150 కిలోమీటర్లు కాలినడక.. ప్రాణాలు కోల్పోయిన బాలిక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రారుపూర్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు, పేదలు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. రవాణా వ్యవస్థ బంద్‌ కారణంగా వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 12 ఏండ్ల ఓ బాలిక.. 3 రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచి చివరికి ప్రాణాలు కోల్పోయింది. తన గ్రామానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అండొరం మక్డం (32), సుకమతి (30) దంపతులకు జామ్లో మక్డం ఒక్కగానొక్క కూతురు. వీరు, మరికొంత మంది కూలీలు ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితం తెలంగాణలోని కన్నాయిగూడెంకు వచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 13మంది సొంత గ్రామానికి కాలి నడకన వెళ్లా లని ప్రయాణం ప్రారంభించారు. ఈక్రమంలోనే బీజాపూర్‌ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జామ్లోకు కడుపునొప్పి వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచా రం అందుకున్న పోలీసులు.. బాధితురాలని ఆస్పత్రికి తరలించగా.. ఆమె పోష కాహార లోపం, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ సర్కారు బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates