చెర్ల గ్రామానికి చెందిన కొమురపాలెపు వంశీ మహేశ్ మరియు కొంతమంది మూలఉప్పరగూడెం గ్రామంలో రీ.స.నెం.275 లో గల 0.05 సెంట్ల ఖాళీ స్థలంలో నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయం భవనం అడ్డుకొనేందుకుగాను ప్రయత్నిస్తున్నట్లు, ది.22.09.2021 తేదీన సదరు కొక్కిలిగడ్డ లక్ష్మి తనకు కలలో దేవుడు కనిపించాడని చెప్పి కొంతమందిని తీసుకుని వెళ్ళి సదరు సచివాలయం భవనం నిర్మించ తలపెట్టిన స్థలంలో ఒక శివలింగాన్ని బయటకు తీసి దానిని స్వయంభు గా వెలిసిన దేవుడుగా ప్రచారం చేస్తూ అక్కడే సచివాలయ భవనం కాకుండా శివాలయం కట్టాలని కోరమని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా రిపోర్ట్ ఇచ్చినారు.
సదరు రిపోర్ట్ ను కలిదిండి పోలీసు స్టేషన్ నందు కేసు నెం.219/2021, U/S 447, 295(A), 109, 188, 120(B) r/w 34 IPC గా నమోదు చేసి ఈ కేసులోని వాస్తవాలను కనుగొనుటకుగాను కృష్ణా జిల్లా S.P. శ్రీ సిద్ధార్ధ కౌశల్ గారు ఉత్తర్వులు మేరకు గుడివాడ D.S.P.శ్రీ N. సత్యానందం గారు మరియు కైకలూరు CI Y.V.V.L నాయుడు గార్లు ప్రత్యక్ష పర్యవేక్షణలో కలిదిండి పోలీసు స్టేషన్ ఎస్.ఐ. శ్రీ ఏ.మణికుమార్, మరియు సిబ్బంది PC-1232, PC-1677, PC -2124 మరియు HG-438 అను వారితో దర్యాప్తు బృంధాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా
మూలఉప్పరగూడెం గ్రామంలో రీ.స.నెం.275 లో గల 0.05 % సెంట్ల ఖాళీ స్థలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయం భవనం నిర్మాణం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేందుకుగాను గుత్తుల రాము, సారికా వేంకటేశ్వర రావు, అందే నెహ్రూ అను వారులు భవన నిర్మాణం ఆపుటకు గాను చేసిన అన్నీ ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో ఎలాగైనా నిర్మాణం అడ్డుకోవాలనే ఉద్దేశంతో సదరు స్థలంలో శివలింగం
పెడితే ప్రజలను తప్పుత్రోవ పట్టించడం ద్వారా నిర్మాణం ఆపవచ్చని అందరూ
మాట్లాడుకుని చేసుకున్నా కుట్రపూరిత ఆలోచనల మేరకు ది.20.09.2021 తేదీన అదే గ్రామానికి చెందిన కడలి శ్రీను కారు లో శ్రీనుతో పాటుగా జక్కంశెట్టి శ్రీను, తాడి నరసింహ మూర్తి, మామిడిశెట్టి మోహన కార్తీక్, వీరవల్లి నాగార్జున కలసి చిలకలూరిపేట వెళ్ళి అక్కడ ముందుగా అందే నెహ్రూ రూ.10500/- చెల్లించగా కొనుగోలు చేసిన నలుపు రంగు రాతి శివలింగాన్ని సదరు కారులో అదే రోజు రాత్రి మూలలంక తీసుకురాగా, గుత్తుల రాము పదకంలో బాగంగా రాత్రి సదరు ఖాళీ స్థలంలో గొయ్యతీసి ఉంచగా గుత్తుల రాము, కౌరు
వెంకట్రావు అప్పటికే అక్కడ వేచివున్న గుత్తుల రాము, జక్కంశెట్టి శ్రీను అను వారు పారల సాయంతో శివలింగాన్ని గోతిలో ఉంచి మట్టిని కప్పిపెట్టారు. తర్వాత పధకంలో బాగంగా కొక్కిరిగడ్డ లక్ష్మి అను ఆమె 22.09.2021 తేదీన కొంతమందితో అక్కడికి వెళ్ళి తనకు కలలో దేవుడు కనిపించాడని చెప్పి శివలింగాన్ని దాచివుంచిన స్థలం నుండి శివలింగాన్ని బయటకు తీసి స్వయభుగా వెలిసినాడని ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను కించపరిచినట్లు దర్యాప్తులో నిరూపితం అయినందున ఈరోజు 1. అందే నెహ్రూ, 2.కడలి
శ్రీను, 3. జక్కంశెట్టి శ్రీను, 4. కౌరు వెంకట్రావు లను ఈ కేసులో అరెస్టు చేయడమైనది దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ కేసును ప్రతిస్తాత్మకంగా భావించి అతి తక్కువ సమయంలో కుట్రను విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించడమైనది.