ఖమ్మం జిల్లాలో ఆదర్శ వివాహం
తల్లాడ : సాధారణంగా క్రైస్తవుల పెళ్లి వారి సంప్రదాయం ప్రకారం చర్చిలో జరుగుతుంది. ముస్లింల నిఖా వారి ఆచారం ప్రకారం మసీదులో జరుగుతుంది. ఓ క్రైస్తవ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. అయితే చర్చిలో.. లేదంటే మసీదులో జరగాలి. అలా కాకుండా మరోలా జరిగితే..! అదే జరిగింది ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, అన్నారుగూడెంలో. ఓ క్రైస్తవ అబ్బాయి, ఓ ముస్లిం అమ్మాయి హిందూ సంప్రదాయంలో పెళ్లిచేసుకున్నారు. గ్రామానికి చెందిన అనిల్‌కుమార్.. గొల్లగూడేనికి చెందిన షేక్సోనీ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ భిన్న మతాలకు చెందిన వారు కావడంతో.. ఆదర్శంగా నిలవడం కోసం పెళ్లికి హిందూ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తరఫువారు అంగీకరించలేదు. దీంతో.. అనిల్ కుటుంబసభ్యుల సహకారంతో ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Courtesy Andhrajyothi