అమెరికా, ఐరాస జోక్యం చేసుకోవాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • కశ్మీరు అంశం అంతర్జాతీయ సమస్య
  • పాక్‌ ఎన్‌ఎ్‌ససీ భేటీలో ఇమ్రాన్‌ఖాన్‌

కశ్మీర్‌ అంశం అంతర్జాతీయ సమస్యగా మారిందని, దానిపై అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జోక్యం చేసుకోవాల్సిన సరైన సమయం ఇదేనని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన పాక్‌ జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎ్‌ససీ) అత్యవసర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల వద్ద భారత్‌ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఇమ్రాన్‌ ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బలంగా తిప్పికొట్టే సత్తా తమకు ఉందన్నారు. కశ్మీరీల హక్కులను కాపాడేందుకు నైతిక, రాజకీయ, దౌత్యపరమైన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను గమనించాల్సిందిగా ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సెక్రెటరీ జనరల్‌ను పాక్‌ కోరినట్లు, అందుకు అది అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఎల్‌వోసీకి ఇవతల పాక్‌ సైనికులు, ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది.

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates