పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కార్మికులకు పని ప్రదేశంలో వసతి కల్పించాలి
  • పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ 
  • పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌
  • ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: జయేశ్‌ రంజన్‌ 

హైదరాబాద్‌ : కరోనా సంక్షోభం కారణంగా తగిన ముందు జాగ్రత్తలతో పారిశ్రామిక యూనిట్‌లలో కార్యాకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఇండస్ర్టియల్‌ పార్కుల్లోని అన్నిరకాల పరిశ్రమలు నడిపేందుకు ముందస్తు అనుమతులు అవరం లేదని స్పష్టం చేశారు. గురువారం టీఎ్‌సఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డితో కలిసి జయేశ్‌రంజన్‌.. తెలంగాణ రాష్ట్ర పారిశామ్రిక వేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డితో పాటు 300మంది పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఇండస్ట్రియల్‌ పార్కు బయట మునిసిపల్‌ ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించి ఆయా జిల్లాల పరిశ్రమల కేంద్రాల జనరల్‌ మేనేజర్లతో అనుమతి తీసుకోవాలన్నారు. కార్మికులకు పని ప్రాంతాల్లోనే వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేసేందుకు అనుమతించిన ట్టు చెప్పారు.ఒకవేళ ఆ తరువాత కూడా పనిని కొనసాగించాలనుకున్న పక్షంలో కేంద్రం నిర్దేశించిన జాగ్రత్తలను తప్పక పాటించాలన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉందని, ఎలాంటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వస్తురవాణాకు సంబంధించి బిల్లు లేదా డీసీ ఉన్న పక్షంలో పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరూ వాహనాలను ఆపబోరని చెప్పారు. ఈ విషయంలో తగిన సాయం పొందడానికి పరిశ్రమల శాఖ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates