హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 గాంధీకి ఐదుగురు.. ఫీవర్‌ ఆస్పత్రికి నలుగురు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది మంది కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులను ఆశ్రయించారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మిగిలిన ప్రయాణికుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం ముగ్గురు ఎయిర్‌హోస్టె్‌సలను గాంధీ ఆస్ప్రతికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. వారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో నలుగురు అనుమానితులు చేరారు. బీజింగ్‌ నుంచి సొంత పని మీద హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు చైనా దేశస్థులు అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండానే వెళ్లిపోయారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల చైనా వెళ్లి వచ్చారు. వారు కూడా అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చారు.
24 గంటలూ అప్రమత్తం మంత్రి ఈటల రాజేందర్‌
కరోనా వైర్‌సను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల చెప్పారు. హైదరాబాద్‌లో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్‌తో పాటు కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చైనా నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. చైనా నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 52 మంది రాగా.. వారిలో 21 మందికి వైరస్‌ లేదని తేలిందని, మరో నలుగురి రిపోర్టులు అందాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో మాస్కుల కొరత!
కరోనా వైరస్‌ దెబ్బకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మాస్కులు ధరించాలని ప్రచారం జరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్‌95 మాస్కుల కొరత ఏర్పడింది. వాస్తవానికి చైనా నుంచి వచ్చిన వారు మాత్రమే ఎన్‌95 మాస్కులు ధరించాలని, సాధారణ ప్రజలకు అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర అధికారులు చెబుతున్నప్పటికీ.. అందరూ వాటి కోసమే ఎగబడుతున్నారు. ఈ మాస్కుల కొరత నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం భేటీ అయ్యారు.

వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న చైనాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టిపెట్టారు. అన్ని ఆస్పత్రులకు అవసరమయ్యే మాస్కులు, ఇతర పరికరాల ఇండెంట్స్‌ను ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి సూపరింటెండెంట్లను ఆదేశించారు. గ్రేటర్‌ పరిధిలో 40-50 లక్షల వరకు ఎన్‌95 మాస్కులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు దుకాణదారులు చెబుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates