కులదురహంకర హత్యల పరాకాష్టకి ప్రతీక ప్రణయ్, అమృతల కులాంతర ప్రేమగాథపై వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
(  రచన: జోన్న స్లటర్, వాషింగ్టన్ పోస్ట్)
భారత సమాజం చాలా మారుతోంది. అయితే ఈ మార్పు ఉండవలసినంత గాలేదు. ముఖ్యంగా అమృత ,ప్రణయ్ వంటి కులాంతర జంటలకు. ఇదొక తెలంగాణలో జరిగిన కుల దురహంకార హత్య క్రూర గాధ.
భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లోని మిర్యాలగూడ. వాళ్ళిద్దరూ యువతీ యువకులు, అందంగా ఉంటారు, ప్రేమలో పడ్డారు. ప్రణయ్ పెరుమాళ్ళ వివాహ వేదిక వద్దకు నీలిరంగు సూటు వేసుకొని మొఖం కలకలలాడుతూ ఉండగా వేంచేశాడు. వధువు అమృతవర్షిని చేయి పట్టుకున్నాడు. దంపతులు ఒకరి మెడలో మరొకరు భారీ పూలమాలలు వేసుకున్నారు. హాజరైన బంధుమిత్రులు సంప్రదాయబద్దంగా నవదంపతుల తలపై అక్షింతలు చల్లారు.
ఒకపక్క పెళ్లి సంబరం. మరోవైపు వారు అప్పటికే ప్రమాదపు పరిస్థితులకు నెట్టి వేయబడిన స్థితి.
కొన్నాళ్ల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఈ దంపతులు వైద్య పరీక్షకు వచ్చి తిరిగి వెళ్తుండగా హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి ప్రణయ్ ను కసాయి కత్తితో నరికాడు. తల మెడ పై తీవ్ర గాయాలు కాగా ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు.
ప్రణయ్ (23) దళిత యువకుడు. అమృత (21) అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి. సంపన్నులు, బలవంతులు అయిన అమృత కుటుంబానికి తమ ఇంటి అమ్మాయి ఒక అంటరాని వారిని చేసుకోవడం ఇష్టం లేదు. ఈ చర్య తమకు అవమానకరమైనదిగా వారు భావించారు. “ద్వేషాన్ని పెంచుకున్న అమృత తండ్రి మారుతీ రావు అల్లుని చంపించేందుకు హంతకుల్ని నియమించాడు ”, అని కోర్టులో నమోదైన పత్రాలు చెప్తున్నాయి.
భారత సమాజం మార్పు వస్తున్నది. లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అక్షరాస్యత బాగా పెరిగింది. ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా వెలుగు తున్నది. అయినప్పటికీ అమృత, ప్రణయ్  వంటి కులాంతర వివాహాల్ని ఆమోదించే స్థితికి ఇంకా చేరుకోలేదు. పుట్టుక ఆధారంగా నిర్ణయం అయ్యే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నేటికీ బలంగా వేళ్ళూనుకుని ఉన్నది.
పెళ్లిలో నిర్ణయంలో ఈ కులం ప్రభావం అత్యంత అధికంగా దర్శనమిస్తున్నది. 2017 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో జరిగే వివాహాల్లో కేవలం 5.8 శాతం మాత్రమే కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తేలింది. నాలుగు దశాబ్దాల కాలంలో ఈ నిష్పత్తి స్వల్పంగా మాత్రమే పెరిగింది. ఆధునికతతో కులాంతర వివాహాలు బాగా పెరుగుతాయని ఆశించాం అని కానీ అలా జరగక పోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని రచయిత, గణాంక నిపుణుడు త్రీడీప్  పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకరం అన్నారాయన.
భారతదేశంలో ఇలా కులాంతర వివాహాలు జరిగినప్పుడు అనేకసార్లు కులదురహంకార హత్యలు చోటుచేసుకున్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు తమ కులానికి వెలుపల పెళ్లి చేసుకున్న యువతి లేదా యువకుల హత్యలు గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీకి చెందిన రాజకీయ నాయకుడి కుమార్తె ఈ మధ్య ఒక దళిత యువకుణ్ని పెళ్లాడింది. ఈ సంఘటన అమ్మాయి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. తండ్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టింది.
అమృత చెప్పేదేమిటంటే ఆర్థికంగా పైకి ఎదిగిన కూడా కుల పట్టు వ దలటం లేదని. యువతీ యువకులు తమకు నచ్చిన వారిని కులాలకు అతీతంగా వివాహం చేసుకునేందుకు వీలు పడటం లేదన్నమాట.
సంప్రదాయం, కుటుంబ గౌరవాన్ని కాపాడటం పేరిట ఇలాంటి కులదురహంకార హత్యలు జరుగుతున్నాయని అంటున్నారు చరిత్రకారిని ఉమా చక్రవర్తి. అయితే అసలు విషయం మరింత లోతు అయినది. ఒక యువతి తనకు నచ్చిన వ్యక్తిని అందున దళిత యువకుణ్ని పెళ్లాడితే అది మొత్తం స్త్రీ పురుష అసమానత వ్యవస్థనే బద్దలు కొడుతుంది. అదన్నమాట అసలు సంగతి.
ఒక రోజు ఉదయం అమృత అత్తగారి ఇంట్లో కూర్చొని ఉన్నది. ఆమె పక్కన ఉన్న స్క్రీన్ మీద ఇంట్లో , చుట్టుపక్కల జరుగుతున్నదేమిటి చిత్రాలు కనిపిస్తుంటాయి. ఆమె భద్రత కోసం చుట్టూ నిఘా కెమెరాలు ఉన్నాయి. 6న్నెలల వయస్సు గల అమృత కుమారుడు తల్లి ఒడిలో కూర్చుని ఉన్నాడు. ఈ ఇల్లు దళితులు నివసించే ప్రాంతంలో ఉన్నది. అంతా దాదాపు మధ్యతరగతి కుటుంబాలు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్ఐసీలో మూడు దశాబ్దాలు పనిచేశారు. ఇక్కడికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకోగల పెద్ద భవంతిలో అమృత పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా గడించాడు.
భారతదేశంలోని జనాభాలో సుమారు 17 శాతం మంది దళితులు ఉన్నారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వీరిది అత్యంత ఆధమస్థానం. దశాబ్దాల అణచివేతల  అనంతరం రిజర్వేషన్ల కారణంగా దళితులు ఉన్నత విద్య, వ్యాపారాలు ,రాజకీయ తదితర రంగాల్లో ఎంతో కొంత పైకి వచ్చారు.
కొద్దో గొప్పో అభివృద్ధిలోకి వచ్చిన  ప్రణయ్, అమృతల కథ చెప్పినట్లు దళితులు తమకు ఇష్టం వచ్చిన వారిని తాము పెళ్లి చేసుకోవడం ఈ సమాజంలో కష్టతరం అన్న మాట. నేటికీ దేశంలో అతి ప్రమాదకర అమానవీయమైన పనుల్ని దళితులు చేయాల్సి వస్తున్నది. ఉద్యోగాల మార్కెట్లో వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది.. భూమి విషయంలో కూడా అంతే. భారత రాజ్యాంగం అందరికీ సమాన ఓటు హక్కును అయితే ఇచ్చింది కానీ ప్రతి మనిషికి సమాన విలువ మాత్రం దక్కలేదు అంటున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ దళిత్ రైట్స్ ప్రధాన కార్యదర్శి పాల్ దివాకర్. అమృత
ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు ఇతర కులాల వారు ముఖ్యంగా దళితుల తోటి స్నేహం చేయవద్దు అని తల్లిదండ్రులు ఆదేశించారు. అమృతది ఆర్యవైశ్య కులం. వీరిని కోమట్లు అంటారు. ఇది వ్యాపారుల కులం. 9వ తరగతిలో ఉన్నప్పుడు కుల పట్టింపులేని అమృత మిత్రులతో కలసి సినిమాకు వెళ్ళింది. అక్కడ తమ తమ పాఠశాలలో ఒక ఏడాది సీనియర్ అయినా ప్రణయ్ నుగుర్తించింది. అప్పటినుంచి ఇరువురి మధ్య ఫోన్ సంభాషణలు సందేశాలు పంపుకోవడం  ప్రారంభమయ్యాయి.
వీరిద్దరి మధ్య స్నేహాన్ని అమృత తండ్రి గమనించాడు. కుమార్తెను అనేకసార్లు కొట్టాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ లాప్టాప్ లాగూకోవటమే కాకుండా అమృతను వేరే స్కూలుకు మార్చాడు. ఆరేళ్లపాటు ఎప్పుడో ఒకసారి తప్ప అమృత ప్రణయ్ తరచూ కలుసుకోవటం సాధ్యపడలేదు. నిన్ను మన కులానికి చెందిన బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ నిమ్న కులానికి చెందిన వారితో వివాహానికి అంగీకరించను అని అమృత తండ్రి అనేవాడు. యువతీ యువకులు ఇద్దరూ కాలేజీలో చేరారు. అమృత ఫ్యాషన్ కోర్సు, ప్రణయ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.  తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని గమనించిన అమృత ప్రణయ్ ను వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నది.
అది 2018 జనవరి 30వ తేదీ. తల్లి మధ్యాహ్నం కునుకు తీస్తున్న వేళ అమృత తన దుస్తులు ,సర్టిఫికెట్లు ,ఐడెంటి కార్డు తీసుకొని ప్రణయ్ తో కలసి పరారైంది. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ స్థిరపడాలని కలగన్నారు. ఆస్ట్రేలియాలో వ్యాపారం చేయాలనేది కోరిక.
Amrutha Pranay Wedding Picturesహైదరాబాదులో కొద్ది మంది మిత్రుల సమక్షంలో ఆర్యసమాజ పద్ధతిలో అమృత, ప్రణయ్ వివాహమాడారు. ఆర్య సమాజ్ కులాంతర వివాహాల్ని ప్రోత్సహించే హిందూ సంస్కరణ వాద సంస్థ. తర్వాత అమృత గర్భవతి అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా యాత్ర విరమించుకొని ఆగస్టు 17న పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. వందలాది మంది ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ అమృత తల్లిదండ్రులు రాలేదు. అప్పటికే ప్రణయ్ ను చంపేందుకు మారుతీరావు పథకం పన్నాడని కోర్టు పత్రాలు తెలియజేస్తున్నాయి. నెలరోజుల క్రితమే ప్రణయ్ హత్యకు ఆయన సుఫారీ ఇచ్చాడు. ఇందుకు ఒక రాజకీయ నాయకుడి సహాయం తీసుకున్నాడు.
సెప్టెంబర్ 14న అమృత ఆసుపత్రిలో వైద్యురాలు వద్ద చూపించుకొని ఉండగా వెనక నుంచి వచ్చిన ఒక ఆగంతకుడు కత్తితో రెండు వేట్లు వేసాడు.. ఆ సమయంలో అమృత. ప్రణయ్ అతని తల్లి ప్రేమలత ఉన్నారు. ఇదంతా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో నమోదయింది. షాక్ కు గురైన అమృత ఆసుపత్రి లోనికి సహాయానికి పరిగెత్తింది. తన తండ్రికి ఫోన్ చేసి ప్రణయ్ పై దాడి జరిగిందని నువ్వే ఇలా చేశావు నాన్న అంటూ వాపోయింది. ఆ తర్వాత మూర్చపోయింది.
ఈ హత్య మిర్యాలగూడను విభజించింది. వందలాదిమంది ముఖ్యంగా దళితులు ప్రణయ్ తండ్రిని కలిసి తమ మద్దతు తెలిపారు. ప్రణయ్ గుర్తుగా విగ్రహాన్ని ఏర్పరచాలని వారంతా భావించారు.
అమృత తండ్రికి మరో వర్గం నుంచి పెద్ద మద్దతు లభించింది. మారుతీరావు అంగీకరించకపోయినా ఆయనను దిక్కరించినందువల్లనే ఈ హత్య చోటుచేసుకుందని జరిగిన ఘోరాన్ని సమర్ధించారు  నల్గొండ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు భూపతిరాజు. తల్లిదండ్రుల పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పరచి ఈయన వందలాది మందితో వెళ్లి రావును కలసి తమ మద్దతు ప్రకటించారు
మిర్యాలగూడకు చెందిన శ్యామ్సుందర్ అనే మరొక న్యాయవాది ఇంకొక సంస్థను ఏర్పాటు చేశారు. దళిత యువకుడు దబాయించి మా వాళ్ల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. సంపన్న కుటుంబాల ఆడపిల్లల్ని ప్రేమ పేరిట ఇలా ట్రాప్ చేసే చిల్లర వెదవలు ఉంటారు అన్నారాయన. తండ్రి మారుతీరావు ఇప్పుడు బెయిలుపై ఉన్నాడు. సెప్టెంబర్ లో కేసు విచారణ జరిగే అవకాశం ఉన్నది.
అమృత తండ్రి ఒక కాఫీ హోటల్లో  ఒక రిపోర్టర్ తో కలిసి కూర్చొని ఉన్నాడు. ఈ ఉదంతం గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించాడు. ఈ మేరకు న్యాయవాదులు తనకు సలహా ఇచ్చారని  వివరణ ఇచ్చుకున్నాడు. ప్రణయ్ హత్యకు మారుతీరావుకు ఉన్న సంబంధంపై పకడ్బంది సాక్ష్యాలు ఉన్నాయని నిందితుడు సైతం తన పాత్రను ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చాడని యాభై ఆరు పేజీల చార్జ్ షీట్ చెపుతున్నది.
మధ్యవర్తిగా ఉన్న రాజకీయవేత్త పొరపాటున తన ఫోను మాటల్ని రికార్డింగ్ చేశాడని ఈ సాక్ష్యం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని నల్గొండ ఎస్పీ చెప్పారు. మారుతీరావుకు కఠిన శిక్ష పడాలని అప్పుడే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చని ప్రణయ్ తండ్రి 53 ఏళ్ల బాలస్వామి అన్నారు. మనుమడు నిహాన్ ను ఎత్తుకొని ఆయన బాలుడు నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు.
వాస్తవానికి అమృత గర్భవతిగా ఉన్నప్పుడు హైదరాబాదులో మతం మార్చాలని, అక్కడ అయితే మంచి వైద్యం లభిస్తుందని కుటుంబ సభ్యులు తలించారు. అయితే హైదరాబాదులో దళితుల అయినా వీరికి ఎవరు అపార్ట్మెంటు అద్దెకి ఇవ్వలేదు. కులవివక్షను తాము నిత్యం ఎదుర్కొంటు ఉన్నామని బాలస్వామి వాపోయారు.
అత్తమామల ఇప్పుడు తనకు తల్లిదండ్రులతో సమానము అంటున్నారు అమృత. నా భర్తను నా తండ్రి చంపించాడు. ప్రణయ్ తల్లిదండ్రులు మాత్రం మేమిద్దరం ఎంతగా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామో  తెలుసుకున్నారు అని అమృత అన్నారు. అమృత ఇప్పుడు మిర్యాలగూడ లోనే అత్తమామల ఇంట్లో నివసిస్తున్నారు
(అనువాదం: బి భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్)

RELATED ARTICLES

Latest Updates