ఉపాధికి దారేదీ?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

                                                                                                                                                                                                                                                                                – మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు
– సంక్షోభం నుంచి గట్టెక్కించడం కష్టమే
– లాక్‌డౌన్‌తో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు విలవిల
– ఉపాధి కోల్పోయినవారు దాదాపు పదికోట్ల మంది
– ఎంఎస్‌ఎంఈలకు, ఉపాధి హామీకి అదనపు నిధుల కేటాయింపులు దారి చూపవు

న్యూఢిల్లీ : మోడీ సర్కారు అకస్మాత్తుగా అమలుపరిచిన లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో దేశంలో ఇప్పటి వరకూ కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి. ఉపాధికోల్పోయి కార్మికులు విలవిలలాడుతున్నారు. ఫలితంగా దేశంలో ఉపాధి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఉపాధి కల్పనే లక్ష్యంగా మోడీ సర్కారు రెండు విధానపరమైన నిర్ణయాలను ప్రకటించింది. అందులో ఒకటి ఎంఎస్‌ఎంఈల కోసం రూ. 3 లక్షల కోట్లతో కూడిన ప్యాకేజీ. రెండోది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం రూ. 40 వేల కోట్ల కేటాయింపు. అయితే ఈ రెండు నిర్ణయాలూ ఉపాధి కల్పనకు ఏవిధంగానూ తోడ్పాటునందించవని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో దేశం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా మోడీ సర్కారు అకస్మాత్తుగా ప్రకటించి అమలుపరిచిన లాక్‌డౌన్‌ వల్లే ఈ పరిస్థితికి కారణమని పలువురు తెలిపారు. ఆ తర్వాత రెండు నెలల అనంతరం కేంద్రం ప్యాకేజీని ప్రకటించినా కార్పొరేట్లకు తప్ప ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గానీ, సామాన్యులకు గానీ ఎలాంటి భరోసా నివ్వలేదు.

గ్రామీణ ప్రాంతాల్లో..
సెంట్రల్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించిన సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది మే10 నాటికి 22 కోట్ల మంది ఉపాధిలో ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు, అంటే మార్చి 22 నాటికి 27.6 కోట్ల మంది ఉపాధిని కలిగి ఉన్నారు. అంటే లాక్‌డౌన్‌ అమలు తర్వాత ఆ సంఖ్య 5.6 కోట్లు తగ్గింది. గతేడాది ఈ సంఖ్య చూసుకుంటే 28.1 కోట్లుగా ఉన్నది. దీనితో పోల్చి చూసుకుంటే ఉపాధి కోల్పోయినవారి సంఖ్య మే 10 నాటికి 6.1 కోట్లుగా ఉండటం గమనించాల్సిన అంశం. 2019లో గ్రామీణ ప్రాంతాల్లో సగటున 27 కోట్ల మంది ఉపాధి పొందారు. అంటే గతేడాది స్థాయిని చేరుకోవాలంటే ప్రస్తుతం మరో ఆరుకోట్ల ఉద్యోగాలను సృష్టించడం, ఉపాధి కల్పించడంచేయాల్సిన అవసరం ఉంది.

పట్టణ ప్రాంతాల్లో..
అలాగే.. పట్టణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఉపాధి సమస్యను పరిష్కరించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో లాగా ఉపాధి హామీ పథకం ఇక్కడ ఉండదు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో దాదాపు 4.1కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అంటే లాక్‌డౌన్‌కు ముందు అంటే మార్చి 22 నాటికి 12.8 కోట్ల మంది ఉద్యోగాలు కలిగి ఉంటే.. అది మే 10 నాటికి 8.7కోట్ల మందికి తగ్గిపోవడం గమనిం చాల్సిన అంశం. ఇక ఈ సంఖ్య గతేడాది 12.3 కోట్లుగా ఉన్నది. అంటే గతేడాది స్థాయిని చేరుకో వాలంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 9 నుంచి పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నది. ఏడాదిలో సగటున 7 నుంచి 9శాతంతో, 45ఏండ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకు న్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి సమస్యను అధిగ మించడం అంత సులువైన చర్య కాదని ఆర్థిక నిపు ణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు ఇప్పటికే తన అసమర్థ తను చూపించిందని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఉపయోగం ఉండదని ఆర్థికవేత్తలు తెలిపారు.

దారి చూపని ‘ఉపాధి’ కేటాయింపులు
ఉపాధి హామీ పథకం కోసం నిధులు కేటాయించడం ఆహ్వానిందగిన పరిణామమే.. కానీ, గతేడాది పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల బకాయిలు, ఇతర ధరల పెరుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అదనపు నిధులు 10 శాతం ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలవని నిపుణుల అభిప్రాయం. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొ’ందే వారి సంఖ్య 24 కోట్లకు చేరుకుంటుంది. ఫలితంగా మరో 3-4 కోట్ల మందికి ఉపాధి లభించని పరిస్థితి ఏర్ప డుతుంది.

ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఎంఎస్‌ఎంఈలు
ఎంఎస్‌ఎంఈలకు రుణాలు కల్పించడమంటే నగదును నేరుగా వారి చేతుల్లోకి చేర్చడమని కాదని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు. మరీముఖ్యంగా, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ లేనందున, సులభమైన రుణాల లభ్యత వారి కార్యకలాపాలను విస్తరించడానికి లేదా పున:ప్రారంభించడానికి వారిని ప్రేరేపిస్తుందా? అన్నది ఒక బహిరంగ ప్రశ్నేనని చెప్తున్నారు. దీంతో ఈ చర్యతో ఉపాధి కల్పన జరిగే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాం తాల్లో దాదాపు 60శాతం ఎంఎస్‌ఎంఈలు నెలకొని ఉన్నాయి.
ఇక్కడ ఉపాధి హామీ వంటి పథకాలేమీ ఉండవు. అలాగే అనేక పట్టణ ప్రాంతాలు ప్రమా దకర కోవిడ్‌-19కు హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. దీంతో ఉత్పాదక కార్యకలాపాల పున:ప్రారంభం కొంతమేర జరిగినప్పటికీ, వ్యాధి ముప్పు కిందనే కార్మికులు సంపాదించాల్సి ఉంటుందని సామాజికవేత్తలు తెలిపారు. కరోనాకు ముందే దేశంలోని ఎంఎస్‌ఎంఈలు జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అంతేకా కుండా ఆర్థిక మాంద్యం కూడా తోడవడంతో అవి మరింత కష్టాల్లోకి వెళ్లాయి. ఫలితంగా కొన్ని సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు మూసివేయ బడ్డాయి. దీంతో కేంద్రం ప్రతిపాదిత క్రెడిట్‌ సడ లింపు తయారీ లేదా సేవా రంగం కార్యకలాపాలకు ప్రోత్సాహాన్నిచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా అనుకున్నస్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పనలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు తెలిపారు.

ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు
మోడీ సర్కార్‌ విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం చాలా కష్టం. కరోనా నేపథ్యంలో అనేక ఇతర దేశాలు లాక్‌డౌన్‌ కాలానికి వేతన రూపంలో కానీ, వారి ఖాతాలకు నేరుగా బదిలీ కానీ, నిరుద్యోగ భత్యం కానీ.. ఇలా ప్రజల చేతికి నేరుగా డబ్బు అందేలా చూశాయి. సీపీఐ(ఎం), ఇతర వామ పక్ష, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరి గేలా నిర్ణయాలు ఉండాలని కోరుతూ వస్తున్నాయి. ప్రజలకు నేరుగా రూ.7,500 చొప్పున నగదు అందేలా చూసి, వారి కొనుగోలు శక్తిని పెంచాలని సూచిస్తున్నాయి. అభిజిత్‌ ముఖర్జీ, అమర్త్యసేన్‌ వంటి ప్రముఖ ఆర్థిక నిపుణులు సైతం ఇవే సూచ నలు చేశారు. కానీ, మోడీ సర్కారు ఇవేమీ పట్టనట్టు ఉద్యోగాల కల్పన, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సంబంధించి మరోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది. ఫలితంగా దేశం, యువత భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నదని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates