ఉక్కుపాదం మోపితే మూల్యం చెల్లించక తప్పదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కేసీఆర్‌ ప్రపంచంలోనే లేనటువంటి ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే కొత్త పదాన్ని కనిపెట్టి 48 వేల మందిని ఒక్క కలం పోటుతో తొలగించినట్లు ప్రకటించారు. ఈ సమ్మె సందర్భంగా అనేక రాజ్యాంగ విషయాలు నేడు చర్చ నీయాంశం అయ్యాయి. ‘సమ్మె చేయడం, విరమించడం మీ ఇష్టమేనా?’ అని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు.
సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పలుమార్లు నొక్కి వక్కాణించింది. కార్మికులు నిరసన తెలియజేయడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టడం సరికాదు. నిరసన తెలియజేయడం కూడా కార్మికుల ప్రధానమైన హక్కు. అధికారం ఉందనే అహంకారంతో కేసీఆర్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
కార్మికులపై ఉక్కుపాదం మోపినవారు తగిన మూల్యం చెల్లించక తప్పలేదని చరిత్ర చెప్తోంది. ప్రపంచంలో హిట్లార్‌కి ఏ గతి పట్టిందో చూశాం. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం పతనం గాక తప్పలేదు. 2012లో తమిళనాడులో జయలలిత ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులపై చేసిన నిర్బంధానికి ఫలితం అనుభవించింది. 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులో సమ్మె చేశారని లక్ష మందిని ఒకేసారి తొలగించడం చట్టవిరుద్ధమని ఆక్షేపిస్తూ తిరిగి విధుల్లోకి చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. నేడు తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కార్మికులు బేషరతుగా సమ్మె విరమించి విధుల్లోకి చేరడానికి సిద్ధమయ్యారు. నవంబర్‌ 26వ తేదీన డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి బలవంతంగా వ్యానుల్లో కుక్కారు. 48 వేల మంది ఆర్టీసి కార్మికులు 52 రోజుల నుంచి నిరవధిక సమ్మె సాగించారు. 40 రోజుల ముందు ఆర్టీసి యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె నోటీసు సమర్పించారు. గత రెండు సంవత్సరాల నుంచి తమ డిమాండ్లు పరిష్కరించమని పలుసార్లు వేడుకున్నారు. అయినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక సమ్మెకు దిగారు. చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టీసి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్టీసికి ప్రతి సంవత్సరం రూ.వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సినందువల్ల ఆర్టీసిని నడపడం సాధ్యం కాదని కేసీఆర్‌ అడ్డగోలు వాదనకు దిగారు. నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలేనని అనేకసార్లు కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, మేధావులు ప్రకటించారు. హైకోర్టు తెలంగాణ అధికారుల తప్పుడు లెక్కలను బెంచ్‌ మీద నుంచి ఎండగట్టారు. కార్మికులు సమ్మె లోకి దిగకపోతే కేసీఆర్‌ ఆర్టీసిని ఏం చేసేవారు?

52 రోజుల నిరవధిక సమ్మెలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఎసి) కింద ఐక్యంగా పోరాడారు. కేసీఆర్‌ అనేకసార్లు కార్మికులను లొంగదీసుకొని విధుల్లో చేరాలని ఒత్తిడి చేశారు. ‘ఎస్మా’ ప్రయోగించేందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అనుమతి కోరారు. ఎస్మాను ప్రయోగించి నాయకులను అరెస్టు చేయాలని చూశారు. హైకోర్టు నిరాకరించడంతో వారి పప్పులు ఉడకలేదు. కేసీఆర్‌ మొదటి నుంచి ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే పేరుతో కార్మికులందర్నీ తొలగించామని సమ్మె ప్రారంభించిన వెంటనే ప్రకటించారు. ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే పదం ఏ చట్టం లోనూ లేదు. ఏ కార్మికుడూ తనంతట తనను విధినుంచి తొలగించుకోవడం చేయరు. కేసీఆర్‌ ప్రపంచంలోనే లేనటువంటి కొత్త పదాన్ని కనిపెట్టి 48 వేల మందిని ఒక్క కలం పోటుతో తొలగించినట్లు ప్రకటించారు. ఈ సమ్మె సందర్భంగా అనేక రాజ్యాంగ విషయాలు నేడు చర్చ నీయాంశం అయ్యాయి. ‘సమ్మె చేయడం, విరమించడం మీ ఇష్టమేనా?’ అని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పలుమార్లు నొక్కి వక్కాణించింది. కార్మికులు నిరసన తెలియజేయడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టడం సరికాదు. నిరసన తెలియజేయడం కూడా కార్మికుల ప్రధానమైన హక్కు. అధికారం ఉందనే అహంకారంతో కేసీఆర్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. సామరస్యంగా చర్చించి పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సలహాలను బేఖాతరుగా కేసీఆర్‌ వ్యవహరించారు. చర్చలు జరిపి పరిష్కరించడానికి ఆవగింజంత కూడా ప్రయత్నించలేదు. ‘పారిశ్రామిక వివాద చట్టం-1947’ ప్రకారం బేరసారాలాడే హక్కు కార్మిక వర్గానికి ఉంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది. కార్మిక వర్గానికి మన దేశంలోని 44 చట్టాల్లో అతి ముఖ్యమైనవి మూడు అంశాలు. సంఘం పెట్టుకోవడం, బేరసారాలాడి సమస్యలను పరిష్కరించుకోవడం, పరిష్కారం కాకపోతే ఆఖరి ఆయుధంగా సమ్మె పోరాటానికైనా దిగడం కార్మికుల ప్రాథమిక హక్కులు. కేసీఆర్‌ ఈ హక్కులన్నింటిని తుంగలోకి తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మిగిలిన ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యేలు ఈ సమ్మెపై నోరు మెదపలేదు. ప్రతి రోజు ప్రభుత్వాధికారులతో సమావేశాలు జరిపి కేసీఆర్‌ నేతృత్వం లోనే సమ్మె అణచివేత చర్యలకు పూనుకున్నారు. ప్రభుత్వ పనులన్నింటిని పక్కన పెట్టి గత 50 రోజులుగా ఇదే పనిగా కేసీఆర్‌ వ్యవహరించారు.
ఈ సమ్మెలో కీలకమైన విషయం ప్రైవేటీకరణ ముందుకొచ్చింది. దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్టీసి ఆధ్వర్యంలో సాగుతున్నది. ఆర్టీసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ప్రజలకు నేటికీ చవకయిన, సురక్షితమైన ప్రయాణం సాధ్యమౌతుంది. ప్రతి రోజు కోటి మంది ప్రజలు ఆర్టీసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పేద పిల్లలు 10 లక్షల మంది రాష్ట్రంలో స్కూళ్లకు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అనేక తరగతులకు రాయితీలు సాధ్యమయ్యాయి. మారుమూల గ్రామాలకు ప్రయాణాలు ఆర్టీసి ఒక్కటే ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నది. ఆర్టీసి ఆస్తులు బాగా పెరిగాయి. హైదరాబాద్‌తో సహా విలువైన స్థలాలు నగరాల నడిబొడ్డున ఉన్నాయి. ఈ స్థలాలను తమ ఆప్తులకు, అనుయాయులకు చవకగా కట్టబెట్టడానికి ఆర్టీసి సమ్మెను సాకుగా చూపి ఆర్టీసి ప్రైవేటీకరణ విధానాలను అమాంతంగా అమలు చేయడానికి కేసీఆర్‌ పూనుకున్నారు. స్థలాలను అమ్ముకునే దురుద్దేశ్యంతోనే ఈ సమ్మెను అణచే దుర్మార్గపు పద్ధతులకు ప్రభుత్వం పూనుకున్నది. హుజూర్‌నగర్‌ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్‌ మరింత రెచ్చిపోయి వ్యవహరించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శనకు అనుమతించకుండా ఆ ప్రదేశాన్ని రక్తసిక్తం చేశారు. నిర్బంధాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రతరం చేసింది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి చేసినా ఆర్టీసి కార్మికులు ముక్త కంఠంతో ఐక్యంగా నిలబడ్డారు. తెలంగాణ ఆర్టీసి కార్మికులకు మొదటిరోజే ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు రాష్ట్ర కమిటీ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టింది. మరలా నేడు (నవంబర్‌ 27న) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా సిఐటియు అండగా వుంటుందని తెలియజేస్తున్నాం.

సిహెచ్‌. నరసింగరావు
( వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు )

RELATED ARTICLES

Latest Updates