మమ్మల్ని తీవ్రంగా కొట్టారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 మైనర్లమని చూడకుండా హింసించారు
– ‘పౌరనిరసనలపై యూపీ పోలీసుల తీరును వివరించిన బాధితులు
ఓ సంస్థ నిజనిర్ధారణ నివేదికలో వెల్లడి

లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పోట్లాడినా యోగి సర్కార్‌ మాత్రం వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. నిర్బంధాలు, విచారణల పేరుతో వారిని తీవ్రంగా హింసిస్తున్నది. చిన్నా, పెద్దా.. ఆడ, మగ అనే తేడా లేకుండా చట్టాలను సైతం లెక్కచేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మైనర్లను నిర్బంధించి వారిని యూపీ పోలీసులు చిత్రహింసలకు గురిచేయడమే దీనికి తార్కాణం. ‘ది క్విల్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ నిజనిర్ధారణ నివేదికలో ఈ విషయా లు వెల్లడయ్యాయి. గతనెల 10 నుంచి 24 మధ్య.. బాధిత మైనర్లను ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాలను సేకరించి ఈ నివేదికను సదరు సంస్థ రూపొందించింది. పలువురు బాధితులు యూపీ పోలీసులు తమను హింసించిన విధానాన్ని వివరించారు. బిజ్నూర్‌, ముజఫర్‌నగర్‌, ఫిరోజాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించి యూపీ పోలీసుల దాష్టీకాన్ని సదరు సంస్థ బయటపెట్టింది.

నిర్బంధంలోనే 41 మంది మైనర్లు..!
బాధితులు తెలిపిన వివరాలు, కమిటీ సేకరించిన వివ రాల ప్రకారం.. ఇప్పటికీ దాదాపు 41 మంది మైనర్లు పోలీ సుల నిర్బంధంలోనే ఉన్నట్టు నిజనిర్ధారణ బృందం తన దర్యాప్తులో కనుగొన్నది. ఇందులో బిజ్నూర్‌ నుంచి 22 మంది, ముజఫర్‌నగర్‌ నుంచి 14 మంది మైనర్లు ఉన్నారు. ముజఫర్‌ నగర్‌లో నలుగురిపైన ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన పోలీసులు.. వారిని 12 రోజుల తర్వాత నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. ఫిరోజాబాద్‌లో ఇద్దరు మైనర్లు ఇప్పటికీ నిర్బంధంలోనే ఉండగా.. వారికెలాంటీ న్యాయసహాయం అందకపోగా, దీనిపై తగిన మీడియా కవరేజి కూడా ఉండ టంలేదు. ఇక రాష్ట్ర రాజధానిలో ఇద్దరు మైనర్లు మాత్రం బుల్లెట్‌ గాయాలతో తీవ్ర బాధను అనుభవిస్తున్నారు. ప్రధా ని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పోలీసుల దమనకాండకు ఎనిమిదేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పో యాడు.
లాఠీలతో విరుచుకుపడ్డారు.

పోలీసులు తమతో చాలా కఠినంగా వ్యవహరించి తీవ్రగాయాలపాల్జేశారని బాధిత మైనర్లు వాపోయారు. లాఠీలతో దారుణంగా కొట్టి మమ్మల్ని కనీసం నడవకుండా చేశారని తెలిపారు. నిర్బంధం నుంచి విడిచిపెట్టిన తర్వాత బాధితులు గాయాలపాలైన, నీరసించిన శరీరాలతో తమ ఇండ్లకు చేరకున్నట్టు వివరించారు. నాగినాకు చెందిన 15 ఏండ్ల వికలాంగుడు మాట్లాడుతూ.. ”నేను నా పరిస్థితి గురించివారికి వివరించాను. కానీ, పోలీసులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా నన్ను పోలీసు వ్యానులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏ మాత్రం సమయం ఇవ్వకుండా నన్ను దారుణంగా కొట్టారు” అని వివరించాడు.

అదే ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడు మాట్లా డుతూ…” పోలీసులు నన్ను హింసించడానికి రెండు రోజు లు నిర్బంధంలో ఉంచారు. వారు ముఖ్యంగా మా శరీరం కింది భాగాలనే లక్ష్యంగా చేసుకుంటూ లాఠీలతో కొట్టారు. దీం తో 15 రోజుల తర్వాత కూడా నేను సరిగ్గా నడవలేకపో యాను. రెండు రోజుల పాటు నన్ను నిర్బంధంలో ఉంచిన పోలీసులు చాలా ఘోరంగా హింసించారు” అని జరిగిన విషయాన్ని ఏడ్చుకుంటూ వివరించాడు. కాగా, నిర్బంధాల పేరుతో యూపీ, కేంద్ర ప్రభుత్వాలు జువైనల్‌ జస్టిస్‌ యాక్టును ఉల్లంఘించాయి. చిన్నారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఐక్యరాజ్య సమితి బాలల హక్కులకు విరుద్ధంగా ఉన్నది. కాగా, ఈ విషయంపై బిజ్నూర్‌ ఎస్పీ సంజీవ్‌ త్యాగిని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా దీనిపై తనకేమీ తెలీదని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే దీనిపై యోగి సర్కారు ఎలాంటి దర్యాప్తునకూ ఆదేశించకపోగా.. కనీసం ఏదైనీ ప్రకటనను కూడా ఇవ్వలేదు. బదులుగా సీఎం స్థాయిలో ఉన్న యోగి.. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకుంటామనీ, పోలీసుల తీరును సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates