ఆదుకోవడంలో అలసత్వమా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ఈ నేపథ్యంలో రాష్ర్టాలకు ఏదైనా ప్యాకేజీని లేదా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటిస్తుందని ఆశించాం. కానీ, లాక్‌డౌన్‌లో 23 రోజులు గడిచినా నేటికీ ప్రధాని నుంచి అలాంటి ప్రకటనేదీ రాలేదు. కొవిడ్‌- 19 సంక్షోభ సమయంలో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలను బలోపేతం చేయడానికంటూ ఈ నెల 3న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ మిటిగేషన్‌ ఫండ్‌ పేర రూ.11,092 కోట్లను మాత్రమే విడుదల చేశారు.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కొద్ది నిధులు ఏ మాత్రం చాలవు. ప్రధాని ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ జరిపినప్పుడు సీఎం కేసీఆర్‌ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ర్టాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ‘హెలికాప్టర్‌ మనీ’ లేదా ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ పద్ధతిలో జీడీపీ (రూ.203 లక్షల కోట్లు)లో కనీసం 5 శాతం అంటే సుమారు రూ.10 లక్షల కోట్లను రిజర్వ్‌ బ్యాంకు ద్వారా చెలామణిలోకి తేవాలని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్‌ చేసిన ఈ ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనను ఇతర ముఖ్యమంత్రులు కూడా బలపరిచారు. తన ప్రతిపాదనను మరింత వివరంగా పేర్కొంటూ ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక లేఖ కూడా రాశారు. ‘హెలికాప్టర్‌ మనీ’ ప్రతిపాదననను ప్రధాని అంగీకరించి ఉంటే రిజ్వర్వ్‌ బ్యాంకు సుమారు రూ.10 లక్షల కోట్ల మేర నోట్లను అదనంగా ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆ నగదును మార్కెట్లోకి పంపించే అవకాశం ఉండేది. ప్రస్తుతం దేశంలో (వస్తుసేవల నిష్పత్తి ప్రకారం) జీడీపీ లో 11.23 శాతం అంటే రూ.24.5 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చెలామణిలో ఉన్నది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గడిచిన ఏడు దశాబ్దాల్లో ఇంతటి ఆర్థికసంక్షోభాన్ని దేశం ఏనాడూ ఎదుర్కోలేదు. ప్రపంచంలోని సుమారు 188 దేశాల్లో పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా ఈ సంక్షోభ ప్రభావం మన దేశంపై చాలా ఉంటుంది. ప్రధాని మొదట ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ వల్లనే సుమారు ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆర్థి కనిపుణులు అంచనా వేశారు. మే 3వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడిగించినందువల్ల సుమారు 18 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. జీడీపీలో ఈ మొత్తం సుమారు 9 శాతం వుంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీ గ్రోత్‌ రేటు 5 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనాకు రాగా ఇది 2 శాతంలోపే ఉంటుందని కొందరు, శూన్యమని (0) మరికొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ పాక్షికంగానైనా మరికొన్నాళ్ళు కొనసాగితే 2020-21 సంవత్సరంలో జీడీపీ గ్రోత్‌ నెగెటివ్‌గా నమోదయ్యే ప్రమాదం ఉన్నది. సుమారు 138 కోట్ల జనాభా ఉన్న దేశం లో ఈ ఆర్థికసంక్షోభం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే ఎంతో దూరదృష్టితో దేశాన్ని గట్టెక్కించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ‘హెలికాప్టర్‌ మనీ’ లేదా ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ ప్రతిపాదనలను ప్రధాని దృష్టికి తెచ్చారు.

‘హెలికాప్టర్‌ మనీ’ ప్రతిపాదన అమలు చేయడం ద్వారా జీడీపీలో మరో 5 శాతం నగదు అధికంగా చెలామణిలోకి వస్తే కొద్దిగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నోసార్లు దేశం ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా అధిగమించింది. ఇది పెద్ద సమస్య కాబోదు. మార్కెట్లో చాలినంత నగ దు చెలామణిలో లేకున్నా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం విషయంలో ప్రధానికి లేదా రిజర్వు బ్యాంకుకు గానీ అభ్యంతరాలుంటే మన ముఖ్యమంత్రి చేసిన మరో ముఖ్యమైన ప్రతిపాదన ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ (క్యూఈ)ను అమలుచేయవచ్చు. ఈ ప్రతిపాదనలో అదనంగా కరెన్సీ నోట్లను ముద్రించాల్సిన అవసరం లేదు.

క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటే రిజర్వుబ్యాంకు, జాతీయ బ్యాంకులు వివిధ బాండ్లను లేదా ఆస్తులను కొనుగోలుచేయడం ద్వారా తమ వద్ద ఉన్న నగదు నిల్వలను మార్కెట్లో చెలామణిలోకి తీసుకురావడం. అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాలే 2007-08 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు దీన్ని అమలుచేసి సంక్షోభం నుంచి బయటపడినాయి.

నిజానికి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ లేదా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు పై ప్రతిపాదనల గురించి ప్రధానితో చర్చించి ఇప్పటికే ఆచరణలోకి తేవాల్సింది. కానీ ఆర్థిక సంక్షోభా న్ని నివారించడానికి ముఖ్యమంత్రి ఇంత మంచి ప్రతిపాదనలు చేసినా, ఇతర ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనలను సమర్థించినా నేటివరకు కూడా ప్రధాని నోరు మెదపకపోవడం విచారకరం.

రిజర్వు బ్యాంక్‌ రెపో రేటును 5.15 శాతం నుంచి 75 బేసిక్‌ పాయింట్స్‌ తగ్గిస్తూ 4.40 శాతం చేయడం వల్ల స్టాక్‌ మార్కెట్లో తమ షేర్ల విలువలను పెంచుకోవడానికి బ్యాంకులకు ఉపయోగపడింది. క్యాష్‌ రివర్స్‌ రేషియో (సీఆర్‌ఆర్‌) 100 బేసిక్‌ పాయింట్స్‌ తగ్గి 3 శాతానికి తెచ్చినా, గృహ రుణాలు, ఇతర రుణాలపై వాయిదా చెల్లింపులపై (ఈఎంఐ)మూడు నెల ల మారటోరియం విధించినా, ఈ చర్యలేవీ ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి ఏ మాత్రం సరిపోవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలను ఏ కారణం వల్లనైనా కేంద్రం అమలుచేయలేకపోతే, రాష్ట్రాలను ఈ సంక్షోభ సమయంలో ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీని, లేదా దశలవారీగా ఆర్థిక సహాయాన్ని, వెసులుబాటు ప్రతిపాదనలను ప్రకటించాలి.

కొవిడ్‌-19 వైరస్‌ గురించి ప్రపంచ ఆరో గ్య సంస్థ జనవరి మూడవ తేదీన హెచ్చరికలు చేసినా, మార్చి 11న ‘ప్రపంచ మహమ్మారి’ గా ప్రకటించినా, రాష్ర్టాలను హెచ్చరించడం లో, అంతర్జాతీయ విమానాలను నిలువరించడంలో కేంద్రం ఎంతో జాప్యం చేసింది.

కొవిడ్‌-19 వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మూడవ తేదీన హెచ్చరికలు చేసినా, మార్చి 11న ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రకటించినా, రాష్ర్టాలను హెచ్చరించడంలో, అంతర్జాతీయ విమానాలను నిలువరించడంలో కేంద్రం ఎంతో జాప్యం చేసింది. ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభ నివారణ కోసం సత్వర చర్యలు చేపట్టకుండా అదేవిధమైన జాప్యం చేస్తున్నది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మనకన్న ఎంతో ముందున్నాయి. తమ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి 350 బిలియన్‌ యూరోలను, అత్యవసరాల కోసం 20 బిలియన్‌ యూరోలను, వ్యాపార సంస్థలకు ఏడాది పాటు వడ్డీలేని రుణాలను బ్రిటన్‌ ప్రకటించింది. కెనడా 52 బిలియన్‌ డాలర్లు, అమెరికా 2 ట్రిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ 49 బిలియన్‌ డాలర్లు, జర్మనీ 610 బిలియన్‌ డాలర్లు, యూఏఈ 27.20 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌ 4 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీలు ప్రకటించాయి.

ఇప్పటివరకు తీసుకున్న ఆర్థిక సహా యచర్యల్లో భాగంగా కేంద్రం 32 కోట్ల పేదల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.150 0ల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఈ మొత్తం రూ.29,352 కోట్లు మాత్ర మే. దేశ జీడీపీలో సుమారు 30 శాతం సమకూరుస్తూ విదేశీ ఎగుమతుల్లో 40 శాతం దాకా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఏ రకమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించలేదు. ఈ రంగంలో సుమారు 15 కోట్ల మంది పనిచేస్తున్నారు. బ్రెజిల్‌, కెనడా, న్యూజీలాండ్‌ వంటి పలుదేశాలు ఈ రంగంలోని కార్మికులకు 3 నెలల వేతనాలను లేదా సబ్సిడీలను ప్రకటించాయి. జర్మనీ, న్యూజీలాండ్‌తో పాటు అనేక దేశాలు చిన్నవ్యాపారులకే కాకుండా ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవ ర్లు మొదలైన స్వయం ఉపాధిరంగంలో పనిచేస్తున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నా యి. వేతనాల పై పనిచేసే వారికే కాకుండా దినసరి కూలీలకు కూడా ఈ దేశాలు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. కొవిడ్‌-19 వైర స్‌ ప్రమాదం రాకముందే ఎంఎస్‌ఎంఈ రం గాన్ని ఆదుకోవడానికి యూకే సిన్హా సిఫార్సులను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత పరిశ్రమల సమాఖ్య సిఫార్సు చేసింది. ఇప్పటికైనా ఈ రంగాన్ని ఆదుకోకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోలుకునే అవకాశం లేదు. జీడీపీపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఇతర దేశాలను చూసైనా కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఆర్థికసంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రారంభంలో అలసత్వాన్ని ప్రదర్శించినట్టు ఆరోపణను ఎదుర్కొంటున్న అమెరి కా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా- సంక్షోభ నివారణకు, ఆర్థికప్రగతికి అవసరమైన చర్యలను సూచించాల్సిందిగా కోరుతూ మైక్రోసాఫ్ట్‌ సీఈ ఓ సత్య నాదెళ్ళ, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తదితర ప్రముఖులతో ఒక సలహా మండలిని నియమించాడు.

ప్రధాని మోదీ ప్రారంభంలో కొంత జాప్యం చేసినా లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా ప్రకటించి కట్టుదిట్టంగా అమలుచేయడాన్ని, మరణాలను నివారించడాన్ని ప్రపంచ దేశాలు అభినందించా యి. మీడియా ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు జాగరూకులను చేసినందుకు కూడా ప్రధాని మోదీని అభినందిద్దాం. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అన్న చందంగా ఉండకూడదనుకుంటే, ప్రధాని భేషజాలకు పోకుండా, ఆర్థిక సహాయాన్ని లేదా ప్యాకేజీని రాష్ట్రాలకు వెంటనే అందించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌చేసిన ప్రతిపాదనలను నిఫుణులతో చర్చించి అమలుచేసినట్లయితే దేశ ద్రవ్యోల్బణం నుంచి ఆర్థికసంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉన్నది.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

Courtesy Namasthe Telangana

RELATED ARTICLES

Latest Updates