కంపెనీల బోర్డుల్లో మహిళలు 15 శాతమే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

23వ స్థానంలో భారత్‌

ముంబై: సమాజంలోనే కాదు.. కంపెనీల సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పదవుల్లోనూ మన దేశంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో మహిళా ప్రాతినిధ్యపరంగా చూస్తే భారత్‌.. ప్రపంచంలో 23వ స్థానంలో ఉంది. ‘సీఎస్‌ జెండర్‌ 3000’ నివేదిక పేరుతో క్రెడిట్‌ సూయిస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎ్‌సఆర్‌ఐ) గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల బోర్డుల్లో సగటున 20.6 శాతం మహిళలు ఉన్నారు. మన దేశంలో ఇది కేవలం 15.2 శాతం మాత్రమే. కాకపోతే ఈ విషయంలో మన దేశం దక్షిణ కొరియా (3.1 శాతం), పాకిస్థాన్‌ (5.5 శాతం), జపాన్‌ (5.7 శాతం) కంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో ఫ్రాన్స్‌ మిగతా అన్ని దేశాల కంటే ముందుంది. అక్కడి కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో 44.4 శాతం మంది మహిళలే. నార్వే (40.9 శాతం), బెల్జియం (35.9) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నివేదికలోని మరిన్ని అంశాలు

  • వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల కంపెనీల బోర్డుల్లో సగటున 30 శాతం మహిళలు
  • భారత కంపెనీల సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పదవుల్లో 6.9 శాతం మంది మహిళలు
  • భారత కంపెనీ సీఈఓల్లో రెండు శాతం మాత్రమే మహిళలు
  • భారత కంపెనీల సీఎ్‌ఫఓల్లో ఒక శాతం మంది మాత్రమే మహిళలు
  • సింగపూర్‌, ఇటలీ కంపెనీల సీఈఓల్లో 15 శాతం మంది మహిళలే
  • థాయ్‌లాండ్‌ కంపెనీల సీఎ్‌ఫఓల్లో 42 శాతం మంది మహిళలున్నారు

Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates