ఉత్తర భారతంలో పడిపోతున్న ఆయుర్దాయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* గంగా-సింధు మైదాన ప్రాంతాలపై కాలుష్య ప్రభావం
* చికాగోయూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. దీని కారణంగా తగ్గుతోన్న గాలి నాణ్యత మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా మానవుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేకపోతున్నాడు. దీంతో వారి అయుర్ధాయం ఏళ్లు గడిచేకొద్దీ గతం కంటే భిన్నంగా, తక్కువగా ఉంటోంది. ఈ వాతావరణ కాలుష్య ప్రభావం గంగా- సింధు మైదాన ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ మైదాన ప్రాంత పరిధిలోని ఉత్తర భారత్‌లోని రాష్ట్రాల్లో నివసిస్తున్న వారి సగటు ఆయుర్ధాయం దాదాపుగా ఏడు సంవత్సరాలు తగ్గిపోయిందని ఇటీవల చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌(ఇపిఐసి) తన అధ్యయనంలో వెల్లడించింది. 1998-2016 మధ్య సంవత్సరాలకు సంబంధించి ఒక సంస్థ వాయు నాణ్యతపై పరిశోధన చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఉత్తర భారతంలో కాలుష్యం మూడు రెట్లు పెరిగి ప్రమాదకర స్థాయికి చేరిందని ఈ అధ్యయనం పేర్కొంది. గణాంకాల విడుదల సందర్భంగా ఇపిఐసి గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ గంగా-సింధు మైదానం కింద ఉత్తర భారతదేశానికి చెందిన బిహార్‌, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, చంఢఘీడ్‌లు వస్తాయి. ఈ ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోనే దేశ జనాభాలోని దాదాపుగా 40 శాతం అంటే 48 కోట్ల మంది నివసిస్తున్నారు. గత 18 ఏళ్లుగా ఈ ప్రాంతాల్లోని వాయు నాణ్యత రోజురోజుకు పడిపోతుందని, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ రెట్టింపు కాలుష్యం జరుగుతోందని చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌(ఇపిఐసి) అనే విభాగం విడుదల చేసిన వాయు నాణ్యత సూచి(ఎక్యూఎల్‌ఐ)తో తేలింది. 72 శాతం వాతావారణ కాలుష్యం పెరుగుదలతో స్థానికుల ఆయుర్ధాయం 3.4 సంవత్సరాల నుంచి 7.1 సంవత్సరాలకు పడిపోయిందని ఇపిఐసి తన అధ్యయనంలో పేర్కొంది. జాతీయ వాయు శుభ్రత కార్యక్రమం(ఎన్‌సిఎపి) కింద భారత్‌ తన లక్ష్యాలను చేరుకోవడంలో… ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని 25 శాతం మేర తగ్గించగలిగితే వాయు నాణ్యత మెరుగుపడుతుందని, ప్రజల ఆయుర్ధాయం 1.3 సంవత్సరాల మేర పెరుగుతుందని ఇపిఐసి పేర్కొంది.
ఎన్‌సిఎపి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఊపిరితిత్తులకు సంబంధించి స్పెషలిస్టు అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ పరిశుభ్రమైన వాయువు అనేది ప్రతి ఒక్కరి హక్కు. గత ఐదు సంవత్సరాలుగా రాజకీయ నేతలు చెబుతున్నట్లుగానే ఇంకా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.’ అని అన్నారు. దేశంలో నిర్వీర్యం కాబడిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సిపిసిబి) వంటి సంస్థలను బలోపేతం చేయాలని అసోంకు చెందిన ఎంపి గౌరవ్‌ గొగోరు అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ఒక ప్రయివేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెడుతానని అన్నారు.

Courtesy prajasakti..

RELATED ARTICLES

Latest Updates