షెహ్లా రషీద్పై రాజద్రోహం కేసు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Related imageకాశ్మీర్‌పై ట్వీట్లు చేసినందుకు.. కాశ్మీర్‌లో ఆంక్షలను సడలించాలని, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వస్తుండగా, ఆ డిమాండ్ల కోసం ట్వీట్లు చేసిన ఉద్యమకారిణి షెహ్లారషీద్‌పై తాజాగా ఢిల్లీ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. 

న్యూఢిల్లీ : కాశ్మీర్‌ అంశంపై ట్వీట్లు చేస్తూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన సామాజిక ఉద్యమకారిణి షెహ్లా రషీద్‌పై ఢిల్లీ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి తిలక్‌మార్గ్‌ పోలీసుస్టేషన్‌లో ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 124-ఎ(రాజద్రోహం), 153-ఎ (మత, ప్రాంతీయ, బాషాపరంగా రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం), 153 (అల్లర్లకు కారణమయ్యేలా వ్యాఖ్యలు)ల కింద రషీద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న షెహ్లా రషీద్‌ చేసిన ట్వీట్లను కేసు నమోదులో అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం జమ్ముకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రషీద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సైన్యం ప్రజల ఇండ్లపై దాడులు చేస్తూ హింసిస్తోందని తెలిపారు. దీన్ని ఆర్మీ తీవ్రంగా ఖండించింది. సైనిక ఉన్నతాధికారులు ముందుకు వస్తే దీనికి సంబంధించిన ఆధారాలను తాను చూపిస్తానని, వాటిపై విచారణ చేయాలని ఆమె పేర్కొన్నారు.

కాశ్మీర్‌లో ఆంక్షలను సడలించండి : అమెరికా
జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం అక్కడి పరిస్థితిపై అమెరికా మరోసారి ఆందో ళన వ్యక్తం చేసింది. కాశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను సడలించి, సమస్య పరిష్కారానికి రాజకీయ ప్రక్రియను ప్రారంభించాలని అధికార ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ కోరారు. కాశ్మీర్‌లోని రాజకీయ నేతలను, వ్యాపా రవేత్తలను పెద్ద సంఖ్యలో నిర్బంధించడంతో పాటు స్థాని కులపై ఆంక్షలు విధించడంపై ఆందోళన చెందుతు న్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక ఆంగ్ల దినపత్రికకు మెయిల్‌ అయ్యాయి.. ఇప్పటికీ అక్కడ మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయని అందిన నివేదికలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులను గౌరవించి, ఇంటర్నెట్‌, మొబైల్‌ వంటి సర్వీసులను పునరుద్ధరించాలని భారత్‌ అధికారులను కోరుతున్నామని వ్యాఖ్యానించారు. స్థానిక నేతలతో రాజకీయ క్రమాన్ని పునర్‌ ప్రారంభించి, గతంలో హామీ ఇచ్చినట్టుగా అక్కడ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించేలా భారత్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates