పతన రాజకీయాలకు ప్రతీక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉన్నావ్ ఉదంతం నేరమయ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెబుతున్నది. అధికారబలంతో నేత లు ఎంతటి దుర్మార్గాలకు తెగబడుతారో చూపుతున్నది. మొత్తంగా చూస్తే ఇవ్వాళ దేశంలో రాజకీయాలు ఎంత పతనావస్థకు చేరుకున్నాయో చాటుతున్నది. అలాగే బాధితురాలిని, ప్రత్యక్ష సాక్షులను హత్యచేసి కేసు నుంచి తప్పించుకోవటం కోసం బీజేపీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెం గర్ తనపై లైంగికదాడి చేశాడని పదిహేడేండ్ల అమ్మాయి తనకు రక్షణ కల్పించాలని, దోషులను శిక్షించాలని పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఫిర్యాదు స్వీకరించటానికి కూడా పోలీసులు నిరాకరించారు. 2017లో జరిగి న ఈ ఘటనపై తనకు న్యాయం కావాలని బాధితురాలు అలుపెరుగని పోరాటం చేసింది. ఈ క్రమంలో నే తనకు తగిన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నివా సం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. మరుసటిరోజే బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే అనుయాయులు దాడిచేసి తీవ్రంగా కొట్టడంతో అత ను పోలీస్‌కస్టడీలోనే చనిపోయాడు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రజాందోళనలు చెలరేగటంతో సీఎం ఆదిత్యనాథ్ కేసులను సీబీఐకి బదిలీ చేశాడు. దీంతో కదిలిన యంత్రాంగం ఫిర్యాదును స్వీకరించి లైంగికదాడి ఆరోపణలతో ఎమ్మెల్యే సెంగర్‌ను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేపై మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన కేసుతో పాటు, బాధితురాలి తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు ఓ కేసు, బాధితురాలి తండ్రిపై హత్యాయత్నం కేసు మూడు కేసులు పెట్టారు. దీంతో లైంగిక దాడి బాధితురాలుకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు ఫిర్యాదుదారైన బాలిక కుటుంబాన్ని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగారు.

2017లో అప్పటికి మైనర్ బాలికగా ఉన్న బాధితురాలిపై లైంగిక దాడి చేసిన కుల్‌దీప్‌సింగ్ సెంగర్ ఏడాదికాలంగా జైలులో ఉన్నాడు. అయినా అతన్ని ఆరోపణలు వచ్చిన వెంటనే బీజేపీ వారు అతన్ని పార్టీ నుంచి బహిష్కరించలేదు. కనీసం సస్సెండ్ కూడా చేయలేదు. నేరం జరిగి ఏడాది గడిచి, కుట్రపూరితంగా యాక్సిడెంట్ రూపంలో బాధితులను, సాక్షులను హత్యచేయటానికి ప్రయత్నించిన తర్వాత అతన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ఈ మధ్యనే ప్రకటించటం గమనార్హం.
కేసును వెనక్కితీసుకోకపో తే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు ప్రాణాపా యం ఉన్నదని, రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే.. బాధితురాలు, తన తరఫున వాదిస్తున్న లాయరుతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారి ఒకటి ఢీ కొట్టింది. ఈ కారు యాక్సిడెంట్‌లో బాధితురాలి బంధువులు, ప్రత్యక్ష సాక్షులైన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. లాయ రు, బాధితురాలు తీవ్రగాయాలతో దవాఖానలో మృత్యువుతో పోరాడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరు, లారికి ఉన్న నెంబర్ ప్లేట్ కనిపించకుండా నల్లటి రంగు పూసి ఉండటం, రాంగ్‌రూట్‌లో వచ్చి కావాలని కారును గుద్దినట్లుగా స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రమాదం కూడా ఎమ్మెల్యేనే కుట్రపూరితంగా చేసిన యాక్సిడెంట్‌గా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు, పోకడలు మరింత వికృతంగా తయారయ్యాయి. సమస్త ప్రభుత్వం అంతా సెంగర్‌కు మద్దతుగా ఉన్నది, మీరేం చేయలేరని బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. నరేంద్ర మోదీ, ఆదిత్యానాథ్ కూడా ఎమ్మెల్యే సెంగర్‌ను రక్షించటానికే ఉన్నారని కూడా ఎమ్యెల్యే అనుచరులు చెప్పుకుంటున్నారు. జరుగుతు న్న పరిస్థితులను చూస్తే ఎమ్మెల్యే అనుయాయులు చెబుతున్నది నిజమేనని అనిపించకమానదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సింగర్ పట్ల అనుసరిస్తున్న వైఖరి అతన్ని రక్షించే విధంగానే ఉండటం విస్మయం కలిగిస్తున్నది. అవినీతిరహిత, స్వేచ్ఛ రాజకీయాలను నెలకొల్పుతామని బీజే పీ నేతలు అంటుంటారు. అవినీతి అంటే ధనరూపంలో చేసే లంచాల అక్రమాలు మాత్రమే కాదు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేయటం కూడా అతిపెద్ద అవినీతి అని బీజేపీ నేతలకు తెలియకపోవటం విషాదం. విలువలతో కూడిన రాజకీయాలను పాదుకొల్పుతామని చెప్పిన బీజేపీ పెద్దలు, సెంగర్‌ను వెనుకేసుకురావటం విడ్డూరంగా ఉన్నది. 2017లో అప్పటికి మైనర్ బాలికగా ఉన్న బాధితురాలిపై లైంగిక దా డి చేసిన కుల్‌దీప్‌సింగ్ సెంగర్ ఏడాదికాలంగా జైలులో ఉన్నాడు.

ఇంతజరిగినా ఉన్నావ్‌లో లైంగికదాడి నిందితుడు ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగర్ అత్యంత ప్రభావితమైన వ్యక్తిగానే చెలామణి అవుతున్నాడు. అతని మనుషులు బాధితులను బెదిరిస్తూ బాహాటంగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా బాధితులను పిలిచి కేసు విషయంలో రాజీ చేసుకోవాలని చెబుతున్నారు. లేనట్లయతే అందరినీ అంతమొందిస్తామని ఎమ్మెల్యే అనుయాయులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితురాలి చిన్నాన్న వాపోతున్నాడు. అయినా ఎమ్మెల్యే అనుచరులపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు.

అయి నా అతన్ని ఆరోపణలు వచ్చిన వెంటనే బీజేపీ వారు అతన్ని పార్టీ నుంచి బహిష్కరించలేదు. కనీసం సస్సెండ్ కూడా చేయలేదు. నేరం జరిగి ఏడాది గడిచి, కుట్రపూరితంగా యాక్సిడెంట్ రూపంలో బాధితులను, సాక్షులను హత్యచేయటానికి ప్రయత్నించిన తర్వాత అతన్ని బహిష్కరిస్తున్న ట్లు బీజేపీ ఈ మధ్యనే ప్రకటించటం గమనార్హం. ఇంత జరిగినా ఎమ్మెల్యేపై మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన కారణంగా పెట్టే కఠినమైన పోస్కో అతనిపై పెట్టలేదు. మైనర్ బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని, కఠినచట్టాలు తేవాలని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈ ఎమ్మె ల్యే విషయంలో మాత్రం లైంగికదాడికి మరణశిక్ష విధించే పోస్కో చట్టం ప్రయోగించలేదు. చట్టాల్లో సవరణలు తెచ్చి మాత్రం ఏం లాభం. సాధారణ పౌరుల విషయంలో పోస్కో పెడుతున్న ప్రభుత్వం తమ పార్టీ నేత విషయంలో మరోలా ప్రవర్తిస్తున్నది. ఇక ఈ మధ్య లారితో యాక్సిడెంట్ రూపంలో బాధితురాలిని, సాక్షులను హత్య చేయటానికి చేసిన ప్రయత్నం మరింత వికృతమైనది. నిజానికి 2017లో జరిగిన ఈ లైంగికదాడి కేసు మొదటినుంచీ అనేక మలుపులు తిరుగుతున్నది. బాధితురాలు తన గోడు ఎవరూ పట్టించుకోవటం లేదని ముఖ్యమంత్రి ఇంటి ఎదుటనే ఆత్మహత్యాయత్నం చేసింది. మరుసటి రోజు బాధితురాలి తండ్రి పోలీస్ లాకప్‌లో తీవ్ర గాయాలతో చనిపోయాడు. అతన్ని గాయపర్చిన కేసులో ఎమ్మెల్యే సోదరుడు అతుల్‌సిం గ్ సెంగర్‌ను అరెస్టు చేశారు. ఇంత జరిగినా ఉన్నావ్‌లో లైంగికదాడి నిందితుడు ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగర్ అత్యంత ప్రభావితమైన వ్యక్తిగానే చెలామణి అవుతున్నాడు. అతని మనుషులు బాధితులను బెదిరిస్తూ బాహాటంగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా బాధితులను పిలిచి కేసు విషయంలో రాజీ చేసుకోవాలని చెబుతున్నారు. లేనట్లయతే అందరినీ అంతమొందిస్తామ ని ఎమ్మెల్యే అనుయాయులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితురా లి చిన్నాన్న వాపోతున్నాడు. అయినా ఎమ్మెల్యే అనుచరులపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. పోలీసులు, చట్టాలు అధికారబలం ముందు ఏమీ చేయలేకపోతున్నాయి.
ముఖ్యంగా ఎమ్మెల్యే ఠాకూర్ సామాజి కవర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై కఠినంగా వ్యవహరిస్తే ఠాకూర్ల ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయం బీజేపీకి పట్టుకున్నది. బీజేపీలో చేరకముందు కుల్‌దీప్‌సింగ్ సెంగర్ బీఎస్పీలో ఉన్నాడు. ఆ తర్వాత ఎస్పీలో చేరాడు. తనకున్న ధన, కండ బలంతో ఉన్నావ్ ప్రాంతాన్ని మొత్తంగా ప్రభావితం చేయగల శక్తి ఉన్న సెంగర్‌ను ఏ చట్టం, ఏ పార్టీ కూడా కట్టడి చేయటానికి జంకుతున్న స్థితి ఉన్నది. నిజానికి మైనర్లపై లైంగికదాడి కేసుల విషయంలో రెండు నెలల్లోనే విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి. కానీ ఉన్నావ్ ఘటన జరిగి రెం డేండ్లు కావస్తున్నది. ఇంకా విచారణ కొనసాగుతున్నది. మరోవైపు నిందితుల ఆగడాలు మితిమీరి సాక్షులను, బాధితులను అంతం చేసే దిశగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనేందుకు సన్నద్ధమవుతున్నాం. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించేందుకు ఉత్సాహపడుతున్నాం. కానీ సామాన్యులకు చట్టాల పరిధిలో రక్షణ కరువైన దుస్థితి నెలకొన్నది. మనం దేన్ని చూసి గర్వపడు దాం. పతనమైన రాజకీయ విలువల నేపథ్యంలో ప్రజలకు భద్రత కరువైన స్థితిని ఎవరికి చెప్పుకుందాం.

Monobina Gupta

(ది వైర్ సౌజన్యంతో..)

(Courtacy Namasthe Telangana)

RELATED ARTICLES

Latest Updates