అనాథ శవంగా అందరి వైద్యుడు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కరోనాతో యునానీ డాక్టర్‌ మృతి
  • ఆయన కుటుంబానికంతా పాజిటివ్‌
  • గాంధీలో కొనసాగుతున్న చికిత్స
  • బంధుమిత్రులూ హోం క్వారంటైన్‌
  • వైద్య సేవతో పేదల్లో మంచి గుర్తింపు
  • ఖననం చేసేందుకూ ఎవరూ లేరు
  • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు
  • సూర్యాపేటలో శరవేగంగా కరోనా
  • తాజా 56 కేసుల్లో 26 అక్కడి నుంచే
  • గద్వాల, వికారాబాద్‌లూ డేంజరే
  • రంగంలోకి రాష్ట్ర సీఎస్‌, డీజీపీ
  • నేడు మూడు జిల్లాల్లో పర్యటన
  • ప్రత్యేకాధికారులుగా ఐఏఎ్‌సలు

మంగళ్‌హాట్‌ : ఆయన యునానీలో చేయి తిరిగిన వైద్యుడు. పేదా గొప్పా తేడా లేకుండా నిత్యం రోగులకు చికిత్స అందిస్తారు. తనకు కరోనా ఎలా సోకిందో తెలియకుండానే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. పాత బస్తీ ప్రజలకు తన వైద్యంతో ఎంతో దగ్గరైన ఆయన ఇప్పుడు అనాథ శవంగా మిగిలిపోయారు. గాంధీలో ఉన్న కుటుంబం, హోంక్వారంటైన్‌లో ఉన్న బంధుమిత్రులు ఖననం చేసే పరిస్థితి లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బందే అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత విషాదకర సంఘటన హైదరాబాద్‌లోని ఆగాపురాలో జరిగింది. యునానీ వైద్యుడు(52) ఏసీగార్డ్స్‌ ప్రాంతంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో నాంపల్లి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

13న కరోనాగా గుర్తించి, ఆయన్ను కుటుంబ సభ్యులను గాంధీకి తరలించారు. అందరికీ పాజిటివ్‌ అని తేలింది. వైద్యుడు మంగళవారం మృతి చెందారు. భార్య, తల్లి, సోదరి, సోదరునికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. ఆయన క్లీనిక్‌కు నాంపల్లి, మాసాబ్‌ట్యాంక్‌, ఏసీ గార్డ్స్‌ నుంచి పెద్దఎత్తున రోగులు వస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా చుట్టు పక్కల వారు ఈయన దగ్గరికే వచ్చేవారు. మార్చి 26 నుంచి ఆయన క్లీనిక్‌ మూతపడింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates