కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని అల్లినగరం గ్రామ సర్పంచ్ గా గెలిచిన జంపన వీరబాబు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ అల్లినగరం గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే అల్లీనగరం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరింకాయల వెంకటేశ్వరరావు, పాము కవిత, జంపన రంగకుమారి, దేశం నాగమణి, రామ్మోహన్, చిట్టిబొమ్మల లక్ష్మి కుమారి, జంపన కృష్ణ, రాజారావు, మద్దా సామీయేలు, షేక్ బషీర్, పామర్తి రామకృష్ణ, అబ్దుల్ రజాక్, మహ్మద్ షాకీర్, మట్ట రాయిల్, పాము వెంకటేశ్వరరావు, మట్ట సత్యనారాయణ, జామిర్, వినయ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.