న్యూస్‌ అప్‌డేట్స్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి 9 వేలు దాటింది. 308 మంది మరణించారు.

పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు
కరోనా అనుమాతులందరికీ ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మార్చుకుంది. నిరు పేదలకు మాత్రమే కోవిడ్‌-19 నిర్ధారిత పరీక్షలు ఉచితంగా చేయాలని పేర్కొంది. అయితే ఎవరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించింది. ఇండియన్‌ మెడికల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ నిర్ణయించిన రుసుముల ప్రకారం ప్రైవేటు ల్యాబొరేటరీలు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయొచ్చని ఆదేశించింది.

భారత్‌లో 9 వేలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 9 వేలు దాటింది. కోవిడ్‌-19 బారిన పడి 24 గంటల్లో దేశంలో 51 మంది చనిపోయారు. ఇప్పటివరకు 9,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 8,048. కరోనా కోరల్లో చిక్కుకుని ఇప్పటివరకు 980 మంది పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 308 మంది చనిపోయారు.

రేపు ప్రధాని మోదీ ప్రసంగం
దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ గడువు మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రసంగిచనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. లాక్‌డౌన్‌ పొడిగింపు ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని కోరిన విషయం తెలిసిందే. కాగా, మార్చి 24 నుంచి దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే.

మోదీకి సోనియా లేఖ
దేశవ్యాప్తంగా లాన్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చే పథకాన్ని సెప్టెంబర్‌ వరకు కొనసాగించాలని కేంద్రానికి కాంగ్రెస్‌ అధినేత్రి సూచించారు. రేషన్‌ కార్డులు లేని వారికి 10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సోమవారం సోనియా లేఖ రాశారు.

ఏపీలో శనగలు పంపిణీ
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా ఒక్కో కుటుంబానికి కిలో శనగలు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్‌ తీసుకునేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా భౌతిక పాటించాలని ప్రభుత్వం సూచించింది.

మరో రెండు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు
ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు తమిళనాడు, పుదుచ్చేరి సోమవారం ప్రకటించాయి. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తెలిపారు. ఒడిశా, పంజాబ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఏపీలో 439కి చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 439కి చేరింది. గుంటూరు(93), కర్నూలు(84), నెల్లూరు( 51) జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 12 మంది కోలుకున్నారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, వైఎస్సార్‌ టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందనున్నాయి.

తెలంగాణ 563 మందికి కరోనా
కరోనా ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు చనిపోయారని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కోవిడ్‌-19 సోకి తెలంగాణలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు 563 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కొనసాగుతున్న మృత్యుహేల
కరోనా మహా విపత్తుకు అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 22 వేల మందిపై బలైయ్యారు. ఐదున్నర లక్షల మందిపైగా కోవిడ్‌-19 బారిన పడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 5,60,433 మందికి కరోనా సోకగా, 22,115 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 133 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది చనిపోయారు.

RELATED ARTICLES

Latest Updates