– అమెరికాలో మళ్లీ జాతి వివక్ష
– నిరసనలపై కాల్పులు
– అట్టుడుకుతున్న అగ్రరాజ్యం
వాషింగ్టన్: అమెరికాలోన మళ్ళీ పోర్టు ల్యాండ్‌లో నల్లజాతీయులపై ఫెడరల్ పోలీసుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్‌మ్యాటర్ (బీఎల్ఎం) ఆధ్వర్యాన నిరసనలు మళ్లీ చెలరేగాయి. ఆస్టిన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించగా వారిని అడ్డుకోవటానికి పోలీసులు నిరసనకారులపై దౌర్జన్యలకు దిగారు.
ఆస్టిన్‌లో ఓ నిరసనకారుడ్ని పోలీసుల కాల్చి చంపారు. నిరసనకారులపై పెప్పర్‌స్ప్రేలు ప్రయోగిం చారు. భాష్పవాయువును ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కాల్పులు జరిపి ఒక నిరసనకారుడిని పొట్టన బెట్టుకున్నారు. పోలిసుల జాత్యహంకా పెద్దఎత్తున నిరసనలు తెలియజేశారు. పోలిసుల దస్టికానికి వ్యతిరేక ఉద్యమాలు భారీ ఎత్తున జరిగాయి.
నిరసనకారులను ఆ కారణంగా అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నది ట్రంప్ రాజ్యం. సియాటెల్‌లోని హోమ్‌లాండ్ సెక్యూరిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు నిరసనకారులు. ఫెడరల్ పోలీసులు నిరసనకారులపై అక్రమ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో 45 మంది నిరసనకారులను అరెస్టు అయినట్టు సమాచారం. పోలిసుల లాఠీకి పలువురు నిరసన కారులు గాయపడ్డారు. పోర్టులాండ్తో పాటు లాస్ ఏంజెల్స్, పోర్టులాండ్, ఓక్లాండ్ మరికొన్ని పట్టణాల్లో అమాయకులైన నల్లజాతీ నిరసనలకారులపై పోలీసులు వారి ప్రతాపాన్ని ప్రదర్శించారు.