దేశీ సాహిత్య దిశా నిర్ధేశం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ఉ.సా

యాభై వసంతాల ‘సృజనా’త్మక ధిక్కారంతో తెలుగు సాహిత్యం పై నక్సల్బరీ పతాకను ప్రతిష్టించిన ప్రతిష్టాత్మక విరసం మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న సావనీర్ కోసం నన్నొక వ్యాసం రాయమన్నందుకు, నా వ్యాసం కూడా అందులో ఉండాలనుకొన్నందుకు  సాహితీ మిత్రుడు పాణికి కృతజ్ఞతలు.

“విరసం 50 సందర్బంగా సావనీర్ కోసం” రాసిన విజ్ఞాపనలో…“విరసం విప్లవ భావజాలాన్ని అంగీకరించే మిత్రులు, విమర్శనాత్మక తోడ్పాటు నందిస్తున్న సహచరులతోనే ఐదు దశాబ్దాల ప్రయాణం సాగిందని, ప్రగతిశీల అస్తిత్వవాద విప్లవ శక్తుల ఉమ్మడి కార్యాచరణకు తెలుగు లో విస్తారమైన చరిత్ర ఉన్నదని, ఈ పరస్పర సహకారం, ప్రభావం వల్లనే ఇదంతా సాధ్యమైందని” చెప్పటం అక్షర సత్యం. అందుకే అలాంటి విస్తారమైన చరిత్ర క్రమాన్ని, అది పడిన పురిటినొప్పుల ప్రసవవేదనని ఈ సందర్బంగా సంక్షిప్తంగా నైనా ఓసారి సింహావలోకనం చేసుకోవటం అసందర్భమేమి కాదనుకొంటునాను. అందులో భాగంగా 2019 ఫిబ్రవరి 9 -10 తేదిల్లో నల్గొండలో జరిగిన విరసం పాటశాలలో మిత్రులు పాణి  సమర్పించిన “దేశ సాహిత్య, సామాజిక  చరిత్ర మార్క్సిజం” అనే పత్రం చారిత్రక ప్రాదాన్యతను నొక్కిచెప్తూ  నా విమర్శనాత్మక అబిప్రాయన్ని తెలియజేస్తున్నాను.

“నక్సల్స్బరి  రివిజనిజంపై పోరాడింది! కారంచేడు బ్రాహ్మణిజంపై పోరాడమంది” అనే నినాదంతో1985 నాటి కారంచేడుఉద్యమ సందర్భంలో విప్లవశిబిరంలో ఆనాడు నేను లేవనెత్తిన సిద్ధాంత చర్చ అనతికాలంలోనే దళిత రణన్నినాదంగా మారటం తెలిసిందే. కాలంతెచ్చినమర్పుకి అనుగుణంగా మారకుండా గత కులాతీత అగ్ర ‘కులీన’ స్వీయాత్మక ఆదర్శావాదాన్నే యధాతధంగా కొనసాగించాలనే సాంప్రదయవాదాన్ని ఎదిరించి పోరాడటానికే  1990లో “ఎం.ఎల్. సెంటర్” తరపున “ఎదురీత” మాసపత్రిక స్థాపించటం జరిగింది. ఆ క్రమంలో విరసం పితామహుల్లో ఒకరైన త్రిపురనేని మధుసూదనరావు (త్రిమరా) కులం విషయంలో సంప్రదాయ మార్క్సిస్టు దృక్పదముతో ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ఓ వ్యాసం వివాదాస్పదంగా మారింది. దానిపై దళిత మేధావులు, రచయితలు స్పందిస్తూ “కొత్త ప్రశ్నలకి కొత్త సమాధానాలు కావాలి” కొత్త సమాధానాలు నూతన సిద్ధాంత అవగాహనకి భూమిక కావాలి అనే సిద్దాంత చర్చకు నాంది పలకటం జరిగింది.

“ఏటికి ఎదురీదటం  మార్క్సిస్టు – లెనినిస్టు సూత్రం” అనే ట్యాగ్ లైన్ తో నడిచిన ఆనాటి ఎదురీత ప్రతిక (1992 మే సంచిక)లో భారతదేశంలో కులవ్యవస్థను ఎదురించి పోరాడే ‘‘నూతన తరహాలో కార్మిక వర్గ పార్టీ” ఆవశ్యకతను దృష్టికి తెస్తూ ఒక వ్యాసం రాయటం జరిగింది. మా-లె-మావో ఆలోచనా విధానాన్ని బారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయిస్తూ భారత సమాజ కుల వర్గ విషణ చేయాల్సిన అవసరం వుందని ఆ వ్యాసంలో పేర్కొనటం జరిగింది. అలా పేర్కొనటాన్ని సహించలేని అసహనంతో “ఏరూలేదు, ఎదురీతాలేదు, కుల రాజకీయాల రొచ్చుగుంటపార్టీ” అంటూ ఆవ్యాసంపై మండి పడిన త్రిమరా దుర్భాషలకి దిగాడు. “ఎదురీతముఠా మార్క్సిస్టు వ్యతిరేక, విప్లవ వ్యతిరేక, కార్మికవర్గ పార్టీ వ్యతిరేక, కులోన్మాద, పెటీబూర్జువా, సంకుచిత, అరాచక, బోగస్ ముఠా” అంటూ అష్టావక్ర అవలక్షణాలన్నిటినీ మూటగట్టి మా నెత్తినెట్టే ప్రయత్నం చేశాడు.

“వీళ్లు భారతదేశ భౌతిక పరిస్థితులకు మావో ఆలోచనా విధానాన్ని అన్వయిస్తారట. వీళ్ల దృష్టిలో భారతదేశ భౌతిక పరిస్థితులకు అన్వయించటమంటే ఏమిటి? (భౌతిక పునాది స్వభావం లేని ఉపరితల అంశాలైన) కులాలు, మతాలు, దురాచారాలా ? మావో ఇలాంటి వాటికే అన్వయించాడా?…. జర్మనీ, బ్రిటన్, రష్యాల భౌతిక పరిస్థితులకంటే భిన్నమైన భౌతిక పరిస్థితులు చైనాలో వున్నాయని “చైనా సమాజంలో వర్గాల విశ్లేషణ” అనే వ్యాసంలో మావో నిరూపించాడు. మార్క్సిజాన్ని భౌతిక పరిస్థితులకు అన్వయించటమంటే ఇదే” అని ఆదేశించాడు. అంతటితో ఆగకుండా అవధులు దాటిన అగ్రకుల దురహంకారంతో ‘‘ప్రజలకోపాగ్ని జ్వాలలు మిమ్మల్ని చుట్టుముట్టకముందే మీ పత్రికమీద అచ్చువేస్తున్న “ ఏటికి ఎదురీదటం మార్క్సిస్టు-లెనినిస్టు సూత్రం” అనే  వాక్యాన్ని తక్షణం తొలగించండి. లేకపోతే (హైదరాబాద్ రాజధాని) నగరం నడిబొడ్డులో నక్సల్బరి మిమ్మల్ని ఉరితీస్తుంది” అని హెచ్చరిస్తూ హుకుం జారీ చేశాడు (అక్టోబర్ 1992 ఎదురీత). అంతేకాదు ‘‘ప్రాపంచిక దృక్పధమైన మార్క్సిజానికి సార్వజనీన స్వభావవున్నట్లే, మార్క్సిస్టులకి అంతర్జాతీయ దృక్పధం వుండాలని’’ చెపుతూ ‘‘ఎం.ఎల్. సెంటర్ (ఎదురీత) కులపార్టీకి, కులాల రొచ్చుగుంటకి వున్న కులసంకుచిత దృక్పధానికి అంతర్జాతీయ (సార్వజనీన)దృక్పధం ఎలా సాధ్యం’’? అని నిలదీశాడు  “ఒకవేళ ఒకదేశంలో ఒక ప్రత్యేక సామాజికాంశం దేశీయమై, జాతీయమై అంతర్జాతీయం కాకపోతే, మార్క్సిస్టులు అలాంటి సమస్యను స్వీకరించరా? ఈ పోటీ ఎందుకు? ఈ వాదాన్ని బట్టి కులపరమైన ప్రత్యేక సామాజికాంశాన్ని చేపడితే అంతర్జాతీయ దృక్పధాన్ని కోల్పోతారు గనుకనే మార్క్సిస్టులు కులాంశాన్ని చేపట్టకుండా విస్మరిస్తున్నారా?” మార్క్సిజం కేవలం సార్వజనీన వర్గవ్యవస్థకు మాత్రమే అన్వయించే వర్గకుదింపువాదమా? అనే తాత్విక ప్రశ్న సమాధానం రాబట్టాల్సిన శేషప్రశ్నగానే నేటికి మిగిలిపోయింది.ఈ శేష ప్రశ్నలోనే కొత్త ప్రశ్నకు కొత్త సమాధానంచెప్పటంలో భారతదేశ సాంప్రదాయ మార్క్సిస్టుల సైద్దాంతిక వైఫల్యం దాగివుంది. ( “సామాజిక విప్లవం, సమాంతరవిప్లవం కాదు సమగ్రవిప్లవం” – జూలై 1993 ఎదురీత)

అందుకే  ‘‘ఏ కులవారైన, ఏదేశమందున్న పేదలంతా ఒకటి బాధలన్ని ఒకటి, కులం కూడెట్టదుర ఓరన్నా- వర్గ సంగంగట్టు కులన్నా” అంటూ (తెలంగాణ సాయుధరైతాంగ పోరాటకాలంలో) పాటలుగట్టి దేశాలకు అతీతంగా, దేశీయప్రత్యేక కులవ్యవస్థకు అతీతంగా  “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే పిలుపునిచ్చినఅగ్ర‘కులీన’ మార్క్సిస్టుల మడివాడ పిడివాద కార్మికవర్గ అంతర్జాతీయ దృక్పధం ఆచరణలో కులపలాయన వాదానికి దారితీసింది. త్రిమరా తిరకాసువదాన్ని పరిశీలిస్తే ఈ అంత్యర్యం బయటపడుతుంది. లెనిన్ అన్నట్లు మార్క్సిస్టు దృక్పధంతో ఒక అంశాన్ని పరిశీలించటం అంటే సారాంశంలో అందులోని వైరుధ్యాన్ని  పరిశీలించటమేనని తెలిసినా తెలియనట్టుగా దాటవేస్తారు. ఇండియాలో సైతం “ఉన్నత వర్గ కులాలకి నిమ్న వర్గ కులాలకి (High Class Castes and Low Class Castes)మధ్య పాలక పాలిత కుల వైరుధ్యం ఉందని, నిమ్మకులలాల వారు పాలకులు కావటమే తన ఆశయం అని డా:బి.ఆర్.అంబేద్కర్ స్పష్టం చేసినా త్రిమరలాంటి మూస మర్క్రిస్టులు మాత్రం తమ స్వీయాత్మక ఆగ్ర కులాతీత వాదాన్ని అభ్యుదయ ఆదర్శవాదంగానే  చలామణి చేశారు. అందుకు అనువుగా కులాన్ని ఫ్యూడల్ ఉపరితల సంఘికాంశానికి పరిమితం చేశారు. దాన్నే మార్క్సిజంగా ఎలా చెలామణి చేశారో గమనిద్దాం.

“మనుధర్మ దృక్పధం అంటే కుల దృక్పధం. అగ్రవర్ణ దృక్పధమైనా, నిమ్న కుల దృక్పధమైనా అందులో  ఏకుల దృక్పధమైనా మనుధర్మ దృక్పధంమే… కుల ప్రాతిపదికపై ఎవరేమి చేసినా వారు  కులవాదులే… కనుక కుల వ్యతిరేక దృక్పధం నుంచి రాయటమే మనుధర్మ దృక్పధానికి వ్యతిరేకంగా రాయటం అవుతుంది. (ఈ ద్రుష్టితో చూసినప్పుడు) ఆంధ్రజ్యోతిలో రాసిన నా వ్యాసం నూటికి నూరు శాతం మనుధర్మ దృక్పధానికి వ్యతిరేకంగా రాసిన వ్యాసమే … కాబట్టి కులనిర్మూలన ధ్యేయంగాకులవ్యతిరేక పోరాటం చేయాలి. కులవ్యతిరేక పోరాటం అంటే వర్గ పోరాటమే. మార్క్సిజం లెనిజం మావో ఆలోచనా విధానంఅంటే కులవ్యతిరేక (వర్గపోరాట) తత్వశాస్త్రమే”నని బుకాయించి, మరొకవైపు “ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించమని దళితమహాసభకి, నలుపు, ఎదురీత, దళిత్ వాయిస్ పత్రికల బాధ్యులకి సవినయంగా విజప్తి చేస్తున్నాను’’ అనే బుజ్జగింపు మాటలతో చేతులు దులుపుకొన్నాడు. (30-10-1992) (‘‘ మనుశాస్త్రం నశించాలి! మార్క్సిజం వర్ధిల్లాలి ’’! – త్రిమరా)

‘‘మార్క్సిజాన్ని భౌతిక పరిస్థితుకు అన్వయించటమంటే అంటరాని వాళ్ళకి, ఆడోళ్ళకీ అన్వయిచటం కాదు ఉత్పత్తి సంబంధాకి అన్వయిచటమని, ఏది భౌతికవాదమో! ఏది భావవాదమో తెలియని అజ్ఞానులైన ఎం.ఎల్‌.సెంటర్‌ వారు వర్గపోరాట సిద్ధాంతమైన మార్క్సిజాన్ని ఈ దేశ భౌతిక పరిస్థితుకు ఇలా అన్వయిస్తారట అనే అర్థంలో త్రిమరా అపహాస్యం చేశాడు. ఈ దేశ ‘‘నిర్థిష్ట పరిస్థితు’’ అని మేం వాడిన పదాన్ని తన దాడికి మీగా ‘‘భౌతిక పరిస్థితు’’ అని మార్చుకొని మహాదానందంగా మాలో పెద్ద తప్పు పట్టుకున్నట్టు భ్రమింపజేశాడు… త్రిమరా అనుకొంటున్నట్లు ఉత్పత్తి సంబంధాంటే కేవం ఆర్ధికపరమైనవే కావు, ఉత్పత్తిశక్తుతో ముడిపడివున్న (కువర్గ) మానవ సంబంధాు’’ (‘‘సామాజిక విప్లవం సమాంతర విప్లవం కాదు’’ జూలై 1993 ఎదురీత).

‘‘మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనావిధానం అంటే మంత్రోచ్ఛాటన కాదు. మార్క్సిజానికి ప్రాణమైన నిర్ధిష్ట పరిస్థితిని నిర్ధింష్టంగా పరిశీలించి దానికనుగుణమైన విధానాన్ని, వైధానికాన్ని రూపొందించుకోవటం. ఈ దేశాన్ని నిర్ధిష్టంగా పరిశీలిస్తే ఇది వర్గకు సమాజమని తేుతుంది... ఇతర దేశాల్లో ఒక్క వర్గచైతన్యమే ఉంటే భారతదేశంలో వర్గకు చైతన్యాు రెండూ ఉన్నాయి. ఈ దేశ రాజ్యానికి, ప్రభుత్వానికి, పార్టీకి కేవం వర్గస్వభామేగాక వర్గకుమత స్వభావాు కూడా ఉన్నాయి. ఈ దేశ కమ్యూనిస్టు నాయకు, నక్సలైట్‌ నాయకు చేయని ఈ నిర్ధిష్ట పరిస్థితు నిర్ధిష్ట పరిశీన డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ చేశాడు. కనుక అంబేద్కర్‌ సామాజిక విశ్లేషణ ప్రాముఖ్యతని అర్ధం చేసుకొని, గుర్తించి దాన్ని భారత విప్లవోద్యమానికి కరదీపికగా విమర్శనాత్మకంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం దిక్సూచిగా, అంబేద్కర్‌ నిర్ధిష్ట సామాజిక విశ్లేషణ కరదీపికగా భారత విప్లవోద్యమాన్ని (దేశీ విప్లవ సాహిత్యోద్యమాన్ని) నిర్మించటం ఈ దేశ విప్లవ నమూనాగా ఉంటుంది’’. (‘‘మావో శతజయంతి సీరియల్‌ వ్యాసాు ` జూలై 1993 ఎదురీత’’)

దీనికి భిన్నంగా త్రిమరా ‘‘అంబేద్కర్‌ని మార్క్స్‌ని కపానే ప్రయత్నం తప్పు. మార్క్సిజంలో రెండోది కపడానికి వీల్లేదు. ఇంకోటి, అంబేద్కర్‌ గొప్ప తాత్వికుడేమీ కాదు, ఆయనకు గొప్ప తాత్వాక దృక్పధమేమీలేదు. అంబేద్కర్‌ గొప్పతనమల్లా దళితు పక్షాన ఏకాకిగా నిబడి పోరాడటం. అంతవరకు ఆయన ఆదర్శమానవుడు. ఆయన్ని మనం గౌరవించి తీరాలి. అంబేద్కర్‌ ద్వారా భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకొంటాం, మార్క్సిజం ద్వారా మారుస్తాం అనే వాదన పైకి కొంత వరకు బాగానే వుంటుంది. కానీ నిజానికి భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకోవటానికి అంబేద్కర్‌ ఒక్కడే చాడు. ఆయన కుం మీద రాసిన గ్రంధం మనుధర్మశాస్త్ర ఖండనేగాని, భారతదేశంలో నిర్ధిష్టంగా వున్న కువ్యవస్థ ఖండన కాదు… కుం మీద అంబేద్కర్‌ కంటే గొప్పగా రజనీ కొఠారీలాంటి వాళ్లు పనిచేశారు. అవి మనకి బాగా పనికొస్తాయి’’ అన్నాడు. (మార్క్సిజం ` సాహిత్యవిమర్శ, త్రిమరా ఇంటర్వ్యూ)

వ్యక్తిగతంగా ఆనాడు త్రిమరా నక్స్బరి ధిక్కారానికి అగ్రకు దురహంకారాన్ని జోడిరచి దళిత కుధిక్కారానికి వ్యతిరేకంగా హెచ్చరికు జారీ చేసినా, వినయ విధేయతతో విఙ్ఞప్తు చేసినా సంస్థాగతంగా విరసం ఆనాటి దళితవాద సిద్ధాంత చర్చ ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకోక తప్పలేదు. అదే ఏడాది (1993 అక్టోబర్‌)లో హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఎ.ఐ.ఎల్‌.ఆర్‌.సి. మహాసభ సందర్బంగా విరసం వారిని ఉద్దేశించి ఆనాడు నేను రాసిన వ్యాసంలో ఆవిషయాన్ని ఇలా ప్రస్తావించాను.

‘‘జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రజాసాంస్కృతిక విప్లవ యుద్ధనౌక కా.గద్దర్‌ సారధ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఎ.ఐ.ఎల్‌.ఆర్‌.సి 8వ జాతీయ మహాసభు జయప్రదం కావాని ఆకాంక్షిస్తున్నాను. ‘‘సామ్రజ్యవాద ప్రపంచీకరణ సంస్కృతికి, ఫ్యూడల్‌ కాషాయీకరణ సంస్కృతికి వ్యతిరేకంగా సాంస్కృతిక రంగంలో సువిశా ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించ’’టానికి ఈ సభల్లో పిుపునివ్వటం ఆహ్వానించదగ్గ పరిణామం… మన దేశ సాంస్కృతిక రంగంలో పోటీపడుతున్న విభిన్న భావాల వ్యక్తీకరణకి తావిచ్చే విధంగా సువిశా దృక్పధంతో ప్రజా సంస్కృతిపై ఈ సభల్లో చర్చను ఆహ్వానించటం అభినందనీయం.

పాకపాలిత వర్గవైరుధ్యా సమాజంలో పీడిత శ్రామికవర్గా సంస్కృతినే ప్రజ సంస్కృతిగా పరిగణించటం పరిపాటి. పాకు భావానే ప్రజ భావాుగా చెలామణి చేస్తూ, పాకవర్గా సంస్కృతిని ప్రజపై రుద్దే సాంస్కృతిక దాడి నుండి ప్రజ సంస్కృతిని పరిరక్షించటం ప్రజాపక్షం వహించేవారి కర్తవ్యం. పాకవర్గా సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజాసాంస్కృతికోద్యమాన్ని నిర్మంచటం సాంస్కృతికరంగ కర్తవ్యం. ఇండియా సామాజిక వ్యవవస్థ కేవం వర్గవ్యవస్ధే అయితే సాంస్కృతిక రంగంలో ‘‘ప్రజాసంస్కృతి’’ అనే శ్రామిక వర్గ దృక్పధం సరిపోతుంది. ఈ దృక్పధంతో ఎవరు ప్రజు? ఏది ప్రజాసంస్కృతి? అనే ప్రశ్నకు సాధారణమైన సమాధానాల్ని రాబట్టవచ్చు. కానీ ఇండియాలో వర్గవ్యవస్థతోపాటు ప్రపంచంలో మరెక్కడాలేని ‘అదనపు ప్రత్యేక వర్ణకు బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ’ (Additional Specific Varna-Caste Brahminical Social System) ఉనికిలోవున్నపుడు పై ప్రశ్నకు సామాధానం రాబట్టాంటే వర్గ`కు ఉమ్మడి దృక్పధం వుండటం అవసరం. సామ్రాజ్యవాద, ఫ్యూడల్‌ సంస్కృతు నుండి జాతీయ సంస్కృతిని, ప్రజ శ్రామిక ప్రజాస్వామిక సంస్కృతిని కాపాడాంటే అదనపు ప్రత్యేక బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సంస్కృతికి వ్యతిరేకంగా బహుజాతు బహుళ బహుజన  సామాజిక ప్రజాస్వామ్య, జాతీయ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించటం అవసరం. అపుడు మాత్రమే అది ఇండియా తరహా దేశీయ ప్రత్యేక ప్రజా సంస్కృతి (Indianised Desi specific peoples culture)అవుతుంది’’ అనిచెప్పి ఈ దృక్పధాన్ని స్వీకరించాని విఙ్ఞప్తి చేయటం జరిగింది. (ఎ.ఐ.ఎల్‌.ఆర్‌.సి సభ సందర్భంగా ‘‘గోదావరి కెరటాు’’  పత్రికకోసం 1993 అక్టోబర్‌లో రాసిన వ్యాసం)

కానీ విరసం ఆ సభల్లో ఆశించినంత మార్పు తీసుకోలేదు. ఆ సభనాటి ఎ.ఐ.ఎల్‌.ఆర్‌.సి ప్రణాళికే అందుకు నిదర్శనం. ప్రణాళికలోని 9వ అంశం (ఐ)లో (Castism, Communalism, Male Chauvinism and eroticism of  Fuedal Parentage) ‘‘కుతత్వం, మతతత్వం, మగతత్వం, లైంగికత్వంలాంటి అంశాన్ని ఫ్యూడల్‌ వారసత్వ అంశాలేన’’నే సాంప్రదాయ వర్గకుదింపువాదానికే పరిమితమయింది. అగ్రకు సామాజిక దురహంకార తత్వమైనా, అణగారిన కులా సామాజిక ప్రజాస్వామ్య తత్వమైనా ఒకటేనన్నట్లు, మెజారిటేరియన్‌ హిందూ మతదురహంకార తత్వమైనా ముస్లిం మైనారిటీ మతస్వేచ్ఛా తత్వమైనా ఒకటేనన్నట్లు కుమతా విషయంలో రెండిరటిని ఒకేగాట కట్టారు. త్రిమరా అన్నట్లు ఏ కుతత్వమైనా మనుధర్మ కుతత్వమేనని చెప్పిన విచ్చక్షణారహిత వితండవాదాన్నే ఆనాడు విరసం ఆశ్రయించింది.

మరి ఈనాడైనా, 50ఏళ్ల విరసం మహాసభ సందర్భంగానైనా గతదాటవేత వైఖరినే యధాతధంగా కొనసాగిస్తారా? లేక ఓ మౌలిక మార్పుతీసుకునే దిశలో ‘‘దేశీ సాహిత్య దిశా నిర్దేశం’’ చేస్తారా? అనేది వర్తమాన చరిత్ర ఎదురుజూస్తున్న  చారిత్రక సందర్భం. ఇందులో ఇమిడివున్న అనేక అంశా సంగతి అలా ఉంచితే 2019 ఫిబ్రవరి 910 తేదీల్లో జరిగిన విరసం పాఠశాలో సాహితీ మిత్రుడు పాణి సమర్పించిన ‘‘దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర మార్క్సిజం’’ అనే పత్రం మాత్రం విరసం చరిత్రను మార్చేందుకు దోహదపడే చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పత్రంగా నేను భావిస్తున్నాను. మరింత లోతైన నిర్ధిష్ట పరిశీనతో కూడిన విశ్లేషణ అవసరమని, అందులోని పరిమితుపై ` లోపాపై చర్చ జరగటం అవసరమని భావిస్తూనే ఈ విమర్శనాత్మక దృష్టితో ‘‘దేశీదిశ’’ త్రైమాస పత్రిక స్థాపకునిగా ఈ కీక పత్రాన్ని స్వాగతిస్తున్నాను.

దేశంలో నేడు ముంచుకొస్తున్న మనువాద, కాషాయ, కార్పొరేట్‌ ఫాసిజానికి వ్యతిరేకంగా, తక్షణం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్లొబుకుతున్న ప్రజాప్రతిఘటనా ఉద్యమంలో క్రియాశీంగా పాల్గొనాల్సి రావటం వన ఏర్పడిన సమయాభావంతో ఈ పత్రంపై ప్రస్తుతం విరసం సభలోప నేను సమగ్ర పరిశీన చేయలేకపోతున్నాను. సమయం చూసుకొని సవివరమైన విశ్లేషణతో అరుణతార పత్రికకి నా సాహిత్య విమర్శనా వ్యాసాన్ని పంపగను.

సంస్థాపక సంపాదకులు
దేశీదిశ

RELATED ARTICLES

Latest Updates