మోడీ మార్క్ కక్ష సాధింపు చర్యలు..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 మీడియా సంస్థల నిర్వాహకులు, బీజేపీ వ్యతిరేక గళాలపై వరుస కేసులు 
న్యూఢిల్లీ: మోడీ సర్కార్‌ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత మీడియా సంస్థల నిర్వాహకులపైనా, అసమ్మతి గొంతులపైనా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వరుస కేసుల నేపథ్యంలో మీడియా సంస్థల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే యత్నం జరుగుతున్నట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.జూన్‌ మొదటివారంలో క్వింట్‌ న్యూస్‌ పోర్టల్‌, నెట్‌వర్క్‌ 18 గ్రూప్‌ వ్యవస్థాపకుడు రాఘవ్‌బహల్‌పై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది.

లెక్కల్లో చూపని డబ్బుతో లండన్‌లో ఓ ఆస్తి కొనుగోలు చేసినట్టు రాఘవ్‌పై ఈడీ ఆరోపించింది. అంతకుముందు నల్లధనం నిరోధించే చట్టం కింద ఆదాయం పన్నుశాఖ మీరట్‌లోని కోర్టులో రాఘవ్‌పై ఛార్జిషీట్‌ నమోదు చేసింది. ఐటీ ఫిర్యాదుతో రాఘవ్‌పై కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, తాను ఎప్పటికపుడు ఆదాయం వివరాలు ఐటీకి అందజేశానని, ఎలాంటి అక్రమాలకు తాను పాల్పడలేదని రాఘవ్‌ తెలిపారు.
మార్కెట్‌ కార్యకలాపాల నుంచి రెండేండ్లపాటు దూరంగా ఉండాలని న్యూఢిల్లీ టెలివిజన్‌(ఎన్‌డీటీవీ) ప్రమోటర్లు ప్రణరురారు, రాధికారారులను సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు(సెబీ) జూన్‌ 14న ఆదేశించింది. దీంతోపాటు ఎన్‌డీటీవీ నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని సెబీ ఆదేశి ంచింది. రారు దంపతులు ఏ నమోదిత కంపెనీలోనూ పదవులు తీసుకోరాదని సెబీ తన 51 పేజీల ఆదేశాల్లో పేర్కొన్నది. సంస్థకు చెందిన రుణ వివరాలులాంటివి సేకరించిన సెబీ.. రారు దంప తులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపించింది. ఆ సమాచా రాన్ని నియంత్రణ సంస్థలకు అందజేయలేదని సెబీ చెబుతోంది.
అక్రమంగా విదేశీ నిధుల్ని సేకరిస్తున్నారని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థ లాయర్స్‌ కలెక్టివ్‌పైనా, ఆ సంస్థ అధ్యక్షుడు ఆనంద్‌గ్రోవర్‌పైనా సీబీఐ తాజాగా(జూన్‌లో) మరో కేసు నమోదు చేసింది. 2016లోనే లాయర్స్‌ కలెక్టివ్‌కు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్ర హౌంశాఖ రద్దు చేయగా, ఆ సంస్థ నిర్వాహకులు బోంబే హైకోర్టులో సవాల్‌ చేశారు. ప్రస్తుత కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాసహా(సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌షాపై ఆరోపణలున్నాయి) పలువురు బీజేపీ నేతలకు సంబంధించిన కేసుల్లో బాధితుల తరఫున తాము వాదనలు వినిపిస్తున్నందునే తమపై కక్ష కట్టినట్టు లాయర్స్‌ కలెక్టివ్‌ విమర్శిస్తోంది.
గుజరాత్‌ కేడర్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌భట్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. 30 ఏండ్ల క్రితం జరిగిన ఓ లాకప్‌డెత్‌ కేసులో ఆ రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు భట్‌కు ఇటీవలే యావజ్జీవ శిక్ష విధించింది. 2002లో గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన దాడుల వెనుక అప్పటి ఆ రాష్ట్ర సీఎంగా మోడీ పాత్రపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినందునే బీజేపీ సర్కార్‌ తనను అక్రమ కేసుల్లో ఇరికించిందని భట్‌ విమర్శించారు. 2002లో గుజరాత్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీసీపీగా భట్‌ పని చేశారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న భారతీయురాలు తరుణ్‌కౌర్‌(హార్డ్‌ కౌర్‌)పై ఉత్తర్‌ప్రదేశ్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. ఆ రాష్ట్ర ము ఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌పై సోష ల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆమెపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన న్యాయవాది శషాంక్‌శేఖర్‌ వారణాసిలో కేసు పెట్టారు. భార త్‌కు వస్తే కౌర్‌ను అరెస్ట్‌ చేసి విచారించే అవకాశమున్నది. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై పోస్టులు పెట్టినం దుకు ది వైర్‌ మాజీ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌కనోజియాను ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు లు ఇటీవల అరెస్ట్‌ చేశారు. ఆదిత్యనాథ్‌ తనతో పలుమార్లు చాటింగ్‌ చేశారని చెబుతున్న ఓ మహిళ టీవీ ఛానళ్లతో మాట్లాడు తూ తాను ఆయన్ని పెండ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపిన వీడియోను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో పోస్ట్‌ చేయడంతో కనోజి యాపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
పైన పేర్కొన్న మీడియా సంస్థల నిర్వాహకులుగానీ, ఇతరులు గానీ అక్రమాలకు పాల్పడితే సంబంధిత చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, సీబీఐ, ఈడీ, సెబీలాంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం కనుసన్నల్లో పని చేస్తాయన్న అపవాదు ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమ ప్రత్య ర్థులపైకి ఆ సంస్థల్ని ఉసిగొలుపుతారన్న విమర్శలున్నాయి. ఆ విమ ర్శలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలు గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు చేసినవే కావడం గమ నార్హం. సీబీఐని కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అంటూ గతం లో బీజేపీ నేతలు విమర్శించా రన్నది తెలిసిందే. సాక్షాత్తూ సీబీఐని ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంజరంలో చిలుకలా వ్యవహరి స్తోందంటూ గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం తెలిసిందే.

(నవ తెలంగాణసౌజన్యంతో)

RELATED ARTICLES

Latest Updates