సమాజంలో సగం బీసీకులాలం!… జనాభా లెక్కలోలేం!!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బీసిల పరిస్థితి రాజీయ, సంక్షేమ, అభివృద్ధి కార్యకరమాల్లో ఇంత దీనంగా ఉండడటానికి కారణం పాలకకులాలతోపాటు పత్రికలలోనే ఉద్యమాలు చేసే కొంతమంది బీసి నాయకులు కూడా కారణమే.

     బీసీ ఉద్యమాల మాటేమిటిబీసీలు రాజకీయంగా, సామాజకంగా అభివృద్ధి కాక పోవటానికి కారణం  ప్రభుత్వాల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరి ఒకవైపు ఉంటే, ఉద్యమాల వైఫల్యం కూడ కారణమే. చాలమంది బీసీ నాయకులు అష్టకష్టాలు పడుతున్నవాళ్ళే. చేతికిమూతికి చాలనిజీవితాలు గడుపుతున్నారు. కాని కొంతమంది సామాన్యులుగా నటిస్తూ, కోటీశ్వరులయంయరు. ఓ బీసీ నాయకుడు ఎన్నికల్లో పోటిచేసి 50 కోట్లు అఫడవిట్లో చూపింటంతో ప్రజలు అవాక్కాయ్యారు. ఎంతోమందిని నమ్మించి తన ఉన్నతి ఉపయోగించుకున్నరని పేరుంది. వారు ఉద్యమాలు ప్రజల్లోకన్నా, పత్రికల్లోనే ఎక్కువ చేస్తారు. నిర్మాణం లేకపోయిన మీడియా ముందు మేకపోతు గాంబీర్యం నటిస్తారు. మీడియాలో వచ్చే అంశాలను మార్కెంటింగ్చేసి కోట్లు గడించిన వారు ఉన్నారు. తమ అక్రమ సంపాదనను సమర్ధించుకోవటం కోసం అవాస్తవాలను, వాస్తవాలుగా నమ్మించేందుకు, తమను తాము నిరంతరం ఎష్టాబ్లిష్చేసుకుంటారు. గాలి, నీరు, మీడియానే. మీడియానే నమ్ముకుంటారు. తవాత అమ్ముకుంటారు. బీసీ ఉద్యమ సంఘాలే స్వంత ఇళ్ళు అని శ్రీరంగనీతులు చెప్పి, అవి చెప్పటానికే, ఆచరించటానికి కాదని బీసీనాయకుడు నిరూపించారు.

ఓసారి టీడీపీ బీసీ, మరోసారి కాంగ్రేస్బీసీ, తన యదుగుదలకు అవకాశం యిస్తే, మరో పార్టీకి అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉంటారు. పరిణామక్రమంగా, పార్టీలు తమ అవసరాలకోసం చేసే పథకాలనుకూడ తను సాధించినట్లు తన సాధించిన విజయాల సంచిలో వేసుకుంటాడు. తనే అ విజయాలను సాధించినట్లు సెల్ప్ డబ్బా కొట్టుకుంటాడుఉద్యమ సంత్సరాల  దొంతరను చెప్పుకుంటూ, నిరంతరం పత్రిల్లో వెలిగే, నాయకుడు ప్రజలజీవితంలో మార్పు కన్నా తన జీవితాన్నే మార్చుకున్నాడని బీసీలు భావిస్తున్నారు. పాలకులు బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవటానికి కారణం బీసీలు బలమైన ఉద్యమశక్తిగా మారకపోవమే. సంత్సరాలుగా ఎదిగిన నాయకులే MLA సీట్లకోసం ఎగబడి పార్టీలు మారితే, చిన్నా, చితక బీసీ నాయకులను పాలకులు నమ్మే పరిస్ధితిలేది. వీళ్ళవల్ల బీసీలకు లాభం కంటే నష్టమే ఎక్కవ జరుగుతుంది.

సమాజంలో సగం అవకాశాల్లో అధమంగా ఉన్న బీసీలకు సామాజక న్యాయం దశాబ్ధాలుగా ఎండమావిగానే ఉంది. చట్టసభల్లో సంఖ్యలేదు. సామాజిక భద్రతలేదు. సేవల్లో సగం, సంపదలో సగం … అధికారంలో ఆగమాగం, ప్రభువులు ఎక్కన పల్లకిని, అలపుసొలపు లేకుడా, ఏడు దశాబ్ధాలుగా మోస్తున్నం అయిన మాకు సామజక న్యాయం ఎండమావేనా! ఎండమావి నీళ్ళు చూసి గుండెమంటలర్చుకోవటం ఎన్నాళ్ళు,ఇంకా ఎంతకాలం ఓట్లు వేసే యంత్రాలుగాఉండాలి,బీసీలంటే మీపార్టీలకు సభ్యాత్వాల్లోనే మాలెక్కుంటుదా! మీకు జండాలు కట్టడానికే మేం లక్కలోకి వస్దామా, సంక్షమం అభివృధ్ది పేరుతో పాలకకులాలను గెలిపించే బానిసలుగా మాస్తారా, ఇది మానవత్వమా? చట్టాలతత్వమా? ప్రజాస్వామ్యమా? పాలకులకు పాలితుల మధ్య మాది కాలేకడుపుల ఆత్మఘోష కులం … అందుకే కులం గురించి అడుతున్నం, 55శాతం ఉన్నబీసీలకు ఏడుదశాబ్ధాలుగా  పాలనలో  దామాషాభాగస్వామ్యం దక్కదా, కడుపు మండినోడు కులం గురించి  అడుగుతున్నడు, నిండినోడు ఇంకా కులాలు ఏంది అంటండు. అభివృద్ధి చెందినోళ్లంతా కులం ఎందుకంటే? అభివృద్ధి చెందని బీసీలంతా కులమే అంటున్నరు. లభివృద్ధి చెందినోళ్లకు, చెందనోళ్లకు, పాలకులకు పాలితులకు మధ్య కులమే అడ్డుగీత అదే కులగీత.

పాలకులకు కాంక్ష తీరలేదు, బలహీన వర్గాలకు అకలి తీరలేదు. అందుకే రాజ్యంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరిస్తుంది. పాలన బలహీన వర్గాలమీద స్వారీ చేస్తుంది. సంక్షేమరాజ్యం, శ్రేయో రాజ్యం, సామ్యవాదం లక్ష్యాలు బలహీన వర్గాలమీద బీసీలమీద కక్ష కట్టాయా,  ఈ దేశంలో మేజారిటీ బీసీలంతా పాలితులు, మైనారిటీ పాలక కులాలు పాలకులు, ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ, మెజారిటీని విస్మరించి, పాలన దేశంలో కొన్ని పాలక కులాలకే పరిమితమైతే, ఇది ఏరకమైన ప్రజాస్వామ్యం?

ప్రజాస్వామ్యం ఎవరికొచ్చంది, ఎవరిచేతుల్లో ఉంది. ప్రజలయోక్క .. ప్రజలచేత .. ప్రజలకొరకు అంటే! ఏ ప్రజలయోక్క ఏప్రజలచేత, ఏప్రజలకొరకు అని బలహీన వర్టాలు ప్రశ్నిస్తున్నాయి. మాటల్లో వాటాలు చేతల్లో మోసాలు  ఇంకా ఎంతకాలం? స్వాతంత్రం సిద్ధించి 72 ఏళ్ళు గడుస్తున్నా బీసీ జనాభా లెక్కా పత్రం లేకపోవటం బీసీలను లెక్కలోకి తీసుకోకపోవటం కాదా!  55/- ‘పైగా ఉన్నబీసీలకు పాలనతో పాటు సకలరంగాలలో దామాష దక్కకపోవటం పాలకులు వోబీసీలకు ఏరకమైన సంకేతం ఇవ్వదలుచుకున్నారు. బీసీ వర్గాలలో పరిణాత్మకంగా, గుణాత్మకంగా వస్తున్న మార్పులు కూడ ప్రభుత్వాలు గుర్దించకపోవటం అప్రజాస్వామ్యవిధానం కాదా, డబ్బుచుట్టు అధికారం తిరుగుతుంటే, అధికారం చుట్టూ పాలకకులాలు తిదుగుతున్నాయి. వేళ్లమీద లెక్కపెట్టే  పాలకకులాలే చట్టసభలకు ప్రరిమితమైతే, ప్రజాప్వామ్యం ఏవిధంగా పరిపుష్టం అవుతుంది. ఏసీ బంగ్లానుండి, ఏసీ పార్లమెంట్‌కు వెళ్లే కోటీశ్వరుల సంఖ్య నేరచరితుల సంఖ్యరోజురోజు పెరుగుతున్నట్లు ఘణాంకాలు చెపుతున్నాయి. వడ్లకు, బియ్యానికి తేడా తెలియవనోళ్లు, కులాల గురించి  అవగాహన లేనివాళ్ళు, క్రిమినల్స్‌ మైనారిటీ పాలకకులాలు చట్టసభలు ఇంకా ఎన్నాళ్ళు వేదికగా ఉంటాయని, బీసీలు అసహనంతో ప్రశ్నిస్తున్నారు. కులాలలు గురించి అవగాహనలేని వాళ్లు, వారి కష్టనష్ఠాలు సంస్కృతి తెలియని వాళ్ళు ఈ దేశంలో మెజారిటీ బలహీన వర్గాల అభివృద్ధికి బలమైన చట్టాలు ఎలా తెస్తారు.

రెవెన్యూరికార్టుల ప్రకారం  చెట్లకు, పుట్టలకు, గుట్టలకు లెక్కలున్నాయి. ఎస్సీ. ఎస్సీటీలకు లెక్కలకు మత మైనారిటీలకు లెక్కలు ఉన్నాయి. సమాజంలో సగానికి పైగా ఉన్నబీసీలకు(OBC) లెక్కలు లేకలు లేకపోవటం  పాలకుల లెక్కలేని తనాన్నిఇంకా ఎంతకాలం భరించాలి.  మండల్‌ కమిషన్‌, కాకా కాలేల్కర్‌ కమిషన్‌లు బీసీ కులాలను లెక్కంచాలని సిఫారసు చేశాయి. శాస్తీయ లెక్కల వల్ల మానవ వనరుల అభివృద్ది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సక్రమ అమలుతో పాటు బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు కల్పించ వచ్చని కాకా కలేల్కర్‌, మండల్‌  కమిషన్‌లలో సిఫారసు చేశారు. కాని అవి భుట్టదాకలయ్యాయి.

బీసీల జనగణన ఎప్రిల్‌ 1 నుండి జరగబోతుంది. అందులో ముప్పయి ఒక్కఅంశాలు చేర్చి బీసీల కులాలను ఎందుకు లెక్కించటంలేదని దేవవ్యాప్తంగా వోబీసీలు ప్రశ్నిస్తున్నారు. కులగణను జనాభాలెక్కల్లో చేర్చకపోవటాన్ని బీసీలు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారు. సంఖ్యపరంగా ఎక్కవగా ఉన్నా ఈ దేశంలో లెక్కలేని వాళ్ళమా అనే భావనలో ఉన్నారు. సంపద సృష్టిలో సగం అయినా, మేం ఎంతో మాకంతా వాటాలేదు. కనీసం జనాభాలెక్కలో కూడ మా సంఖ్య తేల్చనప్పుడు మేం లెక్కలేని వాళ్లమా! ఇప్పటికే చట్టసభలలో బీసీలు పరిమిత సంఖ్యలో ఉండి అసంతృప్తితో ఉన్నారు బీసీకులాల లెక్కతేలిస్తే, దోపిడాకి గురైంది బీసీలే అని రుజువైతుందనే భయం పాలకులకు ఉండి వెనకడుగు వూస్తున్నాయి. పాలనతోపాటు సకల రంగాలమీద పాలకకులాల ఆధిపత్యం పోతుందనే భయం కూడ కారణం. బ్రీటీష్ కాలంలో 1871 – 72లో మోదటి సారిగా జనగణన మోదలైంది. 1881 నుండి  1931 వరకు కులాలవారిగా గణన జరిగింది. స్వాతంత్రానంతరం. బీసీకులాలకు లక్కించకుండా కేవలం జనాభానే లెక్కిస్తున్నారు. దీనికి పాలకులు చెప్పే కుంటి సాకులు ఏమిటంటే, కులగణన వల్ల సమాజంలో ఈర్షా ద్వేషాలు పెరుగుతాయని, వాస్తవానికి భారతదేశం బిన్నకులాలు మతాలు నిక్షిప్తమైనదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నదేశం, పాలకకులాల ఆధిపత్యం కోసమే  వివక్షతోనే బీసీలను జనాభా లెక్కలో చేర్చటంలేదు.  దేశవ్యాప్తంగా ఉన్న 130 కోట్లకు పైగా జనాభాను లెక్కించేందుకు, కేంద్రప్రభుత్వం 1100 కోట్లు ఖర్చు చేస్తుంది. దీంతో మెజారిటీ ప్రజలు OBC లతో పాటు, పాలక కులాలను కులాల వారిగా లెక్కించాల్సి అవసరం ఉంది.  జనగణలో కులం చేర్చటం వల్ల అదనంగా ఖర్చు ఏమీ కాదు. 32వ కాలంగా కులం చేర్చితే, దేశం మోత్తంలో కులాల సంఖ్య, కులజనాభా సంఖ్య తేల్చవచ్చు.  పాలకులకు  కులఘణన చేసే ఉద్దేశం కనబటలేదు. ఎందుకంటే, మేజారిటీ వోబీసీ కులాలను, మైనారిటీ పాలక కులాలు  పాలిస్తున్నయనే బండారం ఎక్కడ బయటపడుతందనే భయమా? పాలకకులాల గుప్పెటనుంచి  పాలన చేజారిపోతందనే స్వార్ధమా? మేజారిటీ OBCలకు అంత స్వార్ధం ఉంటే  పాలకులు ఇంతకాలం పాలించగలిగేవారా..

భారత దేశం కులాల సమూహం  బీసీ కులాలతో పాటు పాలకకులాలను (OC)లను లెక్కిస్తే తప్పేంటీ, భారతదేశంలో మూడువేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కూడ చట్టసభాలలో ప్రాతినిద్యం లేదు. పాలకుల దయాదాక్షణం మీద ఆదారపడేటట్లు చేయడం కోసమే బీసీ లను జనాభా లెక్కల్లో చేర్చటంలేదా!  రాజకీయంగా రాణించకుండా పరిమిత సంఖ్యలో ఉంచటమే లక్ష్యంగా బీసీలను  జనాభాలెక్కలో చేర్చటం లేదా, మీ ఉద్యేశం ఏమిటి? ఈ దేశంలో 65 కోట్లబీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ కులఘణను చేయకపోవటానికి కారణాలు కేంద్రప్రభుత్వం చెప్పాల్సిన  భాద్యత ఉంది. సంక్షేమం అభివృద్ధితో సంతృప్తి ఇంకా ఎంతకాలం? బీసీలు తమకు జరుగుతున్నఅన్యాయం కూడ తెలుసుకోలని మూగజీవులు  అయినందు వల్లే పాలకుల ఆటలు సాగుతున్నాయి.బీసీల వద్దడబ్బు లేక పోవటం వల్ల mla, mpలు కాలేక పోతున్నారు దీనికి పరిష్కారం బీసీలకు చట్టసభల్లోరిజర్వేష్లు ఓక్కటే మార్గం పాలకులకు, పాలితులకు మధ్యఅఘాతం పెరిగితే, బౌషత్తు దుష్‌పరిణామాలకు పాలకులే భాద్యులవుతారు. పరిణాత్మకంగా, గుణాత్మకంగా బీసీలు చైతన్యం అవుతున్నరు. పాలకకులాలకు తామే సీట్లు ఇచ్చే రోజుకూడ వస్తుందని బీసీలు నమ్ముతున్నరు. తారు. చరిత్ర పరిణామా క్రమాన్ని ముందుచూపుతో పాలకులు తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది. లేక పోతే చరిత్రహానులుగా మిగులుతారు.

బీసీలు రాజకీయ వివక్ష…  బీసీల జనాభా లెక్కలుతీస్తే ఈర్షా ఆసుయాద్వాషాలు, అలజడి పెరుగుద్ది అని చెప్పే పాలకులు. ఏడుదశాబ్ధాలుగా పాలనలో ఎందుకు భాగస్వామ్యం కల్పించలేదు. రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించటంలోనే వివక్ష పాటిస్తాయి. బీసీలకు జనాభా దామాషా ప్రకారం MP, MLA సీట్లు  కేటాయిస్తే పాలకకులాలు తమ ఉనికి కోల్పోతమనే భయంతో పాటు, బీసీలు ఎన్నికలను ఎదుర్కనే డబ్బు లేకపోవటం కూడ కారణమే,

ఎన్నికల్లో  MP స్ధాయిలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నదాఖలాలు ఉన్నాయి.  MLA 28 లక్షలు MP-70 క్షలు ఖర్చు నిభందన ఉన్నా అది అమలు కావటంలుదు. ఈ విషయం ఎన్నిల కమిషన్‌ ఫెయిల్‌ అయింది. ఇది అమలై ఉంటే గుడ్డిలో మెల్లగా బీసీలు, పేదలు  చట్టసభల్లో సంఖ్య కొంతమెరుగ్గా ఉండేది. రాజకీపార్టీలు సీట్లకేటాయింపు వారి సంఖ్య దామాషాలో ఇవ్వరు. పార్టమెంట్‌లో 272 మంది బీసీ MPలు ఉండాలి. కాని ఒకటి నండి ఐదు ఆరు శాతం ఉన్నవాళ్లే, ఈ స్ధానాలను అక్రమించుకుంటున్నారు. దీనికి కారణం వడ్డించే స్ధనంలో బీసీలు లేకపోవటమే.  .

ఇంకా రాజకీయంగా సీట్లు అడుకునే స్దితిలో ఉండటమేందని, బీసీలు ఆవేదన చందుతున్నారు. ఈ వివక్షలన్నింటికి బీసీ కులఘణతో కొంత పరిష్కారం చూపుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.  యాభై శాతం పైగా   ఉన్నబీసీ కులాలను సేవకులుగా, రాజకీయబానిసలుగా ఇంకా కొనసాగించేందుకే, బీసీ జనగణన చేయటంలేదని ఈ వర్గాలు భావిస్తున్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 14 మంది  Bramins ప్రదానులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 24మంది ముఖ్యమంత్రులగా ప్రమామణ స్వీకారం చేశారు నేడు కేంద్రప్రభుతంలో 12 మంది భ్రమణులు  మంత్రులు ఉన్నారు కేంద్రప్రభుత్వంలో ఉన్నఉద్యోగులలో  7 శాతానికి మించి బీసీలు లేరు. ఈ శాతంలో ఎక్కవమంది క్లరికల్‌ జాబ్‌లకే పరిమితమయ్యారు.  బీసీ ఉద్యోగాలు క్యారీఫర్‌వరడ్‌ చెయ్యటంలేదు. జనరల్‌లో కలపటం వల్ల బీసీలు నష్టపోతున్నారు. బీసీలకు విద్యా ఉద్యోగాలలో  బీపీ మండల్‌ చేసిన 27 శాతం రిజర్వేషన్లు కూడ అమలు కావడంలేదు సకల రంగాలలో వివక్ష చిన్నచూపు చూస్తున్నప్రభుత్వాల పట్ల బీసీలు అసహనంతో ఉన్నారు 1-2 శాతం ఉన్నకులాలు 55శాతం ఉన్నబీసీ కులాలను పాలించటమేంటని? బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఎవరిదామాషా వారికి దక్కితే ఎవరికి అభ్యంతరం లేదంటున్నరు.

— సాధం వెంకట్‌ MA, BCJ, MCJ. సీనియర్‌ జర్నలిస్టు     రాంనగర్‌, హైదారాబాద్‌. 9395315326.   

                    

RELATED ARTICLES

Latest Updates