చర్చల్లేవ్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for చర్చల్లేవ్‌విధుల్లో చేరని వారిని తీసుకోం
 సమ్మెతో ఆర్టీసీకి తీవ్ర నష్టం
 కార్మిక సంఘాల తీవ్రతప్పిదం
 న్యాయస్థానంలో బలంగా వాదన వినిపిద్దాం
 పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
 ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రమాదాలు జరగకుండా చూడండి

ప్రత్యామ్నాయ బస్సులతో అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అనుభవజ్ఞులైన వారినే డ్రైవర్లుగా నియమించాలి. ఆర్టీసీ టికెట్లను ముద్రించి, వాటి ద్వారానే ప్రయాణాలకు అనుమతించాలి. డిపోల వద్ద బస్సులను నిరోధించేందుకు, విధుల్లో ఉన్న వారికి ఇబ్బంది కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి’’

సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌ : సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు సంస్థ రూ.150 కోట్ల  ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదన్నారు. వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె అసంబద్ధమని న్యాయస్థానంలో బలమైన వాదన వినిపించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి వివరించాలని ఆయన సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో సేవలందించాలని, మొత్తం అన్ని బస్సులు నడపాలని, పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని  సూచించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శి సునిల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది. ‘‘ఆర్టీసీలో సమ్మె దురుద్దేశ పూరితం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చింది. దీని ద్వారా 67 శాతం అదనంగా వేతనం పెరిగింది. ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్టీసీకి కేవలం రూ. 1600 కోట్లను ఇచ్చింది. ఇందులో తెలంగాణ వాటా రూ. 712 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత  రాష్ట్ర ప్రభుత్వం రూ. 3300 కోట్ల మేరకు సాయం అందించింది. రూ. 800 కోట్ల గ్యారంటీ ఇచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయలేరు. వేతనాలు పెంచినా సంస్థ పనితీరు మెరుగు కాలేదు.  లాభాలు రాలేదు. రూ. 5000 కోట్ల నష్టంతో సంస్థ ఉంది.  బతుకమ్మ, దసరా పండుగల సమయంలో  సంస్థ, ప్రజల గురించి పట్టించుకోకుండా సంఘాలు వ్యవహరించాయి. ఈ సమయంలో  సంస్థకు భారీగా ఆదాయం వచ్చేది.  ఈ నెల అయిదో తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 150 కోట్లను సంస్థ నష్టపోయింది. దీనికి సంఘాలే బాధ్యత వహించాలి. సమ్మె ద్వారా వారేమీ సాధించలేరు. ప్రభుత్వంపై వారి ఒత్తిడి ఏమాత్రం పనిచేయదు. అధికారులు  ప్రయాణికులకు సాధారణ స్థాయిలో సేవలందించాలి. ఎక్కడా బస్సుల కోసం వేచి చూసే పరిస్థితి ఉండరాదు.. ఈ నెల 21 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో  బస్సు సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులు, జర్నలిస్టులు, ఇతర వర్గాల వారికి ఇచ్చిన పాస్‌లను బస్సుల్లో అనుమతించాలి. ఆర్టీసీ అద్దె బస్సులు మరిన్నింటిని తీసుకోవాలని, అన్ని రూట్లలో వాటిని నడిపించాలన్నారు.

కొత్త ఎండీ ఇప్పుడు అవసరం లేదు
కొత్త ఎండీ నియామకంపైనా ఈ సందర్భంగా చర్చించారు. ప్రస్తుతం  సమ్మె కొనసాగుతోంది. ఇతరత్రా సంక్షోభ పరిస్థితులున్నాయి. ఈ తరుణంలో హడావిడిగా ఎండీ నియామకం సాధ్యం కాదు’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు అధికారులు ఈ నెల 5 తేదీ నుంచి ఆర్టీసీ సమ్మె వల్ల ఏర్పడిన నష్టంపై నివేదిక ఇచ్చారు.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates