చీకటి కొట్లలో మానవ మృగాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for చీకటి కొట్లలో మానవ మృగాలు"చర్లపల్లి జైల్లోని సింగిల్‌ సెల్స్‌లో హత్యాచార నిందితులు.. కానరాని పశ్చాత్తాపం.. రాత్రంతా మెలకువగానే!
తోటి ఖైదీల ఆగ్రహం.. కట్టుదిట్టమైన భద్రత
ఆ నలుగురిపై 24 గంటలూ నిఘా
హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్: ఒక నిండుప్రాణాన్ని నిలువునా తీశామన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేదు.. ఎలా దొరికిపోయామన్న షాక్‌ తప్ప!! వెటర్నరీ డాక్టర్‌ హత్యాచార నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులు మనస్థితి ఇది! 14 రోజుల రిమాండ్‌పై చర్లపల్లి జైల్లో ఉన్న వీరిని అక్కడ వేర్వేరు చీకటి కొట్లలో (సింగిల్‌ సెల్స్‌)ల్లో బందీలుగా ఉంచారు. వీరిని జైలుకు తీసుకువచ్చినప్పుడు ఇతర ఖైదీలు వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ తిట్ల దండకం మొదలు పెట్టడంతో వార్డర్లు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర ఖైదీల నుంచి వారికి హాని కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ తోటి ఖైదీలతో కలవనివ్వకూడదని నిర్ణయించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు కావడంతో.. వారికి జైలులోని కర్మాగారాల్లో ఎలాంటి విధులు అప్పగించబోమని.. దానివల్ల వారు తోటి ఖైదీలను కలిసే అవకాశాలే ఉండవని వివరించారు. ఒక్కో నిందితుడినీ కనిపెట్టుకుని ఉండడానికి ఇద్దరేసి వార్డర్లను నియమించామని.. రోజుకు మూడు షిఫ్టుల్లో ఒక్కో నిందితుడిపై నిఘాకు ఆరుగురు చొప్పున మొత్తం 24మంది వార్డర్లు పనిచేస్తున్నారని చెప్పారు. శనివారం రాత్రి భోజనం అనంతరం వారిని సింగిల్‌ సెల్‌లోకి మార్చగా.. రాత్రంతా నలుగురూ నిద్ర పోకుండా గడిపారని సమాచారం. ఆదివారం ఉదయం వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రెండుసార్లు టీ ఇచ్చారు. ఆ మానవ మృగాల్లో తాము చేసిన నేరం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం, ఆందోళన కూడా వారిలో కనబడలేదని సిబ్బంది వెల్లడించారు. వారిలో ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం (సూసైడల్‌ ఇంటెన్షన్‌) ఉందేమో గుర్తించేందుకు సోమ, మంగళవారాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.
ఏమిటీ సింగిల్‌ సెల్స్‌?
ప్రమాదకరంగా ఉండే రిమాండ్‌ ఖైదీలతో పాటు జైలు సిబ్బందితో గొడవపడే ఖైదీలను సింగిల్‌ సెల్స్‌కు మార్చడం చర్లపల్లి జైలులో తరచూ జరిగే పరిణామమే. తోటి ఖైదీల నుంచి హాని ఉన్న ఖైదీలను కూడా ఈ సింగిల్‌ సెల్స్‌కు మారుస్తుంటారు. పశువైద్యాధికారిపై పైశాచికత్వం ప్రదర్శించిన నలుగురు నిందితులను ఈ కారణంతోనే సింగిల్‌సెల్‌కు మార్చారు. చర్లపల్లి జైల్లో ఖైదీలను ఉంచేందుకు మూడు అంతస్తుల్లో మూడు బ్యారక్‌లు ఉంటాయి. ఒక్కో బ్యారక్‌లో నాలుగు నుంచి ఎనిమిది హాళ్లుంటాయి. ఒక్కో హాల్‌లో 16 నుంచి 30 మంది దాకా ఖైదీలుంటారు. జైలు వేళల్లో వారికి కేటాయించిన పనులు చేసుకొని వచ్చే ఖైదీలు ఈ హాళ్లల్లోనే నిద్ర పోతుంటారు. సింగిల్‌ సెల్స్‌ వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిలో ముందు వైపు తలుపునకు కటకటాలు, వెనక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తులోఒక వెంటిలేటర్‌ మాత్రమే ఉంటాయి. అందులోనే ఒక మూల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా గోడచాటుగా ఉండే బాత్‌రూం మాత్రమే ఉంటుంది. జైలులోని ఇతర విషయాలేవీ వీరికి తెలిసే అవకాశం ఉండదు. సమయానికి టిఫిన్‌, టీ, భోజనం మాత్రం అందిస్తారు. చీకటి కొట్టులాంటి సింగిల్‌ సెల్‌లోని ఖైదీలు ఎలాంటి అఘాయిత్యానికి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. స్పూను, గ్లాసు, ప్లేటు లాంటివే కాకుండా బాత్‌రూంలో కనీసం బకెట్‌ కూడా ఉండకుండా చూస్తారు. కారిడార్‌లో ఉండే విద్యుత్‌ దీపమే వారికి రాత్రి వేళ గుడ్డి వెలుగునిస్తుంది. ప్రస్తుతం నిందితులు ఉన్న మహానది బ్యారక్‌లోని సింగిల్‌సెల్స్‌లోనే గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకా్‌షను ఉంచారు.
తొలిరోజే మటన్‌తో భోజనం
 అరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌, శివను శనివారం సాయంత్రం జైలుకు తీసుకురాగా.. వారికి ఆదివారం మొదటి రోజు. ఉదయం అల్పాహారం గా పులిహోర అందజేశామని జైలు సిబ్బంది తెలిపారు. ‘‘జైలు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనంలో 250 గ్రాముల ఆహారాన్ని అందజేశాం. ఆదివారాల్లో ఖైదీలకు మాంసాహారాన్ని అందజేస్తాం. ఆ నలుగురు రాత్రి మటన్‌తో భోజనం చేశారు’’ అని వివరించారు.
చెన్నకేశవులుకు కిడ్నీ సమస్య నిజమే
నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులుకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు జైలు వైద్యులు నిర్ధారించారు. ‘‘అతడికి ఆరు నెలలకోసారి డయాలసిస్‌ అవసరం. గతంలో నిమ్స్‌లో చికిత్స పొందాడు. నిమ్స్‌ వైద్యులను సంప్రదించి వైద్యం అందజేస్తాం’’ అని జైలు వర్గాలు తెలిపాయి.
నరహంతకులకు ఉరే సరి
 నిందులకు ఉరే సరి అంటూ చర్లపల్లి జైలు వద్ద యువత, మహిళలు ఆందోళనలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వారిని జైలుకు తరలించినప్పుడు రాత్రిదాకా.. మళ్లీ ఆదివారం ఉదయం నుంచి ఆందోళన జరిపారు.

(Courtesy Andhrajyothi)

 

RELATED ARTICLES

Latest Updates