డిసిన్ఫెక్షన్‌ టార్చ్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కొల్హాపూర్‌, ఏప్రిల్‌ 14: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి శాస్త్రవేత్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని శివాజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రాజేంద్ర సొంకవాడే ఒక కొత్తరకం టార్చ్‌ను కనిపెట్టారు. దీనిద్వారా నిత్యావసరాలపై ఉండే క్రిములను చంపేయవచ్చు. ఆహార పదార్థాలు, పాల ప్యాకెట్లు, కూరగాయలు, కరెన్సీ నోట్లు మొదలైనవాటిపై ఉండే క్రిములను ఈ అలా్ట్రవయొలెట్‌ టార్చ్‌ నాశనం చేస్తుంది. ఈ టార్చ్‌ను ఆయా వస్తువులు, పదార్థాలపైన కొద్ది నిమిషాలు చూపిస్తే సరిపోతుంది.

కరోనా వైర్‌సను ఇది చంపేయగలదని ప్రొఫెసర్‌ రాజేంద్ర తెలిపారు. 16 వాట్‌ పవర్‌, 1 కేజీ బరువుండే టార్చ్‌ ఖరీదు రూ.4,500. అలాగే 33 వాట్‌ పవర్‌, 1.2 కేజీల బరువుండే టార్చ్‌ ఖరీదు రూ.5,500. ఈ పోర్టబుల్‌ టార్చ్‌ను మహారాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ ఆవిష్కరించారు. ఇంకో వారం రోజుల్లో దీనిని మార్కెట్‌లోకి తీసుకు వస్తామని రాజేంద్ర తెలిపారు. ముంబయిలోని ప్లా ఎలకో్ట్ర అప్లయన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వీటిని ఉత్పత్తి చేస్తుంది. కార్నెల్‌ వర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌ పేపర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పరికరాన్ని రూపొందించినట్టు ప్రొఫెసర్‌ తెలిపారు. ఇందులో నిర్దేశిత ప్రమాణాల్లోనే అలా్ట్రవయొలెట్‌ కిరణాలను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఆహార పదార్థాలు, మనుషులకు ఎలాంటి హాని జరగదని వెల్లడించారు. ఈ టార్చ్‌ను పెద్ద పరిమాణంలో తయారుచేసి ఆసుపత్రులు, సూపర్‌ మార్కెట్లు, రవాణా సాధనాల్లో క్రిమి సంహారినిగా వాడుకోవచ్చని తెలిపారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates