కొత్త తరం కలం కదిలింది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for Sixty young writers own publishing house"ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. ఒక్క కథ వేయి జీవితాలకు ప్రతీక. బతుకులోని నిశ్శబ్దం.. కథలో చప్పుడు చేస్తుంది. సమాజంలోని చీకటిని.. కథ వెలుగులోకి తెస్తుంది. కథంటే మాటల పదబంధం కాదు.. కంచెలు తెం0చే ఖడ్గం… ఇలాంటి కథలే రాస్తున్నారు 60 మంది యువ రచయితలు. వారిలో ఒకరైన తోట అపర్ణ ఆ విశేషాలు పంచుకున్నారిలా…

 వ్యక్తి కథ రాసి ఫేస్‌బుక్‌లో పెడతాడు… అరే భలే రాశారే అని మరో రచయిత నుంచి కామెంట్‌. మొన్న మీరు ఎఫ్‌బీలో పెట్టిన కథ ఉంది చూడండి… సూపరండసలు… దానికి తిరుగులేదు పొండి… ఇలాంటి లైకులు, కామెంట్లతోనే సామాజిక మాధ్యమాల్లో రచనపై ఆసక్తి ఉన్న 12 మందిమి కలుసుకున్నాం. ఇందులో సగం వరకు అమ్మాయిలే. మేమందరం తలో కథ రాసి ‘ఇన్‌ ది మూడ్‌ ఫర్‌ లవ్‌’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాం. దీనికి నేను, వెంకట్‌  సిద్ధారెడ్డి సంపాదకులుగా వ్యవహరించాం. ఇది ఏదో సీరియస్‌గా సాగిపోయే సంప్రదాయ సాహిత్యం కాదండోయ్‌… ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా… సులువుగా అర్థమయ్యేలా పదాలు, సన్నివేశాలు పెట్టి రాసిన పుస్తకమది. ప్రేమే ప్రధాన అంశంగా ఇది సాగిపోతుంది. పోయినేడు పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకానికి పాఠకులు ఫిదా అయిపోయారు. కొన్ని రోజుల్లోనే అన్ని కాపీలు అమ్ముడు పోయాయి. వారంలోనే మళ్లీ కొన్ని వేల పుస్తకాలను ప్రచురించాం.

ప్రచురణ సంస్థ పెట్టాం…
ఇన్‌ ది మూడ్‌ ఫర్‌ లవ్‌ పుస్తకానికి ముందు వీబీ సౌమ్య అనే అమ్మాయి సత్యజిత్‌రే ‘అవర్‌ ఫిల్మ్స్‌ దేర్‌ ఫిల్మ్స్‌’ పుస్తకాన్ని ‘మన సినిమాలు.. వాళ్ల సినిమాలు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించింది. దీనికి సిద్ధారెడ్డి మెరుగులు దిద్దాడు. పుస్తకంలో ఉన్న గొప్పదనమే దీన్ని పాఠకులకు చేరువ చేస్తుందనుకున్నాం. కానీ ఏం లాభం. మార్కెటింగ్‌ పరంగా ఎన్నో కష్టాలొచ్చాయి. ఇవే కాదు… చాలామంది పుస్తకాలు రాసి ఇతరులకు పంచడమో, అటకల మీద పెట్టడమో చేస్తున్నారు. కొనేవారు లేకే ఈ తంటాలు. ఇలా కాకుండా యువత మెచ్చేలా రాయాలనుకున్నాం. ప్రేమ కథలైతే ఎవరైనా ఇట్టే చదివేస్తారని నిర్ణయించుకున్నాం. మేం రాసిన పుస్తకాలను మేమే స్వయంగా ప్రచురించుకునేలా ‘అన్వీక్షికి’ అనే ప్రచురణ సంస్థ స్థాపించాం. దీనికోసం సిద్ధారెడ్డి ఎంతో కష్టపడ్డారు. దీనికి బండారు వందన చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్నారు.

20 పుస్తకాలతో…
మా గ్రూప్‌లో 60 మంది యువ రచయితలు చేరారు. మేమందరం కలిసి 16 తొలిప్రేమ కథలు, లెటర్స్‌ టు లవ్‌, మీటూ కథలు… ఇలా మొత్తం 20 పుస్తకాలు మా ప్రచురణ కేంద్రంలో ప్రచురించాం. వీటితోనే పుస్తకప్రదర్శనలో ఒక స్టాల్‌ ఏర్పాటు చేశాం. ఇందులో మీటూ కథల పుస్తకాన్ని 13 మంది అమ్మాయిలు రాశారు. కడలి అనే 24 ఏళ్ల యువతి రాసిన ‘లెటర్స్‌ టు లవ్‌’ చదువరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates