భారత జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ పనిగా నిర్ధారణ

  • వీడియో కాల్‌ ద్వారా స్పైవేర్‌ చొరబాటు
  • మేధావులు, హక్కుల నేతలూ టార్గెట్‌
  • వాట్సా్‌పకు కేంద్ర ఐటీశాఖ నోటీసులు
  • నాలుగు రోజుల్లో వివరణకు ఆదేశాలు
  • ప్రపంచవ్యాప్తంగా 1,400 మందికి పైగా పాత్రికేయులు, హక్కుల సంఘాల కార్యకర్తలు, వారి న్యాయవాదులు, మేధావులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల స్మార్ట్‌ఫోన్లను ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ ఎన్‌ఎ్‌సవో హ్యాక్‌ చేసింది. వారిలో పాతిక మందికిపైగా భారతీయ పాత్రికేయులు, హక్కుల నేతలు, న్యాయవాదులు ఉన్నారు. ఈ విషయాన్ని వాట్సాప్‌ నిర్ధారించింది. దీనిపై కాలిఫోర్నియా కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు చేసింది. తమ మెసేజింగ్‌ యాప్‌లోకి ఎన్‌ఎ్‌సవో అక్రమంగా చొరబడిందని ఆరోపించింది. ఈ నిఘా.. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో రెండువారాలపాటు కొనసాగిందని పేర్కొంది.

తాము ఎన్‌ఎ్‌సవో స్పైవేర్‌ పెగాస్‌సను గుర్తించిన వెంటనే.. బాధిత వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపింది. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. వాట్సా్‌పకు నోటీసులు జారీ చేశామని ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ నెల 4లోపు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఇది కేంద్రం పనేనని, దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు.

 వాట్సాప్‌ వీడియోకాల్స్‌తో స్పైవేర్‌…ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉన్న వాట్సాప్‌ కాల్స్‌ను ఎన్‌ఎ్‌సవో లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్‌ కాల్స్‌లో లొసుగుల ఆధారంగా నిర్ణీత స్మార్ట్‌ఫోన్లలోకి ట్రాకింగ్‌ స్పైవేర్లను చొప్పించింది. వారు ఆ కాల్‌ని లిఫ్ట్‌ చేయకపోయినా.. ఆ స్పైవేర్‌ (పెగాసస్‌) ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యేలా దాని సాఫ్ట్‌వేర్‌ రాసింది.

ఏయే కార్యకలాపాలు హ్యాక్‌ అయ్యాయి?…బాధిత యూజర్ల ఫోన్‌కాల్స్‌, సందేశాలు, సోషల్‌మీడియాలో కార్యకలాపాలు, లొకేషన్‌, మీడియా.. ఇలా అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ స్పైవేర్‌ ద్వారా వారికి తెలియకుండానే హ్యాకర్లు కెమెరాను యాక్టివేట్‌ చేసి, ఫొటోలు తీసుకోవచ్చు. మైక్రోఫోన్‌ను ఆన్‌ చేసి, ఏమేం మాట్లాడుతున్నారో వినవచ్చు. తొలుత ఈ స్పైవేర్‌ను సౌదీఅరేబియా కోసం తయారు చేసినట్లు అనుమానించినా.. 20 దేశాలకు చెందిన 1,400 మందిని టార్గెట్‌గా చేసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

క్రెడిట్‌ కార్డుల డేటా…హ్యాకర్లు 13 లక్షల మంది భారతీయుల క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వివరాలను డార్క్‌నెట్‌లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో కార్డు వివరాలను రూ. 7100కు విక్రయిస్తున్నారు. వాటి ఆధారంగా కార్డులను క్లోనింగ్‌ చేస్తే.. కొన్ని వేల కోట్లను కొల్లగొట్టే ప్రమాదముంది. సింగపూర్‌కు చెందిన ఐబీ అనే సైబర్‌సెక్యూరిటీ పరిశోధన సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. పీవోఎ్‌సలు, ఏటీఎం కేంద్రాల్లో సైబర్‌ నేరగాళ్లు అమర్చే స్కిమ్మర్‌ యంత్రాలతోనే కార్డుల వివరాలను క్లొలగొట్డడం సాధ్యమవుతుందని ఆ సంస్థ పేర్కొంది. కాగా.. కార్డుల డేటా తస్కరణ ఉదంతంపై ఆర్‌బీఐ సీరియస్‌ అయ్యింది. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించింది.

Courtesy Andhrajyothi..

 

RELATED ARTICLES

Latest Updates