కులాంతర వివాహాలు- ప్రాధాన్యత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

                                                      -నాగటి నారాయణ
వందేండ్ల స్వాతంత్య్ర పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశం సాధించింది పరదేశ పాలన నుండి విముక్తి మాత్రమే. స్వరాజ్య పాలన వ స్తే అంతర్గత ఆర్థిక, సామాజిక సమస్యలు పరిష్కరించుకోవ చ్చనే ఆశలు, ఆకాంక్షలు ఏడు దశాబ్దాలు గడిచినా సాధ్యం కాలేదనే విషయమూ తెలిసిందే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు ఒక్కటే అమలు జరుగుతోం ది. దానివల్ల ఆర్థిక అంతరాల అగాధం కూడా పెరుగుతోంది. సమానత్వం, స్వేచ్ఛ, దోపిడీ వ్యతిరేక, మతస్వేచ్ఛ, సం స్కృతి విద్య హక్కులను అతి కొద్దిమందే అనుభవించగలుగు తున్నారు. అత్యధికులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్న వి. అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ లేదు, ఇష్టమైన తిండి తినే అవకాశం లేదు, విద్యా, వైద్యం అందుబాటులో లేవు, చేతినిండా పని లేదు, నచ్చిన వారిని పెండ్లి చేసుకునే స్వాతత్య్రం కూడా లేదు. ఇలాంటి సామాజిక సమస్యల వల్లనే భారతదేశం ప్రపంచం ముందు చిన్నబోతోంది. ఆర్థిక వృద్ధి లో ఆరో స్థానానికి చేరినట్టు చెబుతున్నా మానవాభివృద్ధిలో మాత్రం 130వ స్థానంలో వుండిపోవడం అవమానకరం. ఇతటి వెనుకబాటుతనానికి ఇతర కారణాలతోపాటు కు లాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్వేచ్ఛ లేకపోవడం ఓ ముఖ్యమైన కారణమనే వాస్తవాన్ని గమనించాలి.
కుల వివక్షత పాటించవద్దని, అసలు కులాలే ఉం డకూడదని తక్కువ కులాలవారు, అభ్యుదయ వాదులు అం టుంటే, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వుండ కూడదని అగ్ర కులాలవారు మరియు సనాతన వాదులు వాదిస్తున్నా రు. ఈ వాదోపవాదాలు, వివాదాల వలన అప్పుడప్పుడు కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమవుతున్న విషయాలు తెలిసినవే. ఎంతకాలం ఈ కుల వ్యవస్థ, రిజర్వేషన్ల కొనసా గింపు అనే అసహనం షరా మామూలే. సంక్లిష్టమైన ఈ సా మాజిక సమస్యలకు పరిష్కారం కులాంతర వివాహాల్లోనూ ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఉద్యోగాలు వచ్చినా, ఆర్థిక పరిస్థితి మెరుగైనా కుల వివక్షత, అంటరానితనం కొనసా గుతూనే ఉంది. కులాంతర వివాహాలతోనే కుల వ్యవస్థను నిర్ములించవచ్చని ‘యూత్‌ కీ ఆవాజ్‌’ సంస్థ తేల్చింది. అభి వృద్ధి చెందిన దేశాల్లో కులాల సమస్య లేదు. నచ్చిన వారిని హాయిగా వివాహం చేసుకుని భార్యాభర్తలు ఇరువురూ సం సార జీవితంలో, సామాజిక, ఆర్థికాభివృద్ధిలో స్వేచ్ఛగా పాల్గొంటున్నారు. కానీ మన దేశంలో ప్రేమించిన వారిని పెండ్లి చేసుకునే స్వేచ్ఛ లేక అంతర కులం (అదే కులం)లో అరెంజుడ్‌ మేరేజెస్‌కే పరిమితం కావడం కుల వ్యవస్థ యధాతధంగా కొనసాగిస్తోంది. కుల వివక్షత ఉన్నంత కాలం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనివార్యం. వేరువేరు కులాల వారు జతకూడితే కుల దురహంకారం పాటించే అవకాశం తక్కువ. అగ్ర కులాల వారు నిమ్న కులాల వారు ఒక్కటైతే అగ్ర కుల ఆధిపత్యం కూడా తగ్గే అవకాశం వుంది. రిజర్వేషన్ల పట్ల సానుకూల ప్రతికూల వాదనలు కూడా పరి మితం కావచ్చు. కుల పరమైన ఆధిపత్యం, అణచివేత లేకుడాపోతే కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల అవసరమూ లేకపో వచ్చు. ఇద్దరూ ఇష్టపడి కొంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకునే పెండ్లి చేసుకుంటారు గనుక అరమరికలు లేకుం డా ఐక్యంగా జీవించే అవకాశం ఎక్కువ. పుట్టే పిల్లలు కూడా జన్యుపరమైన లోపాలు లేకుండా ప్రజ్ఞావంతులుగా వుంటా రని కూడా కొన్ని పరిశోధనలు తెలియజేశాయి. అందుకని కులాంతర వివాహాలకు మద్దతు, ప్రోత్సాహం ఓ కర్తవ్యంగా పెద్ద ఎత్తున ఉద్యమ రూపం తీసుకోవాలి.
కులాంతర వివాహాలు స్వాతంత్య్రానికి పూర్వం నుండీ వున్నాయి. రాచరిక యుగంలో రాజులు, బ్రాహ్మలు కింది కులాలవారిని చేపట్టినట్టు రామాయణం, మహాభారతం గ్రం ధాల్లో, మధ్య యుగాల్లో, మొఘలాయి, బ్రిటిష్‌ పాలనా కా లాల్లో చాలా ఉన్నవి. స్వాతంత్య్రోద్యమ నేతల్లో కొందరు కులాంతర వివాహాలు చేసుకున్న ప్రముఖులున్నారు. సంఘ సంస్కరణోద్యమాల్లో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కులాంతర వివాహాలను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అన్నాదురై, పెరియార్‌ రామస్వామి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మంతెన వెంకటరాజు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మార్గదర్శకులు ఉన్నారు. అభ్యుదయ వాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో కొంతమంది కులాంతర వివాహాలు చేసుకున్న వారున్నారు. ఇటీవల ప్రేమ వివాహాలు పెరుగుతుండడంతో వాటిలో కొన్ని కులాంతరం కూడా ఉంటున్నవి. పట్టణీకరణ, ఉన్నత చదువులు, మధ్యతరగతి పెరుగుతుండడంతో కులాంతర వివాహాలు పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నవి. మ్యాట్రిమోనీ వెబ్సైట్స్‌, వేదికల్లో నచ్చితే చాలు ఏ కులమైనా ఫర్వాలేదనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా దేశంలో కులాం తర వివాహాలు చాలా తక్కువ సంఖ్యలోనే వున్నవి. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వే (2005-06)లో దేశవ్యాప్తం గా అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు, హౌదాలకు చెందిన లక్ష కుటుంబాల వివాహం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ సర్వే ప్రకారం కులాంతర వివాహాలు 11 శా తం వున్నట్టు తెలిసింది. అందులో మహిళలు తమకంటే త క్కువ కులం వారిని పెండ్లి చేసుకున్నవి 5.58% కాగా, ఎక్కువ కులంవారిని చేసుకున్నవి 5.38% వున్నవి. కొన్ని రాష్ట్రాల్లో 20శాతం వరకు ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజెస్‌ వున్నట్టు సర్వే తెలియజేసింది. గోవా 20.69శాతం, సిక్కిం 20శాతం, పంజాబ్‌ 19.90శాతం, కేరళ 19.65 శాతం, హర్యానా 18.50 శా తం, మహారాష్ట్ర 17 శాతం, కర్ణాటక 16.41 శాతం, త్రిపుర 16 శాతం, గుజరాత్‌ 15.49 శాతం. ఈ సంఖ్యలను చూస్తుంటే ఫర్వాలేద ని అనిపిస్తుంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. కాగా సంఘ సంస్కరణోద్యమా లు, అభ్యుదయ ఉద్యమాలు గణనీయంగా జరిగే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఐదు శాతంలోపే వుండడం ఆశ్చర్యంగా వుంది.రాజ్యాంగం, చట్టాలు, పరిపాలనపరంగా కులాంతర వివాహాలకు ఎలాంటి ఆంక్షలు, అవరోధాలు లేవు. కానీ మన సమాజం, సంస్కృతి సహించడం లేదు. కుల, మతాలకు అ తీతంగా నచ్చినవారిని పెండ్లి చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించినా భారతీయ సమాజంలో కరుడుగట్టిన కులవ్యవస్థ అడ్డుపడుతోంది. ధైర్యం చేసుకుని పెండ్లి చేసుకున్న జంట లను వెంటాడి వేధిస్తోంది. కుటుంబాల నుండి, కులాల నుండి వెలి వేస్తోంది. దాడులు, దౌర్జన్యాలు, పరువు హత్యల కు పాల్పడుతోంది. అంతటి తీవ్రమైన సామాజిక నిర్బంధా న్ని, హింసను తట్టుకోలేక ప్రేమికుల్లో కొందరు పెండ్లి చేసు కోలేక మానేస్తున్నారు. పెండ్లి అయిన తర్వాత కూడా కొద్ది మంది బలవంతంగా విడిపోతున్నారు. కొంతకాలం వరకు అభద్రతా భావంతో బతకాల్సొస్తుంది. కుటుంబాల నుండి ఆస్తి వాటా రాకపోవడం వలన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మానసి కంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితి మారితేనే కులాంతర వివాహాలు పెరిగేది. కుల వ్యవస్థ పోవాలనేవారు, రిజర్వేష న్లు ఇంకెంతకాలం అనేవారు యిందుకోసం కృషి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, భరోసా పెరగాలి.
కులాంతర వివాహం చేసుకున్న జంటల ధైర్యాన్ని మె చ్చుకుంటూ వారి కాపురం నిలబడేందుకు రూ.2.50 లక్షలు ఆర్ధిక ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్వహ ణలో ”డాక్టర్‌ అంబేద్కర్‌ కులాంతర వివాహాల సామాజిక సమగ్రతా పథకం” ఉంది. (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.75 వేలు, తెలంగాణ ప్రభుత్వం రూ.2.50లక్షలు ఇచ్చే పథ కాలు కూడా ఉన్నవి.) దళిత సంఘాలు, సామాజిక సంస్థల వత్తిడి ఫలితంగా కాంగ్రెస్‌/యూపీఏ ప్రభుత్వం ప్రారంభించి న ఆ పథకాన్ని బీజేపీ/ఎన్డీఏ ప్రభుత్వం కూడా మొక్కుబడిగా అమలుచేస్తోంది. 2013-14 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఈ పథకంలో ఇప్పటికి ఆర్థిక ప్రోత్సాహం పొందింది కేవలం 288 జంటలు మాత్రమే. దానిని బట్టి ఆ స్కీమ్‌ ఎం త బలహీనంగా, నిరుత్సాహంగా వుందో అర్థమవుతోంది. పెండ్లి చేసుకున్న జంటలో ఒకరు ఎస్సీ రెండో వారు ఎస్సీ యేతరులు అయితేనే ఆర్థిక ప్రోత్సాహానికి అర్హులవుతారు. చేసుకున్న కులాంతర వివాహం ‘హిందూ మేరేజెస్‌ యాక్ట్‌ 1955’ ద్వారా రిజిస్టర్‌ చేయబడాలి అనే నిబంధనా వుంది. కులాంతర వివాహాల్లో అత్యధికం ప్రేమించి చేసుకునేవే. ప్రేమ వివాహాలు ‘స్పెషల్‌ మేరేజస్‌ యాక్ట్‌ 1954’ ద్వారా రిజిస్టర్‌ చేస్తారు, దానికి మతం పట్టింపు వుండదు. కానీ హిదూ మేరేజస్‌ యాక్టులో హిందూ మతస్తులకే రిజిస్టర్‌ చే స్తారు. సంవత్సరంలో 500 జంటలకే ఈ ప్రోత్సాహం ఇస్తా రు. ఆ 500 ఎస్సీ జనాభా ప్రాతిపదికన వివిధ రాష్ట్రాలకు కేటాయించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ కి 21, తెలంగాణ కి 13 మాత్రమే వస్తాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారిలో ఒకరికైనా స్థిరమైన ఉద్యోగమో, ఉపాదో వుంటే తప్ప ఎక్కువమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుంది. అలాంటి వారికి ఆర్థిక ప్రోత్సాహం కొంత తోడ్పడుతుంది. కానీ ఆ పథకానికున్న పరిమితుల వల్ల, సరైన ప్రచా రం లేకపోవడం వలన కూడా ఎక్కువమంది ఉపయోగించు కోలేక పోతున్నారు. కులాంతర వివాహాలకు చట్టపరంగా రక్షణ ఉంది. న్యాయస్థానాల్లో తీర్పులు అనుకూలంగానే వస్తున్నవి. యువతీ యువకుల్లో సానుకూలత ఉంటుంది. సా మాజిక మద్దతు, ప్రభుత్వాల ఆర్థిక చేయూత కూడా పెరిగితే కులాంతర వివాహాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాల సంక్షేమం కోసం, చేసుకోబోయే వారికి భరోసా కోసం సంఘటిత కృషి సమీకృతం కావాలి. ఇదో సామాజిక ఉద్యమంగా మారితే కుల వ్యవస్థ నిర్మూలనకు, రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడి దేశంలో మానవాభివృద్ధికి మేలు చేస్తుంది.

 

RELATED ARTICLES

Latest Updates