‘భౌతిక దూరానికీ’ బిల్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘సోషల్‌ డిస్టెన్స్‌ సెక్యూరిటీ చార్జీ’ అంటూ వసూలు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఘటన 

హైదరాబాద్‌ : చిత్ర విచిత్ర చార్జీలతో జేబులు గుల్ల చేసిన ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధితుడు స్వయంగా వైద్యుడే కావడం గమనార్హం. కరోనాతో.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో పేరొందిన ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరిన ఓ వైద్యుడికి భౌతిక దూరం పాటించేలా (సోషల్‌ డిస్టెన్స్‌ సెక్యూరిటీ చార్జీ) చూసినందుకు మూడు రోజులకు ఏకంగా రూ.6,420 బిల్లు వేశారు. 72 గంటల మొత్తం చికిత్సకు ఏకంగా రూ.1.80 లక్షల బిల్లు చేశారు.

అసలు కంటే కొసరే ఎక్కువ…
మీర్‌పేటకు చెందిన ఓ వైద్యుడు కరోనా సోకడంతో ఈ నెల 4వ తేదీన బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. ఆయన ప్రత్యేక గదిలో కిత్స పొందారు. కేవలం పీపీఈ కిట్లకే రోజుకు రూ.24,300 చొప్పున మూడు రోజుల్లోనే రూ.72,900 చార్జ్‌ చేశారు. ల్యాండ్రీ ఖర్చు కింద రూ.2,440 చొప్పున రూ.7,320, రూమ్‌ ఫ్యూరిఫయర్‌ కింద రోజుకు రూ.1,500 మొత్తం రూ.4500 బిల్లు వేశారు. ఇక ల్యాబ్‌ చార్జీలుగా రూ.29,500, ఫార్మసీ కింద రూ.24 వేలు బిల్లు వేశారు. గది శానిటేషన్‌కు రూ.6,720 (రోజుకు రూ.2,240) తీసుకున్నారు. వాస్తవానికి  ఫార్మసీ, ల్యాబ్‌ చార్జీలు, కన్సల్టెన్సీ ఫీజులు, ఎమర్జెన్సీ వైద్యుడు, నర్సింగ్‌ చార్జీలన్నీ కలుపుకొంటే రూ.57 వేలు కాగా, మిగిలినవాటికి రూ.1.22 లక్షలైంది. అంటే చికిత్సకు అయిన ఖర్చు కంటే ఇతర చార్జీలే ఎక్కువ. అన్నింటికంటే సోషల్‌ డిస్టెన్స్‌ సెక్యూరిటీ చార్జీల కింద రూ.6,420 బిల్లు వేయడం ఏమిటో అర్థం కాలేదని, వాస్తవానికి భౌతిక దూరం నిబంధన అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆస్పత్రి యాజమాన్యందేనని బాధితుడు వాపోయారు. కాగా కొందరు పౌరులు ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.  అయితే కొన్ని ఆస్పత్రులు చాలా తెలివిగా రోగి చేరేటప్పుడే వారితో ‘నాన్‌ కొవిడ్‌’ రోగులమంటూ సంతకం తీసుకుంటున్నాయి. బిల్లుల విషయం బయటకు వచ్చినా… అది కరోనా రోగి బిల్లు కాదని వారిచేతనే చెప్పించేందుకు ఈ ఎత్తుగడ వేశారు.

ప్రైవేటు ఆస్పత్రులపై  పర్యవేక్షణ ఉండాలి
కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయి. మంచాల కొరత చూపి అందినంత గుంజుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడా చికిత్స జరగడం లేదు. కరోనా రోగులకు ఎక్కడా లేని విఽధంగా కొత్త కొత్త పేర్లతో బిల్లులు వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి.
-జగన్‌, ప్రైవేటు ఆస్పత్రుల  బాధితుల సంఘం అధ్యక్షుడు

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates