ప్రస్తుత పరిస్థితులపై ఒక రిటైర్డ్ ఎస్ఆర్ అధికారి మనోభావాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బ్రిటీష్ వారి కాలం నుంచే అస్సాంలో ఉండే గిరిజనులకి తమ ప్రాంతాల్లోకి బెంగాలీలు వలసలు వస్తున్నారనే దిగులు పట్టుకుంది. అప్పుడు వీరు ఇంగ్లీష్ విద్యని అభ్యసించే ప్రాంతాలైన కోల్ కతా,ఢాకా బెంగాలీ నుంచే పరిపాలించబడేవారు. ఇది వారిని భాషాపరంగా,జాతి పరంగా కూడా తమ స్వంత ప్రాంతంలోనే తమల్ని మైనారిటీలుగా మార్చేస్తోందని వారు భావించారు.

బ్రిటీష్ వారు మొదట ఇండియాలో అడుగుపెట్టింది కోల్ కతా లో కావడం,1857 లో రాజధానిని ఢిల్లీకి మార్చే ముందు ఓ వందేళ్ల పాటు కోల్ కతానే రాజధానిగా ఉండడం మూలాన బెంగాలీలు దాదాపు బ్రిటీష్ వారి జీవన విధానాలనే అనుకరించేవారు. ఆంగ్ల విద్య ప్రాబల్యం కలకత్తాలో పెరగడం వల్ల బ్రిటీష్ వారి పరిపాలనా విభాగాల్లో ఈ మెకాలే పుత్రుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఈశాన్య రాష్ట్రాలతో పాటూ బీహార్,ఒరిస్సా,పంజాబ్, ఉత్తరప్రదేశ్,హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి సురేంద్రనాథ్ బెనర్జీతో సహా చాలామంది ఐసీఎస్ అధికారులూ,బ్రిటీష్ వారి నైట్ హుడ్ బిరుదుతో సత్కరించబడిన వారంతా కూడా బెంగాలీలే అన్న విషయం మర్చిపోకూడదు (ఠాగూర్ తన నైట్ హుడ్ బిరుదునీ,సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ ఉద్యోగాన్నీ ఆ తర్వాత వదులుకున్నారు). ఇక సామాన్యులతో కార్యకలాపాలు సాగించే రెండో స్థాయి పరిపాలనా విభాగాల్లో కూడా అంతో,ఇంతో ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న బెంగాలీల ఆధిపత్యమే ఉండేది,వీటిలో చాలాచోట్ల విచ్చలవిడిగా అవినీతి జరిగేది. బ్రిటీష్ వారికీ,స్థానిక ప్రజలకీ మధ్య దళారీలుగా కూడా పనిచేసేవారు. అందువల్ల ఆత్మగౌరవం ఉన్న ప్రతీ అస్సామీలూ,మణిపురీలూ,గిరిజనులు వారిపట్ల ద్వేషభావంతో ఉండేవారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల మూలంగా ఈ విషయాలు మరుగున పడ్డా మన బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో అంతర్లీనంగా వీటి ప్రభావం వ్యాపించసాగింది.

తర్వాత 1971 లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడగొట్టే క్రమంలో జరిగిన యుద్ధసమయంలో చాలామంది బెంగాలీలూ,అహోమియాలు కానివారూ,గిరిజనేతరులూ బంగ్లాదేశ్ నుంచి బెంగాల్,ఈశాన్య రాష్ట్రాలలోకి ప్రవేశించారు. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించినప్పటికీ బెంగాల్,అస్సాం,ఈశాన్య భారతం మాత్రమే శరణార్థుల భారాన్ని మోయాల్సి వచ్చింది. ఈ శరణార్థులు తిరిగి వెళ్లడం సంగతి అటుంచి బంగ్లాదేశ్ లోని తమ బంధువులని కూడా రప్పించుకున్నారు‌. ఐతే ఈ పేద బెంగాలీలకి వ్యతిరేకంగా పోరాడడం ఇప్పుడు స్వాతంత్ర్య భారతదేశ రాజ్యాంగంలోని 5,6 వ షెడ్యూల్ ల కింద రక్షణ పొందగలిగే అహోమియాలకీ,ఇతర గిరిజన తెగలకీ సులభతరం అవుతుంది.

మొత్తం ఈశాన్య భారతం నిరసనలు చేపట్టింది. AJSU,AGP వీటిని ముందుండి నడిపించాయి. ఎట్టకేలకు రాజీవ్ గాంధీ 1986 తర్వాత ప్రవేశించే ఏ బంగ్లాదేశీలకి కూడా పౌరసత్వం ఇచ్చేది లేదనే నిబంధనతో Assam accord ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులని ఓటర్ల లిస్టులోంచి తొలగిస్తామని ప్రకటించినా శరణార్థులు,అక్రమ వలసదారుల ఓట్లని దండుకోవడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి పనికొస్తుందనే ఉద్దేశ్యంతో ఆ ప్రక్రియ చేపట్టనేలేదు.

బిజెపి ఎన్నార్సీని అమలు చేస్తామని వాగ్ధానం చేయడంతో స్థానిక అహోమియాలు వారికే ఓటేసారు. చెప్పిన విధంగానే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అస్సాంలో NRC ని అమలు పరిచింది.

ఐతే తదనంతర పరిణామాలని బిజెపి పసిగట్టలేకపోయింది. NRC ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్లు చూపలేని అక్రమ వలసదారుల్లో 50% కంటే ఎక్కువగా బెంగాలీ మాట్లాడే హిందువులే ఉన్నట్టు తేలింది. ఐతే వీరందరినీ దేశం నుంచి వెళ్లగొడితే తమ హిందూ ఓటు బ్యాంకు రాజకీయాలకి ముప్పేనని బిజెపికి అర్థమైంది.
అస్సామీల డిమాండ్ ఏమో మతంతో సంబంధం లేకుండా బెంగాలీలు అందర్నీ తమ రాష్ట్రం నుంచి పంపించేయాలనైతే ,బిజెపికేమో కేవలం ముస్లింలనే పంపించేయాలని ఉంది.

కాబట్టి బిజెపి పౌరసత్వ సవరణ చట్టం 2019ని తీసుకొచ్చి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ హిందూ వలసదారులకి పౌరసత్వం ఇవ్వాలని ప్రయత్నించింది. పాకిస్తాన్,అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చిన వలసదారుల సంఖ్య 400,8000 గా మాత్రమే ఉంది,ఇకపోతే క్రిస్టియన్లు,సిక్కులు,బౌద్ధులు,పార్సీల సంఖ్యపై ఎలాంటి గ్రౌండ్ రిపోర్టూ లేదు. జిజెపికి బెంగాలీ ముస్లిం వలసదారులకి పౌరసత్వం ఇవ్వడం ఇష్టం లేదు అందుకనే రాజ్యాంగ విరుద్ధమైన ఈ క్యాబ్ బిల్లుని తీసుకొచ్చింది.

పౌరసత్వ సవరణ చట్టం 2019 యొక్క ముఖ్య ఉద్దేశ్యం సుమారు 12 నుంచి 13 లక్షల వరకూ ఉన్న బెంగాలీ హిందూ శరణార్థులని అస్సాంలోనే ఉంచి,మరింత మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ వలసదారులని ప్రోత్సహించేలా వారికి పౌరసత్వం,ఓటు హక్కు ఇవ్వడం,అదే సమయంలో ముస్లిం శరణార్థుల ఓటు హక్కుని లాక్కొని వారికి పౌరసత్వం నిరాకరించడం. ఈ విధంగా హిందూ శరణార్థులకి చట్టబద్ధత కల్పించి ముస్లిం శరణార్థులని తరిమేయడం ద్వారా రాబోయే బెంగాల్ ఎన్నికల్లో లాభపడొచ్చనే ఆలోచన బిజెపి చేసింది.

కానీ బిజెపికి తమకి ఎలాగూ ఎప్పుడూ ఓటేయని ముస్లింలని ఓటర్ల లిస్టులోంచి తొలగించడానికి CAA సరిపోదు కాబట్టి తమ NRC వెర్షన్ ని తెరపైకి తెచ్చింది. డీమానిటైజేషన్ సమయంలో ఎలాగైతే “వారి జనాల” దగ్గర డబ్బులకి కొదవ లేకుండా పోయిందో,అదే “జనాలకి” ఎన్నార్సీలో అవసరమైన డాక్యుమెంట్ల కొరత కూడా ఉండకపోవచ్చు.

ఆరెస్సెస్ కూడా చాలా కాలంగా హిందూయేతరుల జనాభా వృద్ధిరేటు గురించీ,అక్రమ వలసదారుల సంఖ్యకి సంబంధించీ తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తూనే ఉంది. కాషాయ మూకల లెక్కల ప్రకారం వారి సంఖ్య 10 కోట్ల పైనే ఉండొచ్చని. ఇంకొందరేమో 5 కోట్లనీ,మరికొందరు 4 కోట్లనీ అంటుంటారు.

అస్సాంలో చేపట్టిన ఎన్నార్సీ ప్రక్రియ కేవలం 19 లక్షల అక్రమ వలసదారులు మాత్రమే ఉన్నట్టుగా తేల్చింది,ఇందులో 13 లక్షల వరకూ హిందువులే ఉండడం బిజెపికి రుచించలేదు. దేశంలో ఉన్న మొత్తం 90 కోట్ల ఓటర్లలో 54 శాతం వరకూ బిజెపికి ఓటేయలేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 45 కోట్లమంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు కానీ బిజెపికి ఓటేయలేదు. అంటే 66 శాతం మంది బిజెపికి ఓటేయనివారైతే 22.5 శాతం వేసారన్నమాట. కోర్ హిందూత్వ ఓటు ఏం సమయంలోనైనా 17-18 కోట్లకి మించదనే విషయం గమనించాలి. ఇక 2019 లో మన దేశ మొత్తం జనాభా 136 కోట్లలో 35-36 కోట్లుగా ఉంది కాబట్టి ఇందులో కనీసం పది కోట్ల మందినైనా ఓటర్ల లిస్టులోంచి తొలగిస్తే బిజెపి 2024 ఎన్నికల్లో చాలా లాభపడుతుంది.

ఇప్పుడు బిజెపికి వారి తప్పుడు సమాచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి అస్సాంలో అక్రమంగా ఉంటోన్న ముస్లింల సంఖ్య పది లక్షల కంటే ఎక్కువే ఉందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకుగానూ అస్సాంలో చేపట్టిన ప్రక్రియ దేశమంతటా చేపట్టాలని బిజెపి వ్యూహం. ఐతే ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో బెంగాల్,బీహార్,జార్ఖండ్ లాంటి సరిహద్దు రాష్ట్రాల పరిస్థితి లేదు,అక్కడ అక్రమ వలసదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బిజెపి ఎంత ప్రయత్నించినా మహా ఐతే ఒక కోటి మందిని ఓటర్ల లిస్టులోంచి తొలగించగలదేమో ఇప్పుడున్న చట్టాల ఆధారంగా పనిచేస్తే. కాబట్టి వారికిప్పుడు అవినీతిలో కూరుకుపోయిన పాలనా యంత్రాంగం సహాయంతో తప్పుడు పద్ధతులు అవలింబించాల్సిన అవసరం అవగతమైంది.
ఈ గేమ్ ప్లాన్ లో మూడు ప్రధాన ఉద్దేశ్యాలున్నాయి.
1) బిజెపికి ఓటేయని వారందరి ఓటు హక్కునీ తొలగించడం.
2) హిందూ ఓటు బ్యాంకుని పటిష్టం చేసేందుకు ఓటర్ల మధ్య విభజనని సృష్టించడం.
3) అల్లకల్లోలంగా పరిస్థితులని మార్చివేసి సామాన్య ఓటర్లని అయోమయంలోకి నెట్టేసి ఇండియాని హిందూ రాజ్యంగా ప్రకటించి,తర్వాత కార్పోరేట్ దోపిడీకి పాల్పడడం.

ఇది వారి పార్టీ వర్కర్లకీ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే
1. ఇప్పటికే బిజెపి ఐటి సెల్ కంప్యూటర్లలో బూత్ ల వారీగా ఎవరు బిజెపి ఓటర్లో,ఎవరు కాదో అనే సమాచారం నిక్షిప్తమై ఉంది.
2. ఎవరు వారికి ఓటేయాలనుకుంటారో,ఎవరు వేయరో అనే అవగాహనా ఉంది.

కాబట్టి కేంద్ర ప్రభుత్వాధీనంలో ఉండే ECI,CCI సహాయంతో ఈ ఎన్నార్సీని ఉపయోగించి మైనారిటీలతో పాటుగా తమ ఆశయాలకి వ్యతిరేకంగా ఆలోచించే,ఓటేసే అందరినీ క్రమక్రమంగా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించొచ్చునని బిజెపి ఆలోచన చేసింది.

బిజెపి చేయాల్సిందల్లా వీరిలో అనుమానాలు రేకెత్తించి ఓటు హక్కుని నిరాకరించడం ద్వారా వారిని కూడా బిజెపికి ఓటేసేలా మార్చడమే. ఇది బిజెపి మిత్రపక్షాలైన జేడీయూ,శివ సేన,జిజెడిలకీ అర్థమవ్వడంతో వారూ ఎన్నార్సీ ని వ్యతిరేకించారు. ఈ మిత్రపక్షాలన్నీ కూడా మెజారిటీ వర్గాన్ని తృప్తి పరచడానికి CAA కి మద్దతు తెలిపాయి. ఐతే తమ ఓటు బ్యాంకుకే గండి కొట్టేలా NRC ఉందని గ్రహించడంతో వ్యతిరేకించడం మొదలుపెట్టాయి.

ఎన్నార్సీ ప్రక్రియ మొదలెట్టడం ద్వారా బిజెపి,ఆరెస్సెస్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వారి బలగాలతో,వాట్సప్ యూనివర్సిటీల సమాచారంతో మైనారిటీలూ,దళితులూ,ఆదివాసీలూ,సోషలిస్టులని భయకంపితులని చేయొచ్చు(CAA,NRC కాంబినేషన్ ఇండియా నుంచి అత్యధిక సంఖ్యలో పౌరులని తరిమేసేందుకే కాకుండా వారందరినీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితికి తీసుకొస్తుంది,కాబట్టి ఇది కేవలం ముస్లింలకే ప్రమాదం అనే ఆలోచన సరికాదు) . మిగతా వారంతా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అష్టకష్టాలలూ పడుతుంటే ఈ హిందూత్వ శక్తులు మాత్రం పైనుంచి గమనిస్తూ నవ్వుకుంటాయి తమ మైనారిటీ వ్యతిరేక వ్యూహాలు ఫలిస్తున్నందుకు గానూ.

ఏవైనా నిరసనలు వెల్లువెత్తితే ఆ నిరసనల మధ్యలోకి తమ హింసాత్మక హిందుత్వ కేడర్ ని చొప్పించి పోలీసు జులుం ద్వారా ఆ నిరసనకారులనే నేరస్తులుగా చిత్రించి వేడుక చూస్తుంటాయి. ఇవన్నీ కూడా మళ్లీ బిజెపికే లాభం చేకూరుస్తాయి ఎందుకంటే నిరుద్యోగం,ఎకానమీ లాంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి కార్పోరేట్ దోపిడీని ఆహ్వానించొచ్చు కాబట్టి. ఇండియాని బనానా రిపబ్లిక్ గా మార్చి,గందరగోళం సృష్టించి ఆధిపత్యం చెలాయించాలనుకునే అంతర్జాతీయ సంస్థల ప్రమాదకరమైన అజెండాలో ఇదొక భాగమని చెప్పొచ్చు. బిజెపి లక్ష్యం మాత్రం 2024 ఎన్నికల్లో గెలుపుతో పాటూ ప్రతీ రాష్ట్ర ఎన్నికల్లోనూ విజయంతో తమ హిందూ రాజ్యం ఆశయాల్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమే అని స్పష్టమౌతోంది.

తప్పించుకునే దారేది?.
ముందుగా భారత ప్రజలు ఏవిధంగా తప్పుడు సమాచారంతో మానిప్యులేట్ చేయబడుతున్నారో తెలియజేయాలి. ఆయా వ్యక్తులూ,సంస్థల ఉద్దేశ్యాలని బహిరంగపరచాలి. తిరిగి ఇండియాని దోపిడీదారుల నుంచి అసలైన ప్రజాస్వామ్యంగా మార్చాలి. ఇది సాధ్యం కావాలంటే మిత్రపక్షాలు బిజెపికి మద్దతు ఉపసంహరించాలి,వారి చట్టసభ సభ్యులు రాజీనామాలు చేయాలి.
తర్వాత
1. 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ కీ తావులేని ప్రగతిశీల శరణార్థుల చట్టాన్ని తీసుకురావాలి.
2. సరిహద్దుల రక్షణని పటిష్టం చేసి,చుట్టుపక్కల దేశాలతో అన్ని విధాలా సత్సంబంధాల దిశగా కృషి చేయాలి.
3. దేశంలో ఉన్న శరణార్థులూ,వారి సంతానం అంతా కూడా ఈ దేశం పౌరులే అని ప్రకటించి వారి హక్కులు కాపాడేలా ఓ కొత్త శరణార్థుల చట్టాన్ని తీసుకురావాలి.
4. ఇండియాలో చదువుకోవాలని,పని చేసుకుని బతకాలనుకునే పక్క దేశాల వారికి వీసాలూ,వర్క్ పర్మిట్లు ఇవ్వడం సులభతరం చేయాలి.
5. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు,వారి కుటుంబాలని గుజరాత్, మధ్యప్రదేశ్,ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో సెటిల్ చేయడం ద్వారా బెంగాల్,అస్సాం,ఇతర ఈశాన్య రాష్ట్రాలపై భారాన్ని తగ్గించాలి.
6. పౌరుల దగ్గర నుంచి ఇంకేదైనా సమాచారం కావలిస్తే ఎన్నార్సీ ద్వారా కాకుండా సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేస్తున్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పరిధిలోకి తేవాలి.

ఈ మొత్తం వ్యవహారంలో ఆశలు రేకెత్తించే అంశం ఏంటంటే CAA 2019 ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతని ఎదుర్కోవడమే. అక్కడి ప్రజలు మతం ఆధారంగా కాకుండా,స్థానిక,స్థానికేతర అంశాల ఆధారంగా విడిపోయారు. పక్క దేశాల నుంచి వచ్చిన ముస్లింలని కాకుండా ఇతర శరణార్థులని చట్టబద్ధం చేయాలనే బిజెపి వ్యూహాన్ని వారు నిరసిస్తున్నారు. వారి డెమోగ్రఫీలో మార్పులు చేపట్టి మరింత మంది బెంగాలీ హిందువులని వారిపై రుద్దాలని చూస్తున్న బిజెపికి ఆ ప్రజలంతా ఎదురుతిరిగారు.

ఇప్పటికి ఇంకా ఓటు హక్కుని పొందని వారు,ఓటు హక్కు ఉండీ ఓటేయని వారినీ కలుపుకుంటే బిజెపి వ్యతిరేక ఓటర్ల సంఖ్య అత్యధిక సంఖ్యలో ఉండొచ్చనే చెప్పొచ్చు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ప్రజాస్వామ్యంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా తమ హక్కుల సాధనకై ప్రజలంతా ఏకమై పోరాడడానికి ఏమాత్రం వెనుకాడరనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

బిజెపి/ఆరెస్సెస్ ఈ నిరసనల ద్వారా తమకి కలుగుతున్న హానిని గుర్తించి వాటిని అణచివేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

భారతప్రజల సంకల్పం ముందు ఎన్నికలు,మెజారిటీ ఓట్లు తెల్లమొహం వేసే పరిస్థితి వచ్చింది. బిజెపి కూడా ఎన్నికల్లో గెలవడం, న్యాయబద్ధంగా పరిపాలించడం రెండూ ఒకటి కాదని అర్థం చేసుకుంది. తమ హిందూ రాజ్యం ఆశయాల్ని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ దేశం ఎప్పటికీ అంగీకరించబోదనీ గ్రహించింది.

ఇందిర ఇండియా కాదు ఎలాగైతే కాదో మోదీ కూడా కాదు. వేల మీటర్ల విగ్రహాలు ఎన్ని కట్టించినా ఎప్పటికీ అవ్వలేడు. ఈ నిరసనల నుంచి దృష్టి మరల్చకుండా మనమంతా మరింత ఐకమత్యంతో ముందుకు కదలాలి.

RELATED ARTICLES

Latest Updates