‘సీరం’తో రూ.1,100 కోట్ల ఒప్పందం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • భారత్‌ సహా 92 దేశాల కోసం 10 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు
  • రిజర్వ్‌ చేసిన గేట్స్‌ ఫౌండేషన్‌

న్యూఢిల్లీ/బెంగళూరు/జెనీవా : పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)తో గేట్స్‌ ఫౌండేషన్‌ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,100 కోట్లు (150 మిలియన్‌ డాలర్లు) . ఈ నిధులతో భారత్‌ సహా పలు అభివృద్ధి చెందుతు న్న దేశాల కోసం ప్రత్యేకంగా 10 కోట్ల వ్యాక్సిన్‌(ఆక్స్‌ఫర్డ్‌, నోవావ్యాక్స్‌)డోసులను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేయనుం ది. వీటిని 2021 జూన్‌లోగా ఆయా దేశాల ప్రజలకు అందించే ఏర్పాట్లను  గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన గ్లోబ ల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్స్‌ (జీ ఏవీఐ) చేపట్టనుంది. తద్వారా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో పేద దేశాలకు అండగా నిలువనుంది. ఇందుకోసం ఎస్‌ఐఐ సరఫరా చేయనున్న ఒక్కో వ్యాక్సిన్‌ డోసు ధరను దాదాపు రూ.225గా నిర్ణయించారు. ఈమేరకు ఎస్‌ఐఐ సీఈవో అదర్‌ పూనావాలా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్‌ విజయవంతమవుతుందో.. కాదో.. తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తికి సిద్ధమవుతున్న తమకు ఈ నిధులు దన్నుగా ని లుస్తాయని ఆయన తెలిపారు. వ్యాక్సిన్లు విజయవంతమై.. లైసెన్సింగ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ల భించగానే ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్లను సమకూర్చుతామని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా, నో వావ్యాక్స్‌ కంపెనీలు అభివృద్ధిచేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన ్లను ఉత్పత్తి చేసి భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయించుకునేందుకు సంబంధించిన లైసెన్సింగ్‌ను ఎస్‌ఐఐఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా,కరోనా వ్యాక్సిన్లను సమకూర్చేందుకు భారత్‌ సహా మొత్తం 92 అభివృద్ధి చెందుతున్న దేశాలను జీఏవీఐ రెండు నెలల క్రితమే ఎంపిక చేసింది. జీఏవీ ఐ ఆధ్వర్యంలో నడిచే ‘కోవ్యాక్స్‌ అడ్వాన్స్‌ మార్కెట్‌ కమిట్‌మెంట్‌’ (ఏఎంసీ) కార్యక్రమం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను 57 పేద దేశాలకు, నోవావ్యాక్స్‌ వ్యాక్సిన్‌ను 92 వెనుకబడిన దేశాలన్నింటికి పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021 చివరికల్లా 100 కోట్ల డో సులను పేద దేశాల్లో పంపిణీ చేసేందుకు రూ.25 వే ల కోట్లు అవసరమవుతాయని జీఏవీఐ అంచనా వే స్తోంది. పేదలకు దీని కోసం రూ.15వేల కోట్ల సీడ్‌ ఫండ్‌ను నెలకొల్పే ప్రయత్నాలను ప్రారంభించి.. ఇప్పటివరకు రూ.4వేల కోట్లను సమీకరించింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates