ధనికులు, శక్తివంతులకే ‘న్యాయం’

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా

న్యూఢిల్లీ : చట్టాలు, న్యాయవ్యవస్థ ధనికులు, శక్తివంతులకే అనుకూలంగా ఉంటాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ దీపక్‌ గుప్తా తెలిపారు. బుధవారం తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ధనవంతుడ్ని అరెస్టు చేస్తే న్యాయవ్యవస్థ అల్లాడిపోతుందని అన్నారు. అతని కేసు విచారణను వేగవంతం చేయడం కోసం బెయిల్‌ దరఖాస్తులు పదేపదే దాఖలు చేయబడతాయనీ, పేదవాడి వ్యాజ్యం వాయిదా విలువతో ధనవంతుడి కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. పేదలకు కూడా జీవించే హక్కు, తన గౌరవాన్ని కాపాడుకునే హక్కు ఉంటాయనీ, న్యాయవ్యవస్థ వారికి సహాయం చేయాలని అన్నారు. ‘దేశంలో ప్రతి పౌరుడి గౌరవాన్ని, జీవించే హక్కును రక్షించే బాధ్యత కోర్టుల విధి. సంక్షోభ సమయాల్లో పేదలను, నిరుపేదలను కోర్టు రక్షించాలి. ఎందుకంటే వారు న్యాయం కోసం ప్రయత్నించే సమయంలో ఎదురుదెబ్బలు తినివుంటారు. ఎప్పుడైతే కోర్టులు పౌరులకు అనుకూలంగా ఉంటాయో, కొన్నిసార్లు ఘర్షణ తలెత్తుతుంది. కానీ, కొద్దిగా ఘర్షణలు కోర్టులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నాయనటానికి సంకేతం’ అని తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates