మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు షాక్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* కుమారుడు శరత్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఐటి దాడులు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఐటి అధికారులు షాకిచ్చారు. పుల్లారావు కుమారుడు శరత్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లో శరత్‌కు చెందిన ఇల్లు, అవేక్సా కార్పోరేషన్‌ కంపెనీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనపై టిడిపి ప్రభుత్వ హయాంలో భారీగా కాంట్రాక్టులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టుకు సంబంధించి భారీ యంత్రాలను అవేక్సా కార్పోరేషన్‌ సమకూర్చుతుంది. వాటికి సంబంధించి భారీ అవకతవకలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తిం చారు. యంత్రాల కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌, డబ్బును ఎలా సమకూర్చారనే అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల సందర్బంగా భారీగా సీఆర్‌పిఎఫ్‌ బలగా లను భారీగా మోహరించారు. మరోవైపు మాదా పూర్‌లోని డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్‌లు సష్టించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. డిఎస్‌సి ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాని నరేన్‌ చౌదరికి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ అనుచరుడు కిలారి రాజేశ్‌తో నరేన్‌ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమా చారం. ఇదే సమయంలో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యా ల శ్రీనివాసరావు నివాసం లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతు న్నాయి. 9 మందితో కూడిన ఐటీ అధికారుల బందం సోదాలు నిర్వహిస్తోంది. సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డికి చెందిన కార్యాలయం లోనూ రెండు రోజులుగా ఐటీ సోదారులు జరిగాయి. దాదాపు 30 గంటల పాటు సాగిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. సోదాల్లో పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ఏడుగురిపై కేసు
తెల్లరేషన్‌ కార్డుదారుల పేర్లతో కోట్లాది రూపా యిల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలు లభించడంతో ఏడుగురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మేరకు శుక్రవారం నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యా నాగమణి, అబ్దుల్‌, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా పాన్‌కార్డు లేకుండా కోట్లాది రూపాయలు చెలామణి చేశారని సిఐడి గుర్తించింది. మరికొందరి ప్రమేయంపై విచా రణ కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి మనీ ల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. దీనిపై సిఐడి ఇచ్చిన వివరాలతో క్రైమ్‌ నెంబర్‌ 3/2020 కేసు నమోదు చేసిన ఈడి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది. అమరావతి కోర్‌ ఏరియాలో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276 కోట్ల విలువైన 761.34 ఎకరాల్ని రూ.38.56 కోట్లు (రిజిస్ట్రేషన్‌ విలువ) పెట్టి ఎలా కొన్నారనే విషయంపై ప్రధానంగా ఆరా తీస్తోంది. వీరిలో పాన్‌కార్డు కలిగినవారు 268 మంది ఉండగా, లేనివారు 529 మంది ఉన్నారు. ఈ కేసుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఇడి హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయల్‌ ఎపి సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజధాని రావడానికి ముందు నుంచీ పథకం ప్రకారం బినామీలను వాడుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసినట్లు ఈడి పసిగట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి మండలాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు ఎన్ని లక్షల రూపాయిల చొప్పున ఎంతమంది పెట్టుబడి పెట్టి భూములు కొన్నారో ఈడి లెక్క తీసింది.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates