ఢిల్లీ ఉద్యోగుల్లో మైనార్టీల వాటా ఎంత?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

( దేశీ దిశ పరిశోధన, విశ్లేషణ విభాగం)

ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతమంది మైనారిటీ ఉద్యోగులు పని చేస్తున్నారో తెలపాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ వివరాల్ని మైనారిటీ కమిషన్ కు అందించాల్సి ఉంది. 2017 -18 లో హ్యాపీ కమిషన్ ఇలాంటి ప్రయత్నమే చేయగా కొన్ని శాఖలు మాత్రమే అప్పుడు సమాధానం ఇచ్చాయి. ఢిల్లీలో200 ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టి, ఓబీసీ, మైనారిటీ శాఖలు ఫ్యాక్టరీ లైసెన్సింగ్ విభాగాల్లో ఒక్కరంటే ఒక్క మైనారిటీ చొప్పున మాత్రమే పని చేస్తున్నారని అప్పుడు తేలింది. ప్రభుత్వ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల్లో 1.12% మందిమైనార్టీలు పని చేస్తున్నారన్నమాట. ఢిల్లీలో 12.8 6 శాతం ముస్లిం జనాభా ఉన్నది. ఇంకా క్రిస్టియన్ తదితర మైనార్టీలను కలుపుకుంటే సుమారు 20 శాతం వుండొచ్చు. కానీ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 2.45 శాతం ముస్లింలు మాత్రమే పనిచేస్తున్నట్లు గతంలో కొన్ని శాఖల్లో జరిగిన అధ్యయనంలో తేలింది. ఉన్నత విద్యాశాఖ 2017-18 లో జరిపిన అఖిలభారత సర్వేలో దేశంలో 4.9 శాతం మంది ముస్లిం విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్యకు ఎన్రోల్చేసుకున్నారని బయటపడింది. ఢిల్లీలో ఇది కేవలం 2.12 శాతం గా ఉన్నది.

మైనార్టీలు ముఖ్యంగా ముస్లింల వెనుకబాటుతనాన్ని వారిపై నెల ఉన్న వివక్షను తెలుసుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం  సర్వేకు ఆదేశించటం ప్రగతిశీల వాదులు హర్షిస్తున్నారు. అయితే మరోపక్క బిజెపి , సంఘ్ పరివార్ కేజ్రీవాల్ చర్యను మైనారిటీలను మంచి చేసుకునే పనిగా విమర్శించింది. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక గాని, పైన పేర్కొన్న వివరాలు గానీ చూస్తే ఇప్పటివరకు దేశంలో ముస్లింలు ఎంతో వెనకబాటుకు గురయ్యారని స్పష్టంగా అర్థం అవుతున్నది . అందుకు భిన్నంగా సంఘ్ పరివార్ లౌకిక పార్టీలను తరచూ ముస్లింలను దువ్వే పార్టీలు గాను, వారి మెప్పు పొందేందుకు ఎన్నెన్నో పథకాలు అమలు చేసే పార్టీలు గాను విమర్శించటం గమనార్హం. ఈ అసత్యాన్ని వందసార్లు పదేపదే ప్రచారం చేయటం ద్వారా బిజెపి ఎన్నికల్లో లాభపడుతూవస్తున్నది. ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులు ముస్లింల నిజ పరిస్థితిని గురించి పౌర సమాజం ముందు గళం విప్పి మరింతగా వాస్తవాలను తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి సర్వే అన్ని రాష్ట్రాల్లోనూ నగరాలు పట్టణాల్లో ను నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, మేధావులు, జర్నలిస్టులపై ఉన్నది.

RELATED ARTICLES

Latest Updates