నూలు వడికిన ‍అమెరికా ప్రెసిడెంట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆత్మీయ మిత్రుడికి కృతజ్ఞతలు : ట్రంప్‌

అహ్మదాబాద్‌ : భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్‌ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్‌ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు.

చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. ట్రంప్‌ చరఖాపై కాసేపు నూలు వడికారు. అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్‌ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్‌ బుక్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్‌’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates