పరిహారానికీ కార్డే ప్రూఫ్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* ఆత్మహత్య చేసుకున్న కౌల్దారుకు సిసిఆర్‌సి తప్పనిసరి
* కలకలం రేపుతున్న ప్రభుత్వ నిబంధన
* అక్టోబర్‌ 2కు ముందు మరణాలపై సందిగ్ధం
* ఆందోళనలో బాధిత కుటుంబాలు

అమరావతి- ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా పొందాలంటే చనిపోయిన వ్యక్తికి రెవెన్యూ విభాగం జారీ చేసిన పంట సాగుదారు హక్కు పత్రం (సిసిఆర్‌సి) ఉండాలని సర్కారు షరతు విధించింది. మరణించిన కౌలు రైతు నిజమైన కౌలు రైతు అవునా, కాదా అని నిర్ధారించే క్రమంలో సిసిఆర్‌ సియే ప్రధాన అర్హత అని ప్రభుత్వం పేర్కొంది. రెy ెన్యూ రికార్డుల పరంగా కౌలు రైతులను గుర్తించాలం టూనే సిసిఆర్‌సి ఉండాలని నొక్కి చెప్పింది. వ్యవ సాయం సాగించలేక అప్పుల బాధలు భరించలేక బలవంతపు మరణాలకు పాల్పడుతున్న కౌలు రైతుల ఎక్స్‌గ్రేషియాకు సిసిఆర్‌సి ఉండాలన్న నిబంధన బాధి తుల కుటుంబాలకు అందే పిసరంత సాయాన్ని సైతం దూరం చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఇస్తామన్న సర్కారు, అందుకు సంబంధించి గత నెల 14న మార్గ దర్శకాలు జారీ చేసింది. కౌలు రైతుల ఆత్మహత్యలను ధ్రువీకరించేందుకు సిసిఆర్‌సిని అర్హతగా నిర్ణయిం చడం కౌలు రైతుల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు సిసిఆర్‌సిని తప్పనిసరి చేయడంతో కౌలు రైతులు నానా ఇబ్బందులు పడు తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబా లకు పరిహారానికి సైతం సిసిఆర్‌సి అనడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

వారివే ఎక్కువ
వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఈ ఐదు మాసాల్లో సుమారు 240 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిలో అత్యధికులు కౌలు రైతులే. టిడిపి హయాంలో సంభవించిన రైతు ఆత్మహత్యల్లోనూ కౌలు రైతులవే ఎక్కువ. కాగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కూడా రూ.7 లక్షల ఎక్స్‌గ్రేయా ఇస్తామని వైసిసి ప్రభుత్వం ప్రకటించి, మార్గదర్శకాలను జివొఎంఎస్‌ నెం.102 ద్వారా వెలువరించింది. గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆత్మత్యలను గుర్తించేందుకు మండల, రెవెన్యూ డివిజన్‌ స్థాయిల్లో ఏర్పాటు చేసిన త్రీమెన్‌ కమిటీలు కౌలు రైతుల ఆత్మహత్యలను గుర్తించాలంటే ముందుగా చిపోయిన వ్యక్తిని సిసిఆర్‌సి ద్వారా కౌలు రైతుగా ద్రువీకరించాలి. ఆ తర్వాతనే మిగిలిన రిపోర్టులూ, వగైరా.

అప్పటి కేసుల సంగతేంటి?
పరిహారానికి సిసిఆర్‌సితో పాటు మరో రెండు అంశాలను గైడ్‌లైన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో కౌలుదారు పేరు నమోదై ఉండాలి. అలాగే రెవెన్యూ శాఖాపరంగా భూమి లీజుకు సంబంధించి మరేదైనా డాక్యుమెంటరీ సాక్ష్యం (ప్రూఫ్‌) అయినా ఉండాలి. కౌల్దార్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయట్లేదు. కనుక ఆ ఆశ లేదు. గతంలో కౌలు రైతులను గుర్తించేందుకు రెవెన్యూ విభాగం 2011- చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు (ఎల్‌ఇసి) ఇచ్చినా, కొంత మందికే ఇచ్చింది. వ్యవసాయశాఖ సాగు ద్రువీకరణ పత్రాలు (సివొసి) జారీ చేసినప్పటికీ, కేవలం రెవెన్యూ రికార్డుల పరంగా కౌలు రైతు కుటుంబాలు ప్రూఫ్‌లు చూపించాలనడంతో వ్యవసాయశాఖ జారీ చేసిన సివొసిలు చెల్లవు. ఇక ఉన్నవి ఎల్‌ఇసిలు మాత్రమే. ఎల్‌ఇసిలు ఇప్పటి వరకు ఏడు లక్షల మందికే ఇచ్చారు. కొత్త చట్టం వచ్చాక అవి రద్దయ్యాయి. ఎల్‌ఇసిలు ఒక ఏడాదికే ఇవ్వడం వల్ల, ఎల్‌ఇసిపై పేర్కొన్న సంవత్సరంలో చనిపోతేనే కౌలు రైతును పరిహారానికి గుర్తిస్తారు. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌ 2కు ముందు చనిపోయిన కౌలు రైతులకు పరిహారం ప్రశ్నార్ధకంగా మారింది.

కార్డు కష్టం
ఈ ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ పంటసాగుదారు హక్కు చట్టం-2019ని తీసు కొచ్చారు. తదుపరి 23న రూల్స్‌ను నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాటి ప్రకారం రెవెన్యూ విభాగం గ్రామ సచివాలయం కేంద్రంగా కౌలు రైతులను గుర్తించి సిసిఆర్‌సిలు జారీ చేస్తుంది. సిసిఆర్‌సి రావాలంటే భూమి యజ యాని సంతకం తప్పనిసరి. ఈ నిబంధన వలన కౌలు రైతులకు సిసిఆర్‌సిలు రావట్లేదు. లక్షలాదిగా కౌలు రైతులుండగా, సిసిఆర్‌సిల జారీ అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభంకాగా, ఇప్పటికి 1.87 లక్షల కార్డులే జారీ అయ్యాయి. కౌలు రైతుల గుర్తింపునకు కొత్త చట్టం ప్రతిబంధకంగా ఉండగా, ఇప్పుడు ఆత్మహత్యల పరిహారానికి సైతం దాన్నే ప్రామాణికంగా తీసుకుంటా మనడంతో వాస్తవంగా కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా సిసిఆర్‌సి లేదన్న సాకుతో ప్రభుత్వ పరిహారం అందని దుస్థితి నెలకొంది.

Couretsy prajasakti..

RELATED ARTICLES

Latest Updates